Manchu Manoj TDP : మంచు మనోజ్ టీడీపీలో చేరితే పరిస్థితేంటి.. మౌనిక ముందు రెండు ఆప్షన్లు.. ఇప్పుడిదే హాట్ టాపిక్!?

ABN , First Publish Date - 2023-08-04T21:37:37+05:30 IST

అవును.. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటా.. ఇవీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో (Chandrababu) భేటీ తర్వాత టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Manchu Manoj TDP : మంచు మనోజ్ టీడీపీలో చేరితే పరిస్థితేంటి.. మౌనిక ముందు రెండు ఆప్షన్లు.. ఇప్పుడిదే హాట్ టాపిక్!?

అవును.. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటా.. ఇవీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో (Chandrababu) భేటీ తర్వాత టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఇటు మంచు ఫ్యామిలీకి.. అటు భూమా కుటుంబానికి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉండటం, పైగా హీరో కావడంతో కచ్చితంగా తెలుగు రాష్ట్రాల యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా గత ఎన్నికల ముందు నుంచే సేవా కార్యక్రమాలు కూడా చేయడం.. ఇప్పటికీ అవి కొనసాగిస్తుండటంతో ఈయన సేవలను వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తోందట. కచ్చితంగా టీడీపీలో చేరతారని ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారట. చేరిక వరకూ ఓకే.. కండువా కప్పుకున్న తర్వాత పరిస్థితేంటి..? అనేది ఇప్పుడు మంచు అభిమానుల్లో, అనుచరుల మనసుల్లో మెదులుతున్న ప్రశ్న..!


CBN-Manoj.jpg

టీడీపీలో చేరాక..!

రాజకీయాల్లోకి రావడానికి మంచు మనోజ్ తహతహలాడుతున్నారు. ఇటీవలే తన సతీమణి భూమా మౌనిక రెడ్డితో (Bhuma Mounika Reddy) కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లిన మనోజ్ సుమారు అరగంటకు పైగానే తాజా రాజకీయ పరిణామాలు, పొలిటికల్ ఎంట్రీపై నిశితంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన మనోజ్.. పొలిటికల్ ఎంట్రీపై (Manchu Manoj Political Entry) త్వరలో నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో పక్కాగా పసుపు కండువా కప్పుకుంటారని టీడీపీ, మంచు అభిమానులు చెప్పుకుంటున్నారు. చేరిక తర్వాత కచ్చితంగా మనోజ్‌కు టీడీపీ నుంచి తగిన ప్రాధాన్యం ఉంటుందని.. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దింపడంతో పాటు.. కీలక పదవి కూడా అధిష్టానం కట్టబెట్టనున్నట్లు తెలియవచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నుంచి బరిలోకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ వర్గాల నుంచి సమాచారం. అయితే మనోజ్ లేకుంటే ఇక్కడ్నుంచే భూమా మౌనికకు టికెట్ ఇస్తారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. భూమా ఫ్యామిలీకి రాయలసీమ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పైగా.. మంచు ఫ్యామిలీకి చెందిన విద్యానికేతన్ విద్యాసంస్థలు కూడా చంద్రగిరి పరిధిలోని రంగంపేటలోనే ఉన్నాయి. ఇలా భూమా, మంచు ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు, విద్యాసంస్థల ఉనికి.. అన్నీ కలిసొస్తాయని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.

CBN-And-Manoj.jpg

చంద్రగిరి లేదా నంద్యాల!

రానున్న ఎన్నికల్లో చంద్రగిరి (Chandragiri) నుంచి వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కుమారుడు మోహిత్ రెడ్డి పోటీచేస్తున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. గత ఎన్నికల్లో పులివర్తి నాని పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఇక్కడ్నుంచి అధికార పార్టీ తరఫున అభ్యర్థి మారారు కాబట్టి.. యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌ను బరిలోకి దిగితే కచ్చితంగా చంద్రగిరి కోటపై పసుపు జెండా పాతొచ్చన్నది అధిష్టానం భావనట. అందుకే.. ఓకే అంటే మనోజ్ లేకుంటే.. భూమా మౌనికను బరిలోకి దింపాలన్నది టీడీపీ ఆలోచనట. ఇక రెండో ఆప్షన్‌గా నంద్యాల (Nandyal) నియోజకవర్గం చంద్రబాబు మనసులో ఉందట. చాలా రోజులుగా భూమా ఫ్యామిలీ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy) కుటుంబానికి మధ్య వైరం నడుస్తోంది. అది మరింత ఎక్కువై కొట్టుకునే పరిస్థితికి కూడా వెళ్లింది. దీంతో ఇరువర్గీయులు ఎదురుపడితే చాలు కొట్టుకునే పరిస్థితులున్నాయ్. మరోవైపు.. ఆళ్లగడ్డ (Allagadda) లేదా నంద్యాల అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందేనని ఏవీ సుబ్బారెడ్డి పట్టుబడుతున్నట్లు తెలియవచ్చింది. ఒకవేళ ఆళ్లగడ్డ నుంచి అఖిల ప్రియను పోటీచేయించినా.. నంద్యాల నుంచి మౌనికను బరిలోకి దింపితే.. సుబ్బారెడ్డి నుంచి ఎలాంటి అభ్యంతరం రాదట. ఎందుకంటే.. మౌనిక అభ్యర్థిత్వాన్ని ఏవీ కచ్చితంగా ఆమోదిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే మౌనిక ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయన్న మాట.

Manoj-and-Mounika-2.jpg

మనోజ్ పరిస్థితేంటి..?

టీడీపీ కండువా కప్పుకోగానే మనోజ్‌ను టీడీపీ ప్రచార విభాగం చైర్మన్‌గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయట. అంటే.. స్టార్ క్యాంపెయినర్‌ అన్నమాట. మనోజ్ సేవలు ఇలా వినియోగించాలని చంద్రబాబు నిర్ణయించారట. గతంతో పోలిస్తే టీడీపీలో ఇప్పుడు సినిమా సెలబ్రిటీలు కాస్త తక్కువగానే ఉన్నారు. పైగా వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి కావడం.. వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి వెనుకాడరని మనోజ్‌ను బాబు విశ్వసిస్తున్నారట. అందుకే.. కండువా కప్పాక టీడీపీ ప్రచార విభాగం చైర్మన్ పదవిని ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్కమాటలో చెప్పాలంటే.. వైసీపీలో ఉన్న యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలాగా.. మనోజ్‌ను తయారుచేయాలని చంద్రబాబు మనసులో ఉందట. మరి ఇవన్నీ ఎంతవరకు వర్కవుట్ అవుతాయి..? టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారు..? చేరిన తర్వాత పదవితోనే సరిపెట్టుకుంటారా..? మౌనిక లేదా మనోజ్ ఇద్దరిలో ఎవరో ఒక్కరు ఎమ్మెల్యేగా పోటీచేస్తారా..? ఇలా అన్నింటిపై క్లారిటీ రావాలంటే మరికొన్నిరోజులు వేచి చూడక తప్పదు మరి.

manchumanoj.jpg


ఇవి కూడా చదవండి


Nandyal Politics : చంద్రబాబుతో మంచు మనోజ్ భేటీ, పోటీపై భూమా జగత్ విఖ్యాత్ ఆసక్తికర వ్యాఖ్యలు


AP Politics : చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ.. ఇందుకేనా..!?


Manoj Meets CBN : చంద్రబాబుతో భేటీ తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫిక్స్ అయినట్లే..!


AP Debts : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఏమయ్యారు.. ఎందుకీ మౌనవ్రతం..!?


ABN Fact Check : గుడివాడలో నానిని దెబ్బకొట్టేందుకు ‘నారా’స్త్రం.. నిజంగానే నారా రోహిత్‌ బరిలోకి దిగుతున్నారా..!?


Updated Date - 2023-08-04T21:41:51+05:30 IST