TS Politics : బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటిద్దామనుకున్న కేసీఆర్‌కు బిగ్ ఝలక్.. నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలు ఔట్!?

ABN , First Publish Date - 2023-08-01T15:41:25+05:30 IST

తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్‌లో (BRS) నరాలు తెగేంత టెన్షన్ మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! ఈ నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.!.

TS Politics : బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటిద్దామనుకున్న కేసీఆర్‌కు బిగ్ ఝలక్.. నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలు ఔట్!?

తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్‌లో (BRS) నరాలు తెగేంత టెన్షన్ మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! ఈ నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.!. తెలంగాణ హైకోర్టులో (TS High Court) మొత్తం 28 మంది ఎమ్మెల్యేల (28 BRS MLAs) ఎన్నిక చెల్లదంటూ పిటిషన్‌లు (Petitions) పెండింగ్‌లో ఉన్నాయి. 2018 లో అసెంబ్లీ ఎన్నికల (2018 Assembly Elections) సందర్భంగా ఈ పిటిషన్‌లన్నీ దాఖలవ్వగా.. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా పిటిషన్‌లు కదులుతున్నాయి. అయితే ఎన్నికలు దగ్గర్లోనే ఉండటం, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు-18న 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించాలని కేసీఆర్ ముహూర్తం కూడా ఫిక్స్ చేయడం.. ఇవన్నీ చకచకా చక్కబెట్టాలని గులాబీ బాస్ అనుకుంటున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో న్యాయస్థానాల నుంచి బిగ్ ఝలక్‌లు బీఆర్ఎస్‌కు తప్పట్లేదు.


BRS-logo.jpg

ఇదీ అసలు కథ..

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ 2018 నుంచి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌లు వేయడం జరిగింది. ఇన్నాళ్లుగా అంతా ప్రశాంతంగా ఉన్నారు.. ఎవరి నియోజకవర్గంలో వారు పనులు చేసుకున్నారు కానీ.. ఎప్పుడైతే కొత్తగూడెం ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావు ఎన్నికపై తీర్పు వచ్చిందో అప్పట్నుంచీ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 30 కు పైగా పెండింగ్ పిటిషన్‌లు ఉండగా.. అందులో 28కు పైగా పిటిషన్‌లు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైనే కావడం గమనార్హం. ఆగస్ట్ 12 నుంచి 17 వరకూ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని హై‌కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. రానున్న రోజుల్లో మరికొందరు నేతల ఎలక్షన్ పిటిషన్‌లు విచారణకు రానున్నాయని తెలుస్తోంది. మొత్తమ్మీద చూస్తే.. ఈనెలాఖరుకల్లా మొత్తం 28 మంది ఎమ్మెల్యేల లెక్కలు తేలిపోనున్నాయట. ఇప్పటికే ఒకరిపై వేటుపడగా.. మరో 28 మందిపై నెలాఖరుకల్లా వేటుపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

T-high-court.jpg

ఎవరెవరిపై పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి..?

  • గద్వాల్ :- కృష్ణమోహన్ రెడ్డి Vs డీకే అరుణ

  • మహబూబ్‌నగర్ :- శ్రీనివాస్ గౌడ్ Vs చంద్రశేఖర్

  • పటాన్ చెరు :- మహిపాల్ రెడ్డి Vs కాట శ్రీనివాస్ గౌడ్

  • అసిఫాబాద్ :- ఆత్రం సక్కు Vs కోవా లక్ష్మి

  • ఖైరతాబాద్ :- దానం నాగేందర్ Vs దాసోజు శ్రవణ్

  • వేములవాడ :- చెన్నమనేని రమేష్ బాబు Vs ఆది శ్రీనివాస్

  • సికింద్రాబాద్ :- పద్మారావు Vs కాసాని జ్ఞానేశ్వర్

  • కొడంగల్ :- పట్నం నరేందర్ రెడ్డి Vs రేవంత్ రెడ్డి

  • ఇబ్రహీంపట్నం :- మంచిరెడ్డి కిషన్ రెడ్డి Vs మల్‌రెడ్డి

  • కొత్తగూడెం :- వనామా వెంకటేశ్వరరావు Vs జలగం వెంకట్రావు

  • మంచిర్యాల :- ప్రేమ్‌సాగర్ రావు Vs దివాకర్ రావు

  • హుస్నాబాద్ :- సతీష్ Vs చాడ వెంకటరెడ్డి

  • తుంగతుర్తి :- గ్యాదరి కిషోర్ Vs అద్దంకి దయాకర్

  • దేవరకద్ర :- ఆల వెంకటేశ్వర్ రెడ్డి Vs పవన్ కుమార్

  • వరంగల్ ఈస్ట్ :- నరేందర్ Vs రవీందర్

  • ఆలేరు :- గొంగడి సునీత Vs సతీష్

  • జూబ్లీహిల్స్ :- మాగంటి గోపీనాథ్ Vs విష్ణువర్ధన్ రెడ్డి

  • మల్కాజ్‌గిరి :- మైనంపల్లి హన్మంత్ Vs రామచందర్ రావు

  • కరీంనగర్ : గంగుల కమాలకర్ Vs బండి సంజయ్

  • ధర్మపురి :- కొప్పుల ఈశ్వర్ Vs అడ్లూరి లక్ష్మణ్

  • కోదాడ :- బొల్లం మల్లయ్య Vs ఉత్తమ్ పద్మావతి

  • నాగర్‌కర్నూల్ :- మర్రి జనార్ధన్ Vs నాగం జనార్ధన్

  • గోషామహల్ :- రాజాసింగ్ Vs ప్రేమ్‌సింగ్ రాథోడ్

  • వికారాబాద్ :- మెతుకు ఆనంద్ Vs గడ్డం ప్రసాద్

  • పరిగి :- మహేశ్వర్ రెడ్డి Vs రామ్మోహన్ రెడ్డి

  • జనగాం :- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి Vs పొన్నాల లక్ష్మయ్య

  • నాంపల్లి :- జాఫర్ హుస్సేన్ Vs ఫిరోజ్ ఖాన్‌

KCR.jpg

టికెట్లూ కష్టమేనా..?

పైన చెప్పిన వారికి సంబంధించి పిటిషన్‌లన్నీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే చాలా మంది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు ఇప్పుడు బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్‌పై ఎలక్షన్ పిటిషన్‌లో ట్రయల్ ప్రారంభమైంది. బుధవారం నాడు కొప్పుల ఈశ్వర్ పై దాఖలైన ఎన్నికల పిటిషన్ పై విచారణ జరగనుంది. మొత్తానికి చూస్తే వనామా అనర్హత వేటుతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ నెలాఖరులోపు ఎంతమందిపై వేటు పడుతుందో..? ఈ మొత్తం వ్యవహారంపై కేసీఆర్ సర్కార్ ఎలా ముందుకెళ్తుంది..? ఒకవేళ ఈ నెలాఖరుకల్లా క్లియర్ కాకపోతే రానున్న ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలకు మళ్లీ కేసీఆర్ టికెట్లు ఇస్తారా..? లేకుంటే పక్కనెట్టేస్తారా..? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


ABN Fact Check : గుడివాడలో నానిని దెబ్బకొట్టేందుకు ‘నారా’స్త్రం.. నిజంగానే నారా రోహిత్‌ బరిలోకి దిగుతున్నారా..!?


TS Politics : కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం.. దాసోజుకు లక్కీ ఛాన్స్.. దానంకు లైన్ క్లియర్!


TSRTC : ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం


Manoj Meets CBN : చంద్రబాబుతో భేటీ తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫిక్స్ అయినట్లే..!


AP Politics : చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ.. ఇందుకేనా..!?


Updated Date - 2023-08-01T17:18:30+05:30 IST