Metro Train: అచ్చం అమ్మాయిలాగానే.. మెట్రో రైల్లో ఓ కుర్రాడి డాన్స్.. పక్కనే కూర్చున్న ప్రయాణీకుల రియాక్షన్ ఇదీ..!

ABN , First Publish Date - 2023-08-18T19:45:57+05:30 IST

రైళ్లలో వెకిలి చేష్టలు చేస్తూ వీడియోలు తీసుకోవడం ఇటీవల ఎక్కువైపోయింది. కొందరు రీల్స్ కోసం మరీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. చివరకు యువతులు కూడా తామేమీ తక్కువ కాదంటూ.. రైలు బోగీల్లో, ప్లాట్‌ఫామ్‌లపై చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు...

Metro Train: అచ్చం అమ్మాయిలాగానే.. మెట్రో రైల్లో ఓ కుర్రాడి డాన్స్.. పక్కనే కూర్చున్న ప్రయాణీకుల రియాక్షన్ ఇదీ..!

రైళ్లలో వెకిలి చేష్టలు చేస్తూ వీడియోలు తీసుకోవడం ఇటీవల ఎక్కువైపోయింది. కొందరు రీల్స్ కోసం మరీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. చివరకు యువతులు కూడా తామేమీ తక్కువ కాదంటూ.. రైలు బోగీల్లో, ప్లాట్‌ఫామ్‌లపై చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కుర్రాడు మెట్రో రైల్లో అచ్చం అమ్మాయిలాగానే డాన్స్ చేశాడు. ఇతన్ని చూసి పక్కనే కూర్చున్న ప్రయాణికులు అవాక్కయ్యారు.

సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో రైల్లో (Delhi Metro Rail) చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు అందరితో పాటే మెట్రో రైలు ఎక్కుతారు. అయితే రైలు కదిలిన కాసేపటికి వారిలో ఓ యువకుడికి ఒక్కసారిగా పూనకం వస్తుంది. వెంటనే యువతి చున్నీ మెడలో వేసుకుని డాన్స్ చేస్తాడు. అది కూడా అచ్చం యువతి (young man danced like a woman) లాగే నడుం తిప్పుతూ అటూ, ఇటూ తిరుగుతూ స్టెప్పులు వేసేస్తాడు. అతను ఒక్కసారిగా ఇలా డాన్స్ చేసేసరికి పక్కన కూర్చున్న వారు సడన్ షాక్ అవుతారు.

Wife: భర్తకు విడాకులు ఇచ్చి.. రూ.8.30 లక్షలు నష్టపోయిందో భార్య.. అదేంటని అవాక్కవుతున్నారా..?

పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులు.. ఇతడి డాన్స్ చూసి ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. అయినా ఆ వ్యక్తి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పాటికి తాను డాన్సు వేస్తూ ఉంటాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇతనేంటీ.. కొంచెం తేడాగా ఉన్నట్టున్నాడే’’.. అంటూ కొందరు, ‘‘రైళ్లలో ఇలా చేయడం ప్యాషన్ అయిపోయింది’’.. అని మరికొందరు, ‘‘ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Wife: ఫోన్ వచ్చినప్పుడల్లా దూరంగా వెళ్లి మాట్లాడుతున్న భార్య.. అనుమానం వచ్చి చాటుగా విన్న భర్తకు మైండ్‌బ్లాక్.. చివరకు..!

Updated Date - 2023-08-18T19:45:57+05:30 IST