Viral Video: ఇదేం టెక్నిక్ బాబోయ్.. టిష్యూ పేపర్‌తో బొద్దింకను యమా ఈజీగా ఎలా పట్టుకున్నారో చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-13T17:21:51+05:30 IST

చాలా మంది తమ ఇళ్లల్లో బొద్దింకలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో బొద్దింకలు గుట్టలు గుట్టలుగా చేరి తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. కొందరు వాటిని చూస్తేనే అసహ్యించుకుంటుంటారు. ఈ క్రమంలో వాటి నివారణకు చాలా మంది వివిధ రకాల ప్రయాత్నాలు చేస్తుంటారు. కొందరు..

Viral Video: ఇదేం టెక్నిక్ బాబోయ్.. టిష్యూ పేపర్‌తో బొద్దింకను యమా ఈజీగా ఎలా పట్టుకున్నారో చూస్తే..!

చాలా మంది తమ ఇళ్లల్లో బొద్దింకలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో బొద్దింకలు గుట్టలు గుట్టలుగా చేరి తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. కొందరు వాటిని చూస్తేనే అసహ్యించుకుంటుంటారు. ఈ క్రమంలో వాటి నివారణకు చాలా మంది వివిధ రకాల ప్రయాత్నాలు చేస్తుంటారు. కొందరు స్ప్రే కొడితే, మరికొందరు వివిధ రకాల మందులు వాడుతుంటారు. ఆ కొద్ది సేపు ఉపశమనం కలిగినా.. యథావిధిగా బొద్దింకలు మళ్లీ ఇళ్లల్లోకి చొరబడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ వ్యక్తి ఎలాంటి మందులూ వాడకుండా కేవలం టిష్యూ పేపర్‌తో బొద్దింకను ఈజీగా పట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఈ ట్రిక్ ఏదో బాగానే ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని బొద్దింకలను (cockroaches) పట్టుకునేందుకు విచిత్రమైన ట్రిక్ ఉపయోగించాడు. గోడపై పాకుతూ వెళ్తున్న బొద్దింకను చూసి.. ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఇందుకోసం ముందుగా కొన్ని టిష్యూ పేపర్లను (Tissue papers) తీసుకున్నాడు. తర్వాత వాటిని నీటిలో ముంచి నానబెట్టాడు. తర్వాత వాటిని చేతిలోకి తీసుకుని సరిగ్గా గోడపై ఉన్న బొద్దింకకు గురి చూసి కొట్టాడు. దీంతో తడిసిన టిష్యూ పేపర్లు వెళ్లి బొద్దింకపై పడిపోయి గోడకు అతుక్కున్నాయి.

Indian Raiway: బోగీని శుభ్రం చేస్తున్న రైల్వే కార్మికుడు.. చెత్తనంతా ఒక్కచోట చేర్చి.. దాన్ని ఏం చేశాడో చూస్తే..!

ఇలా బొద్దింకను ఈజీగా పట్టుకుని బయట వదిలేశాడు. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బేకింగ్ సోడా, కిరోసిన్, పిప్పరమింట్ ఆయిల్ వంటి వాటిని వినియోగిస్తే ఇంకా మేలు’’.. అని కొందరు, ‘‘టిష్యూలతో ప్రతి సారీ ఇలా చేయలాంటే కష్టమే’’.. అని మరికొందరు, ‘‘పర్లేదు.. ఈ ట్రిక్ సరదాగానే ఉంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తన్నారు. ఈ వీడియో ప్రస్తుతం 60వేలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Paytm Money: ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిందో మహిళ.. తిరిగి పంపమని అడిగితే అతడి రియాక్షన్ ఇదీ..!

Updated Date - 2023-09-13T17:21:51+05:30 IST