AP Politics : చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ.. ఇందుకేనా..!?

ABN , First Publish Date - 2023-07-31T16:56:29+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నివాసానికి టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ (Hero Manchu Manoj) వెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి (CBN House) హీరో వెళ్లి భేటీ కాబోతున్నారు. మనోజ్ తన సతీమణి భూమా మౌనికరెడ్డితో (Bhuma Mounika Reddy) కలిసి..

AP Politics : చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ.. ఇందుకేనా..!?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పార్టీల అధినేతలు నిమగ్నమవ్వగా.. మరోవైపు ఆశావహులు, రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలనుకునేవారు టికెట్ల కోసం తహతహలాడుతున్నారు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, మాజీ క్రికెటర్లు, ప్రజా సంఘాల నేతలు రాజకీయాల్లోకి రావడానికి ఈసారి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పలుపార్టీల్లోకి పలువురు సెలబ్రిటీలు చేరిపోగా.. మరికొందరు జూనియర్ హీరోలు సైతం రాజకీయాల్లోకి వచ్చి అదృష్టం పరిశీలించుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. సరిగ్గా ఇదే పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.


Manchu-Manoj-1.jpg

ఏం జరుగుతుందో..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నివాసానికి టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ (Hero Manchu Manoj) వెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి (CBN House) హీరో వెళ్లి భేటీ కాబోతున్నారు. మనోజ్ తన సతీమణి భూమా మౌనికరెడ్డితో (Bhuma Mounika Reddy) కలిసి వెళ్లి భేటీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పుడీ భేటీపై తెలుగు రాష్ట్రాల్లో, టాలీవుడ్‌పై (Tollywood) సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు ఈ భేటీ ఎందుకు..? ఈ భేటీలో ఏం చర్చించబోతున్నారు..? రాజకీయంగా చర్చిస్తారా..? సినిమాల పరంగా చర్చిస్తారా..? అని చిత్రవిచిత్రాలుగా జనాలు చర్చించుకుంటున్నారు. అయితే రాజకీయాల గురించి చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయని భూమా అభిమానులు, మంచు అభిమానులు చెప్పుకుంటున్నారు. మరికొందరైతే ‘వెల్‌కమ్ టూ టీడీపీ.. మంచన్నా..’ అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టేస్తున్నారు.

chandrababu-bc.jpg

ఇదీ మనోజ్ పరిస్థితి..!

వాస్తవానికి 2019 ఎన్నికల నుంచి మనోజ్ రాజకీయ అరంగేంట్రం చేయబోతున్నారని.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం అయిన ఓ స్థానం నుంచి పోటీచేస్తారని వార్తలొచ్చాయి. అది కూడా వైసీపీ తరఫున అని ప్రచారం జరిగింది. అప్పుడు మంచు ఫ్యామిలీ వైసీపీలోనే ఉంది. దీనికి తోడు ఎన్నికల ముందు ఒకట్రెండు నియోజకవర్గాల్లో మనోజ్ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. పొలిటికల్ ఎంట్రీ లేదు.. పోటీ అనే ఊసే లేకుండా పోయింది. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు మరోసారి ఇలా చంద్రబాబుతో మనోజ్ భేటీ కాబోతుండటం మరోసారి చర్చతో పాటు ప్రాధాన్యత సంతరించుకుంది.

CBN.jpg

భేటీలో చర్చ దీనిపైనేనా..?

మనోజ్ సతీమణి భూమా మౌనిక గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భూమా ఫ్యామిలీకి కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. భూమా నాగిరెడ్డి మరణాంతరం ఫ్యామిలీకి అన్నీ తానై.. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో అంతా మౌనికనే చూసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ గెలవడానికి కర్త, కర్మ, క్రియ.. మౌనికానే అని అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. అయితే.. జనాల నుంచి ఇంత ఆదరణ ఉన్న.. పలుకుబడి ఉన్న మౌనికను రాజకీయాల్లోకి రావాలని చాలారోజులుగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. పెళ్లయ్యాక.. మౌనిక రాజకీయ అరగేంట్రం గురించి మనోజ్ స్పందిస్తూ.. ఆమె ఓకే అనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పేశారు. అయితే.. ఆ విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుని అభిమానులు మౌనిక గురించే ఇప్పుడు చంద్రబాబుతో మనోజ్ భేటీ అవుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు భూమా కుటుంబం టీడీపీలోనే ఉందన్న విషయం తెలిసిందే.

manoj1.jpg

టికెట్ ఇవ్వమని అడిగే ఛాన్స్!

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. మంచు మనోజ్ టీడీపీలో అధికారికంగా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. మౌనికకు నంద్యాల నుంచి టికెట్ ఇవ్వడమా..? లేకుంటే మనోజ్‌ను చిత్తూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దింపడమా..? అనేదానిపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే.. నంద్యాల నుంచి పోటీచేసి ఓడిపోయిన భూమా బ్రహ్మానందరెడ్డి చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. అయితే ఆ నియోజకవర్గం మౌనిక బరిలోకి దింపాలనే విషయంపై చంద్రబాబుతో మనోజ్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే కర్నూలు రాజకీయాల్లో మనోజ్ కీలకం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భేటీ తర్వాత పార్టీలో చేరిక, టికెట్ల వ్యవహారంపై మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

TDP.gif


ఇవి కూడా చదవండి


TS Politics : స్పీడ్ పెంచిన కమలం.. బీజేపీలో చేరేందుకు డజను మంది మాజీలు రెడీ.. మాజీ మంత్రితో చర్చలు!


Jaya SudhaBJP : జయసుధకు కాషాయ కండువా కప్పి.. ఆ ఇద్దరికీ చెక్ పెట్టాలని కిషన్ రెడ్డి ప్లాన్.. రచ్చ.. రచ్చ!


Politcal BRO : ‘బ్రో’ మూవీలో శ్యాంబాబు డ్యాన్స్‌పై పొలిటికల్ దుమారం.. మంత్రి అంబటికి దిమ్మదిరిగే కౌంటరిచ్చిన నటుడు పృథ్వీ


YSRCP : వైఎస్ జగన్‌కు మరో తలనొప్పి.. మంత్రి వర్సెస్ ఎంపీ.. ఫొటో తెచ్చిన తంట..!



Updated Date - 2023-07-31T16:58:29+05:30 IST