SC Verdict On YS Viveka Case : సుప్రీం తీర్పుతో వైఎస్ అవినాష్‌కు దారులన్నీ క్లోజ్.. హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ.. ఇదేగానీ జరిగితే..!

ABN , First Publish Date - 2023-04-24T19:41:01+05:30 IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి (Kadapa MP Avinash Reddy) సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. అయితే..

SC Verdict On YS Viveka Case : సుప్రీం తీర్పుతో వైఎస్ అవినాష్‌కు దారులన్నీ క్లోజ్.. హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ.. ఇదేగానీ జరిగితే..!

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి (Kadapa MP Avinash Reddy) సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు (TS High Court) ఇచ్చిన ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను సుప్రీం కొట్టేసింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. ఇరువురి వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పుతో అవినాష్ రెడ్డి సీబీఐ (CBI) అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అన్ని దారులూ మూసుకుపోయినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐకి కూడా లైన్ క్లియర్ అయినట్లే. అయితే.. అవినాష్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్-25న (మంగళవారం) తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నది. సుప్రీం తీర్పు తర్వాత హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతోందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కొట్టేయడం, హైకోర్టు ఆదేశాలను కూడా తప్పుబట్టడంతో రేపు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎలా రియాక్ట్ కాబోతోంది..? అని అటు వైసీపీ (YSR Congress) వర్గాల్లో.. ఇటు అవినాష్ శిబిరంలో టెన్షన్ మొదలైందట.

Sunitha-And-Avinash.jpg

ఇంతకీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది..!?

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇచ్చిన తెలంగాణ హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి (YS Sunitha Reddy) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుమారు రెండు గంటలపాటు సునీతారెడ్డి తరఫున లాయర్ సిద్ధార్థ లూథ్రా, అవినాష్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టింది. అంతేకాదు విచారణను లిఖిత పూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. సుప్రీం తాజా తీర్పుతో రేపటి వరకు అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రక్షణ తొలగిపోయినట్లే. మరోవైపు.. ఇప్పటి వరకూ ఏప్రిల్-30 వరకూ విచారణ ముగించాలని గతంలో గడువిచ్చిన సుప్రీం.. ఇప్పుడు పెంచింది. జూన్-30 లోపు విచారణ పూర్తి చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అవినాష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు త‌ప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయ‌ని.. అంతేకాదు.. ద‌ర్యాప్తును కూడా ప్రభావితం చేసేలా ఉన్నాయ‌న్న సీజేఏ ధర్మాసనం చెప్పుకొచ్చింది.

TS-High-Court.jpg

హైకోర్టులో ఇలా జరిగితే..!

ఒకవేళ.. ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని తెలుస్తోంది. ఇప్పటికే అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐ రంగం సిద్దం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకూ.. ఇలాగే విచారణ జరగాలి..? మేం చెప్పినట్లే విచారించాలి..? ముఖ్యంగా విచారణలో ఏమేం అడుగుతారో ప్రశ్నలు ఇవ్వండి..? అని న్యాయస్థానాలు తీర్పులిచ్చిన సందర్భాలు దాదాపు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఇలా తీవ్రంగా తప్పుబట్టిన తర్వాత కూడా బెయిల్ ఇస్తుందా..? లేకుంటే అరెస్ట్ చేసుకోవచ్చని న్యాయస్థానం కూడా చెబుతుందా..? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే సీబీఐ దూకుడికి కళ్లెం పడినట్లేనని.. కేసు అసలు ముందుకు సాగే అవకాశముండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ లోపు సాక్షాదారాలు కూడా తారుమారయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే.. వివేకా హత్యకేసులో కచ్చితమైన ఆధారాలివేనని ఓ వైపు వైఎస్ సునీత.. మరోవైపు సీబీఐ కూడా కచ్చితమైన ఆధారాలు ఇవ్వడంతో రెండు మూడ్రోజుల్లో కీలక పరిణామాలే చోటుచేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఫైనల్‌గా మంగళవారం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Viveka Murder Case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు చుక్కెదురు.. అరెస్ట్ విషయంలో సీబీఐకు లైన్ క్లియర్..


******************************

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పురోగతి సాధించిన సీబీఐ.. సడన్‌గా ఇలా జరగడంతో...

******************************

Viveka Murder Case : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. మరో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..

******************************

Updated Date - 2023-04-24T19:46:11+05:30 IST