KCR BRS Sabha : మరాఠా గడ్డ నుంచి మాటిస్తున్నా.. మొత్తం మార్చేస్తా.. కీలక హామీలిచ్చిన కేసీఆర్..

ABN , First Publish Date - 2023-04-24T21:29:55+05:30 IST

భారతదేశం నెహ్రూ హయాంలో (Nehru) కాస్తోకూస్తో అభివృద్ధి జరిగిందని.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఓ ప్రణాళిక లేకుండా పరిపాలించాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్...

KCR BRS Sabha : మరాఠా గడ్డ నుంచి మాటిస్తున్నా.. మొత్తం మార్చేస్తా.. కీలక హామీలిచ్చిన కేసీఆర్..

మహారాష్ట్ర/ ఔరంగాబాద్ : భారతదేశం నెహ్రూ హయాంలో (Nehru) కాస్తోకూస్తో అభివృద్ధి జరిగిందని.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఓ ప్రణాళిక లేకుండా పరిపాలించాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) అన్నారు. ఇప్పటికే మహారాష్ట్రంలో (Maharastra) రెండుసార్లు బహిరంగ సభలు నిర్వహించగా ఇది మూడోసారి. సోమవారం నాడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జబిందా గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు మహారాష్ట్రకు చెందిన కీలక నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా.. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సభావేదికగా మరాఠా ప్రజలకు పలు కీలక హామీలు ఇచ్చారు.

KCR-Maha-Sabha.jpg

ప్రజలారా మేల్కోండి..!

ఔరంగాబాద్‌లో వారానికి ఒకరోజే మంచి నీళ్లు వస్తున్నాయి. తెలంగాణ మంచినీటి సమస్య లేకుండా చేశాం. మహారాష్ట్రలో కృష్ణా, గోదావరి ఉన్నప్పటికీ నీటి కష్టాలా..?. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులా..?. దేశంలో పేదలు ఇంకా పేదలుగానే మిగిలిపోతున్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులకు కారణం ఎవరు..?. 13 నెలలు రైతులు ఆందోళన చేసినా కేంద్రం చలించలేదు. దేశ రాజధానిలో 770 మంది రైతులు చనిపోవడం ప్రజాస్వామ్యమా..?. సాగు చట్టాలపై సారీ చెప్పి కేంద్రం చేతులు దులుపుకుంది. ఇప్పటికీ రైతులు కష్టాలు మాత్రం తీరలేదు. అత్యధిక జనాభా ఉన్న దేశం మనది. అయినా అభివృద్ధిలో వెనుకబడే ఉన్నాం. లక్ష్యం లేని దిశగా దేశం పయనిస్తోంది. దేశంలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారు. ఇదంతా మన కళ్లముందే జరుగుతోంది. ఇది ఇలాగే జరగాలా.. చికిత్స చేయాలా..? చెప్పండి. నా మాటలు విని ఇక్కడే మర్చిపోకండి. నా మాటలపై మీ గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులు వీధిలో ఉన్నవారందరితో చర్చించాలి. దేశంలో సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ప్రజలు ఎంత త్వరగా మేలుకుంటే అంత మంచిది అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

KCR-Maha-Sabha-2.jpg

మరాఠా గడ్డ మీద నుంచి మాటిస్తున్నా..!

దేశంలో ఎన్నో పార్టీలు మారాయి.. ప్రజలు బతుకులు మాత్రం మారలేదు. దేశం పెనువిప్లవం వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. దేశంలో మార్పు తీసుకురావడానికే బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చాం. బీఆర్ఎస్ ఒక మతం, ఒక ప్రాంతం కోసం ఆవిర్భవించలేదు. బీజేపీ కుట్రలకు భయపడితే ఏ పార్టీకీ కూడా మనుగడ ఉండదు. నిజాయితీతో మేం చేసే పోరాటానికి తప్పకుండా విజయం లభిస్తుంది. త్వరలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మిస్తాం. మహారాష్ట్రలో కరెంట్, నీటి సమస్య తీరుస్తాం. రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేస్తాం. నెహ్రూ హయాంలోనే కాస్తోకూస్తో దేశం అభివృద్ధి చెందింది. తర్వాతి ప్రభుత్వాలు ఓ ప్రణాళిక లేకుండా పరిపాలించాయి. మనకంటే చాలా చిన్న దేశాల్లో అద్భుతమైన రిజర్వాయర్లు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల కోసం కొత్త చట్టాలు తేవాల్సిందే. లేదంటే దేశంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులే కొనసాగుతాయి అని మహారాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హామీలిచ్చారు.

KCR-Sabha-Janaalu.jpg

కేంద్రంపై ప్రశ్నల వర్షం..

ఐదేళ్లలో ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తాం. ఇది తెలంగాణలో సాధ్యం చేసి చూపించాం. మహారాష్ట్రంలో బీఆర్ఎస్‌కు అధికారం ఇవ్వండి. తెలంగాణలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. గతంలో మహారాష్ట్ర కంటే ఘోరమైన పరిస్థితులు ఉండేవి. రోజుకు 3 గంటలు మాత్రమే కరెంట్ ఉండేది. తెలంగాణలో 24 గంటల కరెంట్ సాధ్యమైతే మహారాష్ట్రలో ఎందుకు కాదు..?. కేంద్రం ప్రైవేటీకరించిన ప్రతిసంస్థను నేషనలైజ్ చేస్తాం. పెద్ద పెద్ద లీడర్లు అవసరం లేదు.. రైతుల నుంచే నేతలు రావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించండి. అన్ని జిల్లా పరిషత్‌లలో గులాబీ జెండా ఎగరాలి. మీ సమస్యలను తీర్చే బాధ్యత నాది. మహారాష్ట్రకు ఎందుకు వచ్చారని బీజేపీ ప్రశ్నిస్తోంది..? మహారాష్ట్రలో తెలంగాణ మోడల్‌ను అమలు చేయండి.. అప్పుడే కేసీఆర్ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. మేకిన్ ఇండియా.. జోకిన్ ఇండియాగా మారింది. తెలంగాణలో దళితబంధు అమలు చేస్తున్నాం. మహారాష్ట్రలోనూ అమలు చేస్తే నేను ఇక్కడికి రాను. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టాం. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. కొత్త పార్లమెంట్‌కు అంబేద్కర్‌ పేరు ఎందుకు పెట్టడం లేదు..? అని కేంద్రంలోని మోదీ సర్కార్‌పై కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

SC Verdict On YS Viveka Case : సుప్రీం తీర్పుతో వైఎస్ అవినాష్‌కు దారులన్నీ క్లోజ్.. హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ.. ఇదేగానీ జరిగితే..!

******************************

Viveka Murder Case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు చుక్కెదురు.. అరెస్ట్ విషయంలో సీబీఐకు లైన్ క్లియర్..


******************************

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పురోగతి సాధించిన సీబీఐ.. సడన్‌గా ఇలా జరగడంతో...

******************************

Viveka Murder Case : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. మరో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..

******************************

Updated Date - 2023-04-24T21:41:48+05:30 IST