Share News

సీఐడీ సీరియల్స్‌లో కనిపించే ఈ నటుడిని గుర్తుపట్టారా..? 53 ఏళ్ల వయసులో ఎలా చనిపోయారంటే..

ABN , First Publish Date - 2023-12-05T14:43:14+05:30 IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ టెలివిజన్ షోలలో ఒకటైన సీఐడీ ఫేం దినేశ్ ఫడ్నీస్ సోమవారం మృతి చెందారు. 57 సంవత్సరాల వయసున్న ఈయన కొంతకాలంగా...

సీఐడీ సీరియల్స్‌లో కనిపించే ఈ నటుడిని గుర్తుపట్టారా..? 53 ఏళ్ల వయసులో ఎలా చనిపోయారంటే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ టెలివిజన్ షోలలో ఒకటైన సీఐడీ ఫేం దినేశ్ ఫడ్నీస్ సోమవారం మృతి చెందారు. 57 సంవత్సరాల వయసున్న ఈయన కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. ఈ వార్తను దినేశ్ సహనటుడు, మిత్రుడైన దయానంద్ శెట్టి ధృవీకరించాడు. దినేశ్ అంత్యక్రియలు మంగళవారం ముంబై బోరివాలి ప్రాంత పరిధి దౌలత్ నగర్ శ్మవాశన వాటికలో జరుగుతాయని తెలిపారు. దినేష మృతి విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

సీఐడీ షోలో దినేశ్ ఫ్రెడెరిక్స్ అనే పాత్ర పోషించాడు. సుమారు 20 ఏళ్ల పాటు ఆయన ఈ షోలో నటిస్తూ వచ్చాడు. 1998లో మొదలైన ఈ షో 2018 వరకూ నడిచింది. ఈ షో ఎంత విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో నటించిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ప్రత్యేకంగా దినేశ్‌కు మంచి పేరు తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. ఈయన కొన్ని సీరియల్స్‌తో పాటూ సుమారు 30 హిందీ చిత్రాల్లోనూ వివిధ పాత్రలను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. మరోవైపు ఈయన సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండేవారు. తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకునేవారు. దినేశ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటూ అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు.

Updated Date - 2023-12-05T14:43:15+05:30 IST