Pension Hike In TS : శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్.. పింఛన్ పెరిగింది.. ఒకేసారి..

ABN , First Publish Date - 2023-07-22T20:06:33+05:30 IST

ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ (KCR Govt) కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు (Disabled Persons) పెన్షన్ (Pension) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తియ్యటి శుభవార్త చెప్పింది..

Pension Hike In TS : శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్.. పింఛన్ పెరిగింది.. ఒకేసారి..

ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ (KCR Govt) కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు (Disabled Persons) పెన్షన్ (Pension) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తియ్యటి శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు ఆసరా పింఛన్‌ను రూ. 3,016గా ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే మరో వెయ్యి రూపాయిలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన పెన్షన్‌తో కలిపితే ఇప్పుడు దివ్యాంగులకు రూ. 4,016 రానుంది. పెరిగిన పింఛన్ జూలై నెల నుంచే అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ పింఛన్‌తో 5.20 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.


KCR.jpg

ఇటీవల ఓ బహిరంగ సభలో పింఛను పెంపుపై కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. శనివారం నాడు జరిగిన సమావేశంలో పింఛను పెంపునకు సంబంధించి సుదీర్ఘ చర్చ అనంతరం వెయ్యి రూపాయిలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ నిర్ణయంతో దివ్యాంగులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే.. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని.. త్వరలోనో పీఆర్సీ పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

KCR.jpg

కాగా.. తొమ్మిదేళ్లలో దివ్యాంగుల కోసం రూ.10వేల 310 కోట్లు ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో రూ.500 పింఛను మాత్రమే ఉండేదన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మొత్తాన్ని రూ.3,016కు పెంచింది. ఇప్పుడు మరోసారి వెయ్యి రూపాయిలు పెంచింది. దీంతో పాటు పలు సంక్షేమ పథకాలు, విధానాల ద్వారా వికలాంగులకు కేసీఆర్ సర్కార్ చేరువవుతున్నదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి


Jubilee Hills : జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ ఔటేనా.. టికెట్ కోసం ఇద్దరు పోటాపోటీ.. కేటీఆర్ ఆశీస్సులు ఎవరికో..!?


Anju Yadav : అంజూ యాదవ్ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా.. పరిశీలనలో మూడు నియోజకవర్గాలు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!?


Telangana BJP : కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సాక్షిగా బీజేపీలో బయటపడిన లుకలుకలు.. అంతా గందరగోళం..!


Updated Date - 2023-07-22T20:17:17+05:30 IST