Avinash In Viveka Case : అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై సస్పెన్స్ కంటిన్యూ.. పలు లాజిక్‌లు చెప్పిన ఎంపీ తరఫు న్యాయవాది.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2023-04-27T17:56:52+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై..

Avinash In Viveka Case : అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై సస్పెన్స్ కంటిన్యూ.. పలు లాజిక్‌లు చెప్పిన ఎంపీ తరఫు న్యాయవాది.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై (Anticipatory Bail) ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేలా లేదు. బుధవారం నాడు బెయిల్‌పై పిటిషన్‌పై విచారించిన తెలంగాణ హైకోర్టు (TS High Court).. ఇవాళ మరోసారి సుదీర్ఘ విచారణ జరిపి శుక్రవారానికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. కాగా.. ఇటు అవినాష్ తరఫున.. అటు వైఎస్ సునీతారెడ్డి తరఫున లాయర్ల వాదనలను హైకోర్టు విన్నది. ఈ సందర్భంగా.. అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది పలు కీలక వాదనలు వినిపించారు. హత్య ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ అసలేం జరిగింది..? అవినాష్‌ను అనుమానించడానికి కారణాలేంటి..? సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జ్‌షీట్లు, దస్తగిరి (Dastagiri) బెయిల్ పిటిషన్‌పై సీబీఐ అపోజ్ చేయకపోవడం ఇలా అన్ని విషయాలపై అవినాష్ తరఫు న్యాయవాది కోర్టుకు నిశితంగా వివరించారు. అనంతరం సునీతారెడ్డి తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూత్ర తమ వాదనలు వినిపించారు.

TS-High-Court.jpg

ఈ నాలుగు కారణాలే..

ఎంపీ అవినాష్ రెడ్డిని అనుమానించడానికి నాలుగే నాలుగు కారణాలు చెబుతున్నారు. దస్తగిరి స్టేట్మెంట్, గూగుల్ టెకౌట్ (Google Takeout), మోటివ్, సాక్షాలు తుడిచేయడం. మొదట అరెస్ట్ అయినప్పుడు హత్యలో కేవలం 5 మంది మాత్రమే ఉన్నారని దస్తగిరి చెప్పాడు. తరువాత సీబీఐ (CBI) ఇంకో స్టేట్మెంట్ తీసుకుంది. అందులో అవినాష్, భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy) పేరు చెప్పారు. తర్వాత దస్తగిరి యాంటిసీపేటరీ బెయిల్ (Anticipatory Bail) అప్లై చేసుకుంటే సీబీఐ వ్యతిరేకించలేదు. బెయిల్‌ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయ సమ్మతం కాదు. హియర్ అండ్ సే ఏవిడెన్స్‌ని బట్టి అవినాష్‌పై ఆరోపణలు చేస్తున్నారు. కానీ హియర్ అండ్ సే ఏవిడెన్స్ ఎప్పుడూ ఏవిడెన్స్ కానే కాదు. దస్తగిరి మొదటి 160 స్టేట్‌మెంట్‌లో కేవలం శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డిల పేర్లు మాత్రమే చెప్పాడు. ఐదు రోజుల తర్వాత ఇచ్చిన 160 స్టేట్మెంట్‌లో గుర్తు చేసుకుని చెబుతున్నానని అవినాష్, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివ శంకర రెడ్డి పేర్లు చెప్పాడు. ఇందులోనే ఈ వ్యవహారం అంతా అవినాష్ చూసుకుంటాడు.. మిగతా డబులు కూడా ఇస్తారని చెప్పాడు. దస్తగిరి బెయిల్ పిటిషన్ సీబీఐ ఎక్కడా అపోజ్ చేయలేదు. దస్తగిరిని ముందుగానే ప్లాన్ చేసి సీబీఐ అవినాష్ రెడ్డి పేరు చెప్పేలా చేసింది. సీబీఐ చెప్పిన వాటికి దస్తగిరి అంగీకరించి అప్రూవర్‌గా మారాడు. దస్తగిరి బెయిల్‌లో మెరిట్స్ పరిగణలోకి తీసుకోలేదు. మర్డర్ కేసు ప్రత్యేక్షంగా పాల్గొన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం నేను ఎక్కడా చూడలేదు. ఇప్పటి వరకూ వివేకా హత్య కేసులో సీబీఐ రెండు ఛార్జ్ షీట్లు వేసింది. రెండు ఛార్జ్ షీట్లలో కానీ రిమాండ్ రిపోర్టులో కానీ ఎక్కడ అవినాష్ పేరు గానీ భాస్కర్ రెడ్డి పేరు కానీ ప్రస్తావించలేదు’ అని అవినాష్ తరఫు లాయర్ కోర్టుకు వివరించారు.

YS--Sunitha.jpg

ఎవరేమన్నారు..!?

న్యాయమూర్తి : రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ అప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేశారా...?

అవినాష్ న్యాయవాది : లేదు.. ఎవరిని అరెస్ట్ చేయలేదు..

సునీత న్యాయవాది : అఫిడవిట్‌లలో పేరు ప్రస్తావించారు..

అవినాష్ న్యాయవాది : అఫిడవిట్‌లో ప్రస్తావిస్తే నిందితుడిగా గుర్తించే ప్రమాణంగా ఎలా పరిగణలోకి తీసుకుంటారు..?

MP-Avinash-Reddy-Media.jpg

గూగుల్ టేకౌట్ గురించి..

అవినాష్ రెడ్డి కోసం మా నాన్న ప్రచారం చేశాడు అని సునీతనే చెప్పారు.. ఇంకా ఇక్కడ హత్యకు మోటివ్ ఎక్కడ ఉంది..?. గూగుల్ టేకౌట్ ఎప్పుడూ ఖచ్చితమైన ప్రదేశాన్ని చూపించదు. 15-20 మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. గూగుల్ టేకౌట్, జీపీఎస్ లాంటివి ఏమీ ఒక ప్రత్యేక యాప్ కాదు.. దానికి ఖచ్చితత్వం లేదు. ఏ కోర్టులు వాటిని సాక్షాలుగా పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. ఏ2 సునీల్ యాదవ్ హత్య జరిగిన రాత్రి 1:58 గంటలకు భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేకౌట్ చెబుతుందని సీబీఐ చెబుతోంది. కానీ హత్య జరిగిన ముందు రోజు రాత్రి నుంచి ఉదయం 9 గంటలవరకు దస్తగిరి, సునీల్ యాదవ్ కలిసే ఉన్నామని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక వేళ సునీల్ యాదవ్ లొకేషన్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉంటే దస్తగిరి ది కూడా అక్కడే ఉండాలి కదా..? అంటూ పలు లాజిక్‌లను అవినాష్ తరఫు న్యాయవాది లేవనెత్తారు.

CBI.jpg

సునీతారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు ఇవీ..

ఎంపీ అవినాష్‌పై ఎలాంటి కేసులు లేవని అవినాష్ న్యాయవాది చెప్పారు. కానీ ఆయన ఎలెక్షన్ అఫిడవిట్ ప్రకారం ఆయనపై 4 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో హత్యాయత్నం కేసు కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సిట్‌ని అవినాష్ ప్రభావితం చేశారు. తర్వాత సీబీఐనీ కూడా ప్రభావితం చేయగలరనే కేసును తెలంగాణాకు మార్చారు. ఇంతకు ముందు సాక్షం ఇచ్చిన సీఐ శంకరయ్యను ప్రభావితం చేశారు. ఇంటిని క్లీన్ చేసిన మరో మహిళ స్టేట్మెంట్‌ను ఇప్పటికే ప్రభావితం చేశారు. హత్య కేసులో ఉన్న వ్యక్తికి యాంటిసీపీటరీ బెయిల్ అడుగుతున్నారు. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిల అదేశంతో అవినాష్ రెడ్డి సమక్షంలోనే రక్తపు మరకలు తుడిచానని పనిమనిషి చెప్పింది. యాంటీసీపీటరీ బెయిల్ ఇవ్వాలి అంటే విచారణ సంస్థకు ఉన్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి (గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించిన లోత్ర). అరెస్ట్ చేయకుండా కస్టోడీయల్ ఇంటరాగేషన్ చేసుకోవచ్చు. సుప్రీం కోర్టు గతంలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. అవసరం అయితే ఇలాంటి ఆదేశాలు ఇస్తే మేం తు.చా తప్పకుండా పాటిస్తాంఅని సిద్దార్థ్ లూత్ర కోర్టుకు వివరించారు.

TS-High-Court-New.jpg

మొత్తానికి చూస్తే.. అవినాష్ బెయిల్ పిటిషన్‌పై వాడీవేడీగానే వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అటు అవినాష్.. ఇటు సునీతారెడ్డి న్యాయవాదులు పలు లాజిక్‌లు లేవనెత్తారు. అంతేకాదు పాత తీర్పులను సైతం ఉదహరించి మరీ వాదనలు వినిపించారు. అయితే సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఇంకా విచారించాల్సినది ఇంకా ఉందని భావించిన హైకోర్టు శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది. రేపు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

BRS Formation Day : రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లలో గెలుస్తామో ముందే చెప్పేసిన కేసీఆర్.. ఏపీ గురించి ప్రస్తావిస్తూ..

******************************

Avinash In YS Viveka Case : విచారణ కీలక దశలో ఉండగా కొత్త కోణాలు బయటపెట్టిన ఎంపీ వైఎస్ అవినాష్.. సునీతక్క అని సంబోధిస్తూనే..

******************************

KCR Warning: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కీలక సమావేశంలో కేసీఆర్ సీరియస్ వార్నింగ్
******************************

TS BJP : చేవెళ్ల సభలో అమిత్ షా తీవ్ర అసహనం.. టూర్ ముగించుకొని వెళ్తూ.. వెళ్తూ.. అసలేం జరిగిందా అని ఆరాతీస్తే..!

******************************

AP Politics : వైఎస్ సునీతారెడ్డి టీడీపీలో చేరబోతున్నారా.. ఈ పోస్టర్లలో నిజమెంత.. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఎందుకిలా..!?


******************************

Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉండగా.. డైరెక్టర్ ఆర్జీవీ పెను సంచలనం..

******************************

KCR BRS Sabha : మరాఠా గడ్డ నుంచి మాటిస్తున్నా.. మొత్తం మార్చేస్తా.. కీలక హామీలిచ్చిన కేసీఆర్..
******************************

SC Verdict On YS Viveka Case : సుప్రీం తీర్పుతో వైఎస్ అవినాష్‌కు దారులన్నీ క్లోజ్.. హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ.. ఇదేగానీ జరిగితే..!

******************************

Viveka Murder Case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు చుక్కెదురు.. అరెస్ట్ విషయంలో సీబీఐకు లైన్ క్లియర్..


******************************

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పురోగతి సాధించిన సీబీఐ.. సడన్‌గా ఇలా జరగడంతో...

******************************

Viveka Murder Case : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. మరో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..

******************************

Updated Date - 2023-04-27T18:13:56+05:30 IST