Indian Railway: బోగీని శుభ్రం చేస్తున్న రైల్వే కార్మికుడు.. చెత్తనంతా ఒక్కచోట చేర్చి.. దాన్ని ఏం చేశాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-13T16:01:58+05:30 IST

రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉండడంతో చాలా మంది సదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో రైల్లో వెళ్లేందుకే మొగ్గుచూపుతుంటారు. దీంతోనే సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. రైలు ఎక్కే ప్రతి ఒక్కరూ చేతిలో వాటర్ బాటిల్, ఫుడ్ తదితర పార్సిళ్లు తీసుకోవడం...

Indian Railway: బోగీని శుభ్రం చేస్తున్న రైల్వే కార్మికుడు.. చెత్తనంతా ఒక్కచోట చేర్చి.. దాన్ని ఏం చేశాడో చూస్తే..!

రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉండడంతో చాలా మంది సదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో రైల్లో వెళ్లేందుకే మొగ్గుచూపుతుంటారు. దీంతోనే సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. రైలు ఎక్కే ప్రతి ఒక్కరూ చేతిలో వాటర్ బాటిల్, ఫుడ్ తదితర పార్సిళ్లు తీసుకోవడం సర్వసాధారణం. అయితే వాటిని పడేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కిటికీలోంచి కింద విసిరేవారు కొందరైతే.. మరికొందరు బోగీలోనే ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. దీంతో ఎప్పటికప్పుడు చెత్తాచెదారం పేరుకుపోతుంటుంది. ప్రయాణికుల తరహాలోనే రైల్వే సిబ్బంది కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. బోగీని శుభ్రం చేస్తున్న రైల్వే కార్మికుడు.. చెత్తనంతా ఒక్కచోట చేర్చి.. దాన్ని ఏం చేశాడో చూస్తే అవాక్కవుతారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కదులుతున్న రైల్లో ఓ సిబ్బంది బోగీలోని (Staff cleaning garbage in the train Bogie) చెత్తాచెదారాన్నంతా శుభ్రం చేస్తుంటాడు. బోగీలోని ఓ వైపు నుంచి చెత్తనంతా ఉడ్చుకుంటూ మరో చివరకు తీసుకెళ్తాడు. అయితే ఇక్కడే అతడి నిర్లక్ష్యం మొత్తం బయటపడింది. డస్ట్ బిన్‌లలో వేయకుండా.. పోగేసిన చెత్తనంతా డోరు వైపు ఊడ్చుతాడు. చివరకు మొత్తం (person pushed the garbage down from the Bogie) చెత్తనంగా రైలు నుంచి కిందకు తోసేస్తాడు.

Paytm Money: ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిందో మహిళ.. తిరిగి పంపమని అడిగితే అతడి రియాక్షన్ ఇదీ..!

రైల్వే సిబ్బంది నిర్వాకం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఓ వ్యక్తి రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు. ఈ ఘటనపై నెటిజన్లు ప్రస్తుతం వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అని కొందరు, ‘‘సోమరితనానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ’’.. అని మరికొందరు, ‘‘ఎక్కువ శాతం సిబ్బంది దాదాపు ఇలాగే చేస్తున్నారు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎస్కేప్ అంటే ఇదీ.. సింహానికే చావు రుచి చూపించిన జీబ్రా.. చివరకు మామూలు షాక్ ఇవ్వలేదుగా..

Updated Date - 2023-09-13T17:39:33+05:30 IST