Manoj Meets CBN : చంద్రబాబుతో భేటీ తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫిక్స్ అయినట్లే..!

ABN , First Publish Date - 2023-07-31T19:52:49+05:30 IST

అవును.. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు.!. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై (Manoj Political Entry) నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పేశారు!..

Manoj Meets CBN : చంద్రబాబుతో భేటీ తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫిక్స్ అయినట్లే..!

అవును.. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు.!. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై (Manoj Political Entry) నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పేశారు!. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో (Chandrababu) మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి (Manchu Manoj, Bhuma Mounika) భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని బాబు నివాసానికి వెళ్లిన ఈ దంపతులు సుమారు అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలతో పాటు పలు కీలక విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది.


CBN-Manoj.jpg

భేటీలో ఏం జరిగింది..?

పెళ్లయిన తర్వాత మంచు మనోజ్ దంపతులు మొదటిసారి చంద్రబాబును కలిశారు. భేటీలో ఏం చర్చించారు..? ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది..? అనే విషయాలపై అటు మనోజ్ దంపతులు, ఇటు టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ.. మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఒకట్రెండు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అని స్పష్టంగా అర్థమవుతోంది. ‘ పెళ్లయిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు గారిని కలవడానికి వచ్చాము. రేపు మా బాబు పుట్టినరోజు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం. పొలిటికల్ ఎంట్రీపై త్వరలో నిర్ణయం ఉంటుంది’ అని మనోజ్ స్పష్టం చేశారు. మరోవైపు మౌనిక మాట్లాడుతూ.. చంద్రబాబును కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెళ్లయిన తర్వాత ఎప్పటినుంచో కలవాలని అనుకున్నాం కానీ వీలు కాలేదు.. ఇవాళ కుదరిందన్నారు.

CBN-And-Manoj.jpg

ఎంట్రీ ఫిక్స్..!

సో.. దీన్ని బట్టి చూస్తే రాజకీయాల్లోకి మనోజ్ వచ్చేస్తున్నారన్న మాట. ఆ విషయాన్ని ఇవాళ భేటీ తర్వాత చెప్పకనే చెప్పేశారన్న మాట. మరోవైపు.. టీడీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న తర్వాతే ఇలా చంద్రబాబుతో భేటీ అయ్యారనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే.. నంద్యాల లేదా ఆళ్లగడ్డ అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి మౌనిక ఆసక్తి చూపిస్తున్నట్లు తెలియవచ్చింది. ఎందుకంటే.. భూమా నాగిరెడ్డి మరణాంతరం ఈ కుటుంబం నుంచి రాజకీయంగా అన్నీ తానై మౌనిక చూసుకుంటూ వస్తున్నారని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. గత ఎన్నికల్లో.. ఆళ్లగడ్డలో సోదరి అఖిల ప్రియ, నంద్యాలలో సోదరుడి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపులో మౌనిక పాత్ర కీలకమైనది. అప్పట్నుంచో ఆమెను రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. అయితే.. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు మౌనిక, మనోజ్‌లు బాబుతో భేటీ కావడంతో మరోసారి ఇదంతా చర్చనీయాంశమైంది.

Manchu-Manoj.jpg

మొత్తానికి చూస్తే.. పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అని మనోజ్ చెబుతున్నారు. కాగా.. మంచు ఫ్యామిలీ వైసీపీకి బాగా దగ్గరగా ఉంది. భూమా ఫ్యామిలీ టీడీపీలో ఉంది. ఈ పరిస్థితుల్లో ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారు..? టీడీపీలోనే చేరుతారా..? లేకుంటే వేరే పార్టీలో చేరుతారా..? అరంగేంట్రం అయ్యాక ఎక్కడ్నుంచి పోటీచేస్తారు..? ఇలా చాలా ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే మనోజ్-మౌనికల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే వరకూ వేచి చూడాల్సిందే మరి. ఏం జరుగుతుందో చూద్దాం.


ఇవి కూడా చదవండి


AP Politics : చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ.. ఇందుకేనా..!?


Jaya SudhaBJP : జయసుధకు కాషాయ కండువా కప్పి.. ఆ ఇద్దరికీ చెక్ పెట్టాలని కిషన్ రెడ్డి ప్లాన్.. రచ్చ.. రచ్చ!


Politcal BRO : ‘బ్రో’ మూవీలో శ్యాంబాబు డ్యాన్స్‌పై పొలిటికల్ దుమారం.. మంత్రి అంబటికి దిమ్మదిరిగే కౌంటరిచ్చిన నటుడు పృథ్వీ


YSRCP : వైఎస్ జగన్‌కు మరో తలనొప్పి.. మంత్రి వర్సెస్ ఎంపీ.. ఫొటో తెచ్చిన తంట..!


Updated Date - 2023-07-31T19:56:44+05:30 IST