Viral: వావ్.. నువ్వు నిజంగా సూపర్ బ్రదర్.. 25 ఏళ్ల ఈ కుర్రాడి క్రియేటివిటీని చూసి ఫిదా అవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-08-18T15:34:39+05:30 IST

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే నానుడిని ఇప్పటికే చాలామంది రుజువు చేసి చూపించారు. ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తమలోని టాలెంట్‌కి పదును పెట్టి పది మందిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన సక్సెస్ స్టోరీలు సోషల్ మీడియాలో..

Viral: వావ్.. నువ్వు నిజంగా సూపర్ బ్రదర్.. 25 ఏళ్ల ఈ కుర్రాడి క్రియేటివిటీని చూసి ఫిదా అవడం ఖాయం..!

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే నానుడిని ఇప్పటికే చాలామంది రుజువు చేసి చూపించారు. ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తమలోని టాలెంట్‌కి పదును పెట్టి పది మందిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన సక్సెస్ స్టోరీలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ యువకుడికి సంబంధించిన వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. 25 ఏళ్ల కుర్రాడి క్రియేటిటీని చూసి.. అంతా రాజమౌళి తీసిన ఈగ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

బీహార్‌కు (Bihar) చెందిన శశికాంత్ ప్రజాపతి అనే 25 ఏళ్ల కళాకారుడు అరుదైన రికార్డు (rare record) సృష్టించాడు. స్పూన్ తయారు చేయడం సులభమే కావచ్చు.. కానీ చిన్న స్పూన్ తయారు చేయమంటే ఎరవైనా ఆలోచనలో పడతారు. అందులోనూ ప్రపంచంలోనే అత్యంత చిన్న చెక్క స్పూన్ (World's smallest wooden spoon) తయారు చేయమంటే.. వామ్మో! మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తారు. కానీ శశికాంత్ దీన్ని అవలీలగా చేసేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Record) నెలకొల్పాడు. 2022లో నవరన్ ప్రజాపతి మూర్తికర్ అనే కళాకారుడు రెండీ మిల్లీమీటర్ల చెంచాను తయారు చేసి రికార్డు సృష్టించాడు. ప్రజాపతి మూర్తికర్ రికార్డును ప్రస్తుతం శశికాంత్ బద్దలుకొట్టాడు.

adhaar Card: ప్రధాన మంత్రి లోన్ స్కీమ్.. ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు రూ.3 లక్షలు ఇస్తారట.. ఇందులో నిజమెంతంటే..!

bihar-Shashikant-Prajapati-.jpg

చెక్క స్పూన్ తయారీలో మొదట్లో చాలాసార్లు విఫలమయ్యానని, కానీ చివరకు అనుకున్నది సాధించినట్లు శశికాంత్ తెలిపాడు. ఇలాంటి ప్రయోగాలు ఇతడికి ఇదేం కొత్త కాదు. 2020లో ఇతను పెన్సిల్ లెడ్‌లో అత్యధిక గొలుసు లింకులను చెక్కడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సాధించాడు. 2020లో 126 లింక్‌లను సృష్టించగా.. 2021లో అదే పెన్సిల్ లెడ్‌లో 236 లింక్‌లను సృష్టించి తన రికార్డును తానే బద్ధలుకొట్టాడు. ప్రస్తుతం అత్యంత చిన్న చెక్క చెంచాను సృష్టించి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు శశికాంత్‌ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈగ సినిమాలో అత్యంత చిన్న రెక్కలు తయారు చేసినట్లుగా.. ఇక్కడ చెక్క స్పూన్ తయారు చేశాడు.. అది రీల్.. ఇది రియల్’’.. అంటూ కొందరు, ‘‘ఇంత చిన్న చెంచాను ఎప్పుడూ చూల్లేదు’’.. అంటూ మరికొందరు, ‘‘నువ్వు నిజంగా సూపర్ బ్రదర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral: రోడ్డు పక్కన చిన్న కాఫీ స్టాల్.. తాగేందుకు వెళ్లి.. అక్కడ ఉన్న బోర్డుపై ఏం రాసి ఉందో చదివి అవాక్కైన కస్టమర్లు..!

Updated Date - 2023-08-18T15:34:39+05:30 IST