TSRTC : ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం

ABN , First Publish Date - 2023-07-31T20:28:19+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కార్ (KCR Govt) నిర్ణయం తీసుకుంది. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త (Good News) అని చెప్పుకోవచ్చు...

TSRTC : ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కార్ (KCR Govt) నిర్ణయం తీసుకుంది. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త (Good News) అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కురుస్తున్న వానలు, వరదలపై సోమవారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ గురించి నిశితంగా చర్చించి ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ (KCR Cabinet) నిర్ణయించింది. కాగా.. ఆగస్టు-03 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ బిల్లు పాసయితే మాత్రం ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు. ఇదిలా ఉంటే.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States) ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనట్లే.


CM-KCR.jpg

ఈ మధ్య అన్నీ కీలక నిర్ణయాలే..

కాగా.. తెలంగాణలో ఎన్నికలు (TS Elections) సమీపిస్తుండటంతో కేసీఆర్ అన్నీ కీలక నిర్ణయాలు, శుభవార్తలు చెబుతూనే ముందుకెళ్తున్నారు. ఇప్పటికే దివ్యాంగులకు పెన్షన్ (Pension) వెయ్యి రూపాయిలు పెంచడం, మరోవైపు విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచడం, ముస్లిం సోదరులకు లక్ష రూపాయిలు ఇస్తామని ప్రకటించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యే చాలా శుభవార్తలే చెప్పుకుంటూ వెళ్తున్నారు కేసీఆర్. అయితే.. చాలా రోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు (TSRTC Employees) ప్రభుత్వంలో విలీనం చేయాలని.. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఉద్యోగులు నిరసనలతో రాష్ట్రం మొత్తం హోరెత్తించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా.. ప్రభుత్వం విలీనం చేస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మంగళవారం నాడు ఆర్టీసీ యూనియన్ల నేతలు కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పనున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి


Pension Hike In TS : శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్.. పింఛన్ పెరిగింది.. ఒకేసారి..


TS Schools : విద్యార్థులకు తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్.. అదేంటో తెలిస్తే..!


Updated Date - 2023-07-31T20:32:32+05:30 IST