Viral Video: ముంగిసను మించిపోయిన ఉడుత.. పారిపోతున్న పాముకు ఎదురెళ్లి మరీ ఇబ్బంది పెట్టింది.. చివరికి ఏం జరిగిందో చూడండి..

ABN , First Publish Date - 2023-08-20T20:37:01+05:30 IST

పామును చూడగానే ముంగిస దాడి చేయడం, ముంగిసను చూడగానే పాము పారిపోవడం.. కొన్నిసార్లు రెండూ పోటాపోటీగా తలపడడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు పాము చేతిలో ముంగిస ప్రాణాలు కోల్పేతే.. మరికొన్నిసార్లు పామును ముంగిస వెంటాడి వెంటాడి మరీ చంపేస్తుటుంది. ఇలాంటి...

Viral Video: ముంగిసను మించిపోయిన ఉడుత.. పారిపోతున్న పాముకు ఎదురెళ్లి మరీ ఇబ్బంది పెట్టింది.. చివరికి ఏం జరిగిందో చూడండి..

పామును చూడగానే ముంగిస దాడి చేయడం, ముంగిసను చూడగానే పాము పారిపోవడం.. కొన్నిసార్లు రెండూ పోటాపోటీగా తలపడడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు పాము చేతిలో ముంగిస ప్రాణాలు కోల్పేతే.. మరికొన్నిసార్లు పామును ముంగిస వెంటాడి వెంటాడి మరీ చంపేస్తుటుంది. ఇలాంటి ఘటనలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఉడుతను చూసి నాగుపాము భయపడిపోయింది. అయినా ఉడుత పామును వదలకుండా తెగ ఇబ్బంది పెట్టింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ నాగుపాము పొదల మధ్యలో నుంచి ఆహారం కోసం వెతుక్కుంటూ బయటికి వస్తుంది. అదే సమయంలో అక్కడే ఉన్న ఉడుత.. పామును చూస్తుంది. కాసేపు ఆట పట్టిద్దాం అనుకుందో ఏమో గానీ.. దాని వద్దకు వెళ్లి కెలికి మరీ ఇబ్బంది పెడుతుంది. పదే పదే ముందు కాళ్లతో గోకుతూ దూరంగా పారిపోతుంది. దీంతో పాముకు (snake) చిర్రెత్తుకొచ్చి.. ఉడుతను కాటేయాలని చూస్తుంది. అయినా వెనక్కుతగ్గని ఉడుత.. ‘‘చేతనైతే నన్ను కాటేయ్ చూద్దాం’’.. అనుకుంటూ పామును ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. పాము చాలా సార్లు ఉడుతను (squirrel) కాటేయాలని చూసి విఫలమవుతుంది.

Viral Video: రాత్రి వేళ మనుషులు లేకుండానే నడుస్తున్న వాహనాలు.. దయ్యాలే అని అంతా భయపడ్డారు.. చివరకు ఊహించని ట్విస్ట్..

చివరకు చేసేదేమీలేక.. ఈ ఉడుతతో ఎందుకొచ్చిన గొడవలే.. అనుకుంటూ పొదల్లో దూరి పారిపోతుంది. అప్పటికీ శాంతించని ఉడుత.. పామును వెంబడించి రెండు కాళ్ల మీద నిలబడి తొంగి తొంగి చూస్తుంది. ‘‘నాతో తలపడలేక.. పారిపోతున్నావా’’.. అన్నట్లుగా పాము వైపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏడాది క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ ఉడుత మామూములు ఉడుత కాదురోయ్’’.. అంటూ కొందరు, ‘‘పామునే పరుగులు పెట్టించింది’’.. అని మరికొందరు, ‘‘దీని ముందు ముంగిస కూడా దిగదుడుపే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Crime News: ఉన్నట్టుండి బావను దూరం పెట్టిన మరదలు.. ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లగా..

Updated Date - 2023-08-20T20:37:01+05:30 IST