TS Politics : కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం.. దాసోజుకు లక్కీ ఛాన్స్.. దానంకు లైన్ క్లియర్!

ABN , First Publish Date - 2023-07-31T21:54:30+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఏ చిన్నపాటి ఛాన్స్ వచ్చినా సరే సువార్ణవకాశంగా మార్చుకుంటోంది బీఆర్ఎస్.! (BRS) మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు...

TS Politics : కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం.. దాసోజుకు లక్కీ ఛాన్స్.. దానంకు లైన్ క్లియర్!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఏ చిన్నపాటి ఛాన్స్ వచ్చినా సరే సువార్ణవకాశంగా మార్చుకుంటోంది బీఆర్ఎస్.! (BRS) మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. పార్టీ కోసం పనిచేస్తున్న, బీఆర్ఎస్ గళం వినిపిస్తున్న కొందరు నేతలకు.. టికెట్ కోసం పోటాపోటీగా ఉన్న నేతలకు లైన్ క్లియర్ చేస్తూ ఎన్నికల ముందు బంపర్ ఛాన్స్ ఇస్తున్నారు గులాబీ బాస్.


KCR-And-Dasoju.jpg

ఇదీ అసలు సంగతి..

సోమవారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ (KCR Cabinet Meeting) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా.. గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను (Dasoju sravan, Kurra satyanarayana) ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కేబినెట్ ఎంపిక చేసింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ ప్రతిపాదనను వెంటనే గవర్నర్‌కు పంపిస్తామని కేటీఆర్ తెలిపారు. కాగా.. దాసోజు, కుర్రా ఈ ఇద్దరూ ఎరుకల సామాజిక వర్గానికి చెందినవారు. ఈ ఇద్దర్నీ ఎమ్మెల్సీగా చేస్తే ఆ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసినట్లు ఉంటుందని.. మరింత దగ్గరవ్వొచ్చన్నది కేసీఆర్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కుర్రా, దాసోజు ఇద్దరూ కూడా కాషాయ కండువా వదిలి.. కారెక్కిన నేతలే.!1999 నుంచి 2004 వరకు సంగారెడ్డి అసెంబ్లీ నుంచి శాసనసభ్యుడిగా కుర్రా ప్రాతినిధ్యం వహించారు.

Danam-Nagender.jpg

దానంకు లైన్ క్లియర్!

ఇవన్నీ ఒక ఎత్తయితే దాసోజు కాంగ్రెస్ (Congress) గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరి.. ఆ తర్వాత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మంచి వాక్చాతుర్యం, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం, జాతీయ మీడియాతో మాట్లాడే, తెలుగు, జాతీయ మీడియా డిబేట్‌లో సైతం పాల్గొని పార్టీ గళం వినిపించేవారిలో దాసోజు ముందు వరుసలో ఉంటారు. అయితే బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి పోటీచేయాలని భావించారు. ఇక్కడ్నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న దానం నాగేందర్ (Danam Nagender) కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లి 2018 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. దానం గెలిచింది.. కాంగ్రెస్ తరఫున పోటీచేసిన దాసోజు, బీజేపీ తరఫున పోటీచేసిన సి. రామచంద్రారెడ్డిపైనే.! అయితే.. దాసోజు రాకతో దానంకు టికెట్ డౌటేనని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు.. ఇద్దరి మధ్య టికెట్ ఫైట్ నడుస్తోందని.. వార్తలొచ్చాయి. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు దాసోజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో దానంకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది.

KCR.jpg


ఇవి కూడా చదవండి


TSRTC : ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం


Manoj Meets CBN : చంద్రబాబుతో భేటీ తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫిక్స్ అయినట్లే..!


AP Politics : చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ.. ఇందుకేనా..!?


Updated Date - 2023-07-31T21:57:36+05:30 IST