Kriti Verma: ఎవరీ కృతీ వర్మ..? రూ.264 కోట్ల స్కామ్‌లో తెరపైకి ఈమె పేరు.. జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా జాబ్‌కు గుడ్ బై చెప్పి..!

ABN , First Publish Date - 2023-09-13T19:10:01+05:30 IST

మనీలాండరింగ్ కేసులో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, బాలీవుడ్ బ్యూటీ కృతి వర్మ పేరును చేర్చడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులో సుమారు రూ.264కోట్ల స్కామ్ జరిగినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడితో సంబంధాలు ఉండడంతో పాటూ..

Kriti Verma: ఎవరీ కృతీ వర్మ..? రూ.264 కోట్ల స్కామ్‌లో తెరపైకి ఈమె పేరు.. జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా జాబ్‌కు గుడ్ బై చెప్పి..!

మనీలాండరింగ్ కేసులో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, బాలీవుడ్ బ్యూటీ కృతి వర్మ పేరును చేర్చడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులో సుమారు రూ.264కోట్ల స్కామ్ జరిగినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడితో సంబంధాలు ఉండడంతో పాటూ ఆస్తులు కూడా కొనుగోలు చేసినట్లు తేలడంతో ప్రస్తుతం కృతి వర్మను అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఇంతకీ ఎవరీ కృతి వర్మ.. జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన ఈమె తర్వాత ఎందుకు జాబ్‌కు చెప్పాల్సి వచ్చింది... తదితర వివరాల్లోకి వెళితే..

టీడీఎస్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు డజనుకు పైగా నిందితుల వివరాలను బయటపెట్టారు. భూషణ్ పాటిల్, రాజేష్ శెట్టి సహా పలువురు నిందితులతో కృతి వర్మకు సంబంధం ఉన్నట్లు ఈడీ చార్జిషీట్‌లో అధికారులు పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో కృతి వర్మ ప్రమేయం ఉన్నట్లు కూడా రుజువు కావడంతో అధికారులను ఆమె ఖాతాలను స్తంభింపజేశారు. ఢిల్లీకి (Delhi) చెందిన కృతి వర్మ.. 2007- 2009 మధ్య కాలంలో సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ అధికారిగా (Senior Tax Assistant Officer) పని చేశారు. ఆ సమయంలో ఈమె తన పైఅధికారులకు తెలీకుండా అధికారిక లాగిన్‌లను ఉపయోగించి మోసాలకు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఆరోపించింది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త భూషణ్ పాటిల్‌ను కీలక నిందితుడిగా గుర్తించారు. పెద్ద మొత్తంలో నిధులు పాటిల్ ఖాతాకు చేరాయని, అందులో కొంత మొత్తం కృతి వర్మ పేరుపై ఆస్తులు కొనుగోలు చేశారని విచారణలో తేలింది.

Paytm Money: ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిందో మహిళ.. తిరిగి పంపమని అడిగితే అతడి రియాక్షన్ ఇదీ..!

krithi-varma-viral.jpg

జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన కృతి వర్మ.. నటనపై ఉన్న ఆసక్తి కారణంగా తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం ముంబైకి వచ్చి రోడీస్ ఎక్స్‌ట్రీమ్‌ అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అనంతర కాలంలో వచ్చిన బిగ్ బాస్ సీజన్-12లో (Bigg Boss Season-12) కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే టైటిల్ గెలవకపోయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో 2021లో హర్యానాలోని గురుగ్రామ్‌లో కోట్లు వెచ్చించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. టీడీఎస్ స్కామ్ కేసులో మొత్తం 12 మోసపూరిత టీడీఎస్ రీఫండ్‌ల కింద సుమారు రూ.264కోట్ల సొమ్మును అక్రమంగా తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో రూ.69 కోట్లతో కొనుగోలు చేసిన స్థిర, చరాస్తులను ఈడీ గత నెలలో అటాచ్ చేసింది. ఇదిలావుండగా, తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని కృతి వర్మ అంటోంది. గతంలో ఓ పాటలో పాటిల్‌తో కలిసి డ్యాన్స్ చేసినందుకు గాను రూ.కోటి పారితోషికం తీసుకున్నట్లు చెప్పింది. అయితే కేసు గురించి తెలిసిన తర్వాత భూషణ్ పాటిల్‌కు దూరంగా ఉన్నట్లు తెలిపింది. కాగా, ప్రస్తుతం కృతి శర్మకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Indian Railway: బోగీని శుభ్రం చేస్తున్న రైల్వే కార్మికుడు.. చెత్తనంతా ఒక్కచోట చేర్చి.. దాన్ని ఏం చేశాడో చూస్తే..!

Updated Date - 2023-09-13T19:10:01+05:30 IST