Viral Video: అందరి ముందూ హీరోలా బిల్డప్ ఇస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. జన్మలో తింగరి పనులు చేయరు..

ABN , First Publish Date - 2023-08-20T21:44:24+05:30 IST

పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని కొందరు, అందరి కంటే తామే గొప్ప అనుకుంటూ మరికొందరు ఏవేవో సాహసాలు చేసి చివరికి ప్రాణం మీదకు తెచ్చుకుంటుంటారు. అయినా అలాంటి వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. దీనికితోడు ఇటీవల రీల్స్ మాయలో పడి ఎంతో మంది...

Viral Video: అందరి ముందూ హీరోలా బిల్డప్ ఇస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. జన్మలో తింగరి పనులు చేయరు..

పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని కొందరు, అందరి కంటే తామే గొప్ప అనుకుంటూ మరికొందరు ఏవేవో సాహసాలు చేసి చివరికి ప్రాణం మీదకు తెచ్చుకుంటుంటారు. అయినా అలాంటి వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. దీనికితోడు ఇటీవల రీల్స్ మాయలో పడి ఎంతో మంది పిచ్చి పిచ్చి పనులు చేయడం ఎక్కువైపోయింది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ బాలుడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. జన్మలో తింగరి పనులు చేయరు’’.. అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. స్విమ్మింగ్ పూల్ (Swimming pool) వద్ద కొందరు స్నానం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ బాలుడు ఈత కొట్టేందుకు అక్కడికి వస్తాడు. వచ్చిన వాడు అందరి మాదిరే ఈత ఆడకుండా ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తాడు. అందరి చూస్తుండగా.. ‘‘చూడండి నీళ్లలోకి ఎలా దూకుతానో’’.. అనుకుంటూ వెనక్కు తిరిగి నిలబడతాడు. కాసేపటి తర్వాత అలాగే ఒక్కసారిగా (boy jumped into the swimming pool) నీళ్లలోకి వెనక్కు దూకేస్తాడు.

Viral Video: ముంగిసను మించిపోయిన ఉడుత.. పారిపోతున్న పాముకు ఎదురెళ్లి మరీ ఇబ్బంది పెట్టింది.. చివరికి ఏం జరిగిందో చూడండి..

అయితే అదుపు తప్పి స్విమ్మింగ్ పూల్లో కాకుండా పక్కనే సందులో ఇరుక్కుపోతాడు. ఈ క్రమంలో అతడి కడుపు, తలకు గాయాలైనట్లు (Injured) తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడే ఉన్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అతన్ని కాపాడతారు. ఈ ఘటనను వీడియో కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‍‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సాహసాలు ఎవరు చేయమన్నారు’’.. అని కొందరు, ‘‘అనుభవం లేనిది ఇలాంటి పనులు చేయొద్దు’’.. అంటూ మరికొందరు, ‘‘రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Crime News: ఉన్నట్టుండి బావను దూరం పెట్టిన మరదలు.. ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లగా..

Updated Date - 2023-08-20T21:44:24+05:30 IST