Viral Video: నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో.. ఆర్మీ జవాన్‌కు కుటుంబ సభ్యులు ఎలా స్వాగతం పలికారో చూస్తే..!

ABN , First Publish Date - 2023-08-17T19:31:40+05:30 IST

దేశ రక్షణే ధ్యేయంగా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న సైనికులు.. అత్యవసర సమయాల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటారు. అందుకే ఆర్మీ జవాన్లకు ప్రజల నుంచి అమితమైన గౌవర మర్యాదలు లభిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వారిని రియల్ హీరోల్లా చూస్తుంటారు. అలాంటిది...

Viral Video: నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో.. ఆర్మీ జవాన్‌కు కుటుంబ సభ్యులు ఎలా స్వాగతం పలికారో చూస్తే..!

దేశ రక్షణే ధ్యేయంగా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న సైనికులు.. అత్యవసర సమయాల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటారు. అందుకే ఆర్మీ జవాన్లకు ప్రజల నుంచి అమితమైన గౌవర మర్యాదలు లభిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వారిని రియల్ హీరోల్లా చూస్తుంటారు. అలాంటిది ఆర్మీ సైనికుల కుటుంబ సభ్యులకు ఇంకెంత ఆనందం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్మీలో పని చేస్తున్న కొడుకు చాలా కాలం తర్వాత ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. వారు స్వాగతం పలికిన విధానం.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఆర్మీలో పని చేస్తున్న (Army soldier) యువకుడు.. చాలా కాలం తర్వాత తన సొంతూరికి వెళ్లాడు. దీంతో అతడి తండ్రి కొడుకును కారులో ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి వద్ద కారు దిగిన కొడుక్కి.. అంతా కలిసి సడన్ సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. ఇంటి గడప నుంచి కారు వరకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్‌పై (Red carpet) కవాతు చేస్తూ వెళ్లిన జవాను.. తన తల్లి ఎదుట నిలబడి సెల్యూట్ చేశాడు. తర్వాత తల్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరికొంతమంది కుటుంబ సభ్యులు అతడిపై పూలు చల్లి ఆశీర్వదించారు.

Viral: ఓరి దేవుడో.. ఇలాంటి బాస్‌లు కూడా ఉంటారా..? ఆఫీసులో ఓ ఉద్యోగి ఫోన్‌ను ఛార్జింగ్ పెడుతున్నాడని..!

చివరగా తన తండ్రికి కూడా సెల్యూట్ చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. కొడుకును ఆర్మీ దుస్తుల్లో చూసిన తండ్రి ఎంతో మురిసిపోతూ కౌగిలించుకున్నాడు. కుటుంబ సభ్యులందరూ అతన్ని కౌగిలించుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ‘‘మన భారతీయులు, మన జవాన్ల మధ్య ఉన్న భావోద్వేగ సంబంధాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి. ఈ కుటుంబానికి నా అభినందనలు’’.. అని ప్రస్తావించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: కనివినీ ఎరుగని వింత కేసు.. కొడుకు బర్త్ సర్టిఫికెట్‌లో భర్త పేరును తీసేసి.. ప్రియుడి పేరును చేర్చండంటూ..!

Updated Date - 2023-08-17T19:31:40+05:30 IST