AP Debts : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఏమయ్యారు.. ఎందుకీ మౌనవ్రతం..!?

ABN , First Publish Date - 2023-08-01T18:25:47+05:30 IST

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ప్రెస్‌మీట్ పెట్టినా, అసెంబ్లీలో మాట్లాడినా చాలా వినసొంపుగా ఉంటుంది.. చాలా లాజికల్‌గా మాట్లాడుతారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. ప్రతిపక్ష నేతల నుంచి చిన్న విమర్శ వచ్చినా సరే వెంటనే మీడియా మీట్ (Media) పెట్టేసి కౌంటరేస్తుంటారు. అలాంటిది..

AP Debts : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఏమయ్యారు.. ఎందుకీ మౌనవ్రతం..!?

అవును.. ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) కనిపించడం లేదు!. ఏపీని సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) అప్పుల్లోకి నెడుతున్నారని.. రెండ్రోజులకోసారి కేంద్రం నుంచి వెయ్యికోట్లు అప్పులు (AP Debts) తెస్తున్నారని.. ఓవైపు బీజేపీ (BJP), మరోవైపు టీడీపీ (TDP) వైసీపీపై (YSR Congress) దుమ్మెత్తిపోస్తు్న్నాయి. గత వారం, పదిరోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ వ్యవహారంపైనే చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి (Purandheswari) బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైసీపీపై డైరెక్ట్ అటాకే ప్రారంభించారు. అటు పార్లమెంట్ (Parliament) వేదికగా వైసీపీ ఎంపీలను (YSRCP MP) .. ఇటు ప్రెస్‌మీట్ వేదికగా టీడీపీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంత జరుగుతున్నా.. ఆర్థిక మంత్రి అడ్రస్ లేరు. ఆయన ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి..!


AP-DEBTS.jpg

అసలేం జరుగుతోంది..?

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ప్రెస్‌మీట్ పెట్టినా, అసెంబ్లీలో మాట్లాడినా చాలా వినసొంపుగా ఉంటుంది.. చాలా లాజికల్‌గా మాట్లాడుతారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. ప్రతిపక్ష నేతల నుంచి చిన్న విమర్శ వచ్చినా సరే వెంటనే మీడియా మీట్ (Media) పెట్టేసి కౌంటరేస్తుంటారు. అలాంటిది.. ‘ఏపీ అప్పుల్లో మునిగిపోయింది.. అక్షరాలా 10లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసింది.. మా హయంలో కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ అప్పులు తెచ్చారు.. అయినా అభివృద్ధి శూన్యం’ ఇవే గత కొన్నిరోజులుగా టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు. మరోవైపు.. లక్షల కోట్లు ఏం చేశారో చెప్పండి.. అయినా ఇన్ని కోట్ల అప్పులు ఎందుకోసం చేశారు..? అని బీజేపీ ప్రశ్నలు సంధిస్తోంది. పోనీ ఇంత అప్పులు చేసిన సర్కార్ పెన్షన్ కానీ.. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా సమయానికి ఇస్తోందా అంటే అబ్బే అస్సలే లేదు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి ఓ రేంజ్‌లో తీసుకెళ్లారు ప్రతిపక్ష నేతలు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో, మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. అయితే ఇంత జరుగుతున్నా మంత్రి గుడివాడ అమర్నాథ్, జోగు రమేష్ ఇంకా ఒకరిద్దరు మంత్రులు మాత్రమే సమాధానం చెబుతున్నారే కానీ.. ఆర్థిక శాఖకు మంత్రి అయిన బుగ్గన మాత్రం ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం.

Jagan-And-Buggana.jpg

మంత్రి గారు ఏమయ్యారో..!?

ఇటు ఏపీలో ప్రతిపక్షాలు.. అటు ఢిల్లీలో పార్లమెంట్‌లో అప్పులపై రచ్చ రచ్చ జరుగుతున్నప్పటికీ ఒక్కమాటైనా బుగ్గన మాట్లాడటం లేదు.! ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకే మీడియా ముందుకొచ్చే రాజేంద్ర ఇప్పుడు పూర్తిగా దూరంగా ఉండిపోయారు!. ఆయన ఎందుకు సమాధానం చెప్పట్లేదు.. మీడియాకు ఎందుకు దూరమయ్యారు..? ఎప్పుడూ లేనంతగా సడన్‌గా మౌనవ్రతం పాటిస్తున్నారు..? అసలైన మంత్రి మిన్నకుండిపోతే.. కొసరు మంత్రులంతా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు..? ఇవే ఇప్పుడు ప్రజలు, ప్రతిపక్షాలు, సోషల్ మీడియా నుంచి వస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్నలు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేంద్రం రెండ్రోజులకోసారి కోట్లల్లో అప్పులు ఇవ్వడానికి తెరవెనుక వ్యవహారాలన్నీ చక్కబెట్టేది బుగ్గనేనని తెలియవచ్చింది. ఢిల్లీ వేదికగా ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయన చూస్తున్నారట. ఎక్కడ అప్పు దొరుకుతుందా..? అప్పు తీసుకునేందుకు ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సరే మరుసటి క్షణమే అక్కడ వాలిపోతున్నారట బుగ్గన. నెలలో సగం రోజులు దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి సరిపోతోందట. ఇవన్నీ చాలవన్నట్లు ఇతర దేశాలకు పెట్టుబడుల కోసం తిరగడం.. ఇవే సరిపోతున్నాయట. కనీసం మీడియా ముందుకు రావడానికి గానీ.. ప్రకటన రిలీజ్ చేయడానికి కూడా బుగ్గనకు సమయం లేకుందట.

Buggana.jpg

మొత్తానికి చూస్తే.. ఆర్థిక మంత్రి బుగ్గన కాస్త అప్పుల మంత్రిగా మారిపోయారన్న మాట. అంతేకాదండోయ్.. మీడియా ముందుకొస్తే అప్పులపైన ఏం ప్రశ్నలు వస్తాయో..? ఆ ప్రశ్నలకు ఏదో సమాధానం చెబితే అసలుకు ఎసరు ఎక్కడొచ్చిపడుతుందో..? అని బుగ్గన భయపడిపోతున్నారట. ఇవన్నీ ఎందుకు మీడియా ముందుకొచ్చి అబాసుపాలు కావడం కంటే.. దూరంగా ఉంటే బెటర్ కదా అని.. మౌనవ్రతం పాటిస్తున్నారట. మరోవైపు.. ‘అన్నింటికీ లెక్కలు చెబుతారు.. లెక్కల మాస్టరొస్తారు.. కాస్త ఆగండి’ అని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నాయి. సారెప్పుడొస్తారో.. సమాధానాలు ఎప్పుడు చెబుతారో ఏంటో మరి..!

Buggana-Minsiter.jpg


ఇవి కూడా చదవండి


AP Politics : విశాఖ వైసీపీలో రివర్స్ గేర్.. ఏ ఒక్కర్ని కదిపినా పరిస్థితేంటో అని జగన్‌లో పెరిగిన టెన్షన్!?


TS Politics : బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటిద్దామనుకున్న కేసీఆర్‌కు బిగ్ ఝలక్.. నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలు ఔట్!?


ABN Fact Check : గుడివాడలో నానిని దెబ్బకొట్టేందుకు ‘నారా’స్త్రం.. నిజంగానే నారా రోహిత్‌ బరిలోకి దిగుతున్నారా..!?


TS Politics : కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం.. దాసోజుకు లక్కీ ఛాన్స్.. దానంకు లైన్ క్లియర్!


TSRTC : ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం


Manoj Meets CBN : చంద్రబాబుతో భేటీ తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫిక్స్ అయినట్లే..!


AP Politics : చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ.. ఇందుకేనా..!?


Updated Date - 2023-08-01T18:27:32+05:30 IST