BRS : 22 ఏళ్లుగా కేసీఆర్ ఫోన్ కాల్ కోసం ఎదురుచూపులు.. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్‌కు ఊహించని షాక్..!

ABN , First Publish Date - 2023-03-07T22:47:46+05:30 IST

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) హడావుడి ప్రారంభమైంది. ఎమ్మెల్యే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. బీఆర్ఎస్‌ (BRS) కోసం అహర్నిశలు కష్టపడిన, ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న చాలా మంది నేతలు సీఎం కేసీఆర్....

BRS : 22 ఏళ్లుగా కేసీఆర్ ఫోన్ కాల్ కోసం ఎదురుచూపులు.. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్‌కు ఊహించని షాక్..!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) హడావుడి ప్రారంభమైంది. ఎమ్మెల్యే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. బీఆర్ఎస్‌ (BRS) కోసం అహర్నిశలు కష్టపడిన, ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న చాలా మంది నేతలు సీఎం కేసీఆర్ (CM KCR) ఆశీర్వాదం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇప్పటికే కొందరికి కేసీఆర్ పదవుల పరంగా న్యాయం చేయగా.. కొందరు కీలక నేతలు మాత్రం కేసీఆర్ నోట తమ పేరు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపుల్లో ఉన్నారు. ఇంకొందరు నేతలు ఇప్పటి వరకూ ఎలాంటి పదవులు లేకపోవడంతో తీవ్ర అవమానంగా భావించి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మంగళవారం నాడు ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ జాబితాలో తమ పేరు రాకపోవడంతో కొందరు నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఏళ్ల తరబడి వేచి చూస్తున్న ఒకరిద్దరు కీలక నేతలు రాజీనామాకు కూడా సిద్ధమైపోయారు. ఇంతకీ ఆ నేతలు ఎవరనే విషయం ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

Chakilam-1.jpg

ఇదీ అసలు కథ..!

తెలంగాణ రచయితగా పేరుగాంచిన దేశపతి శ్రీనివాస్ (Deshapati Srinivas), అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి (Challa Venkatrami Reddy)తోపాటు నవీన్కుమార్ పేర్లను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. ఈ అభ్యర్థులు ఈ నెల 9న నామినేషన్లు (Nominations) వేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ముఖ్య నేతలకు కేసీఆర్ సూచించారు. అయితే.. ఈ కోటాలో తనకు కచ్చితంగా పదవి వస్తుందని సీనియర్ నేత, కీలక నేత చకిలం అనిల్ కుమార్ (Chakilam Anil Kumar) టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వేచి చూస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో దీన్ని తీవ్ర అవమానంగా భావించిన చకిలం పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా, కీలక నేతగా ఆయన పనిచేశారు. ఒకటి కాదు రెండు కాదు టీఆర్ఎస్ పార్టీలో 22 ఏళ్లుగా ఉంటూ వస్తున్నారు. అంటే.. అభ్యర్థులను ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు.

PV-and-YS-Chakilam.jpg

ఎవరీ చకిలం..?

చకిలం కుటుంబానికి నల్గొండ రాజకీయాల్లో పెద్ద చరిత్రే ఉంది. పీవీ, వైఎస్‌ (PV, YSR) వంటి హేమాహేమీలతో ఈ కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చకిలం శ్రీనివాస్ రావు (Chakilam Srinivas Rao) నాటి ప్రధాని పీవీ నర్సింహారావు ప్రధాన అనుచరుడిగా మెలిగారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన అడుగు జాడల్లోనే రాజకీయాల్లోకి చకిలం అనిల్ కుమార్ అరంగేట్రం చేశారు. తండ్రికి చేదోడు వాదోడు ఉంటూ వచ్చారు. అప్పట్లో చకిలం కుటుంబం అంటే.. ప్రత్యర్థులు భయపడిపోయేవారని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. తండ్రి శ్రీనివాస్ బతికున్నంత కాలం కాంగ్రెస్‌లో ఉన్నారు అనిల్. కేసీఆర్‌తో తన తండ్రికి ఉన్న సాన్నిహిత్యంతో 2001 లో టీఆర్ఎస్ ఆవిర్భావం (TRS) రోజే గులాబీ కండువా కప్పుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ టీఆర్ఎస్‌లోనే ఆయన ఉన్నారు. పార్టీకి ఆర్థికంగా కూడా అండగా ఉంటూ వస్తున్నారు. 2014, 2018లో రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే రెండుసార్లూ దక్కలేదు.. దీంతో తీవ్ర అసంతృప్తి, నిరాశకు లోనయ్యారు. అప్పట్లో స్వయంగా కేసీఆర్ హైదరాబాద్‌కు పిలిపించి తగిన ప్రాధాన్యతతో పాటు మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అప్పట్లో అందరూ.. ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభకు పంపుతారని భావించారు. కానీ నాటి నుంచి నేటి వరకూ అనిల్ ఎదురుచూపులకే పరిమితం అయ్యారు.

Chakilam-2.jpg

విసిగిపోయి ఇలా నిర్ణయం..!

2001 నుంచి ఇప్పటి వరకూ పార్టీ కోసం పనిచేస్తూ.. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించి అసెంబ్లీకి, పార్లమెంట్‌కు పంపుతున్నారే తప్ప అనిల్‌కు పదవీయోగం లేకుండా పోయింది. నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిన వారికి సైతం పదవులు ఇస్తూ తనకు కేసీఆర్ ఎందుకు అన్యాయం చేస్తున్నారని అనిల్ కుమిలిపోయారట. నాటి నుంచి ఇవాళ్టి వరకూ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తునే ఉన్న చకిలం విసిగిపోయి ఇక బీఆర్ఎస్ గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకున్నారు. రెండ్రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చకిలం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రతినిధికి చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు.

Chakilam-Final.jpg

మొత్తానికి చూస్తే.. ఎన్నేళ్లు పార్టీలో పనిచేసినా ఒరిగిందేమీ లేదని చకిలం, అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనై ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే.. ఏ పార్టీలో చేరతారనేది అతి త్వరలోనే ప్రకటిస్తానని చకిలం చెబుతున్నారు. కాంగ్రెస్‌లోనే చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే.. మొదట్నుంచీ ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి, కేడర్ కూడా అంతా కాంగ్రెస్‌దే కాబట్టి చేరొచ్చని అనుచరులు చెప్పుకుంటున్నారట. ఫైనల్‌గా చకిలం ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Vangaveeti Radha : గంటకుపైగా నారా లోకేష్‌‌తో వంగవీటి రాధా సుదీర్ఘ చర్చ.. చెప్పాల్సింది క్లియర్‌ కట్‌గా చెప్పేసిన యువనేత.. వాట్ నెక్స్ట్..!


******************************

Manoj Mounika: పొలిటికల్ ఎంట్రీపై ఒక్క మాటతో తేల్చేసిన మంచు మనోజ్.. మౌనికకు లైన్ క్లియర్ అయినట్లేనా..!

******************************

Manchu Manoj Mounika Marriage : మంచు మనోజ్-మౌనిక లవ్ మ్యారేజీకి ఆ ఒక్కటే కారణమా.. అందుకే హీరో ఫిదా అయిపోయాడా..?


******************************

Medico Preethi : డీజీపీ నుంచి వరంగల్ సీపీకి ఫోన్.. కొత్త మలుపులు తిరుగుతున్న డాక్టర్ ప్రీతి కేసు.. ఏం జరుగుతుందో ఏమో..!?

******************************

Medico Preethi : డాక్టర్ ప్రీతి ఘటనలో 11 అనుమానాలు.. అపస్మారక స్థితిలో ఉండగా ..!?

******************************

Doctor Preethi Case : మెడికో ప్రీతి కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ తేల్చిన అసలు నిజం ఇదీ..

******************************

Medico Preethi : ప్రీతి కేసులో నోరు విప్పిన సైఫ్.. సంచలన విషయాలు వెలుగులోకి.. కీలకంగా మారిన బ్యాగ్!


******************************

APGIS2023 : సిగ్గో.. సిగ్గు.. వైజాగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఇదేం దారుణం.. తీవ్ర అసహనానికి గురై బయటికొచ్చేసిన డెలిగేట్స్..!

******************************

Big Breaking : విశాఖ గ్లోబల్ సమ్మిట్‌లో గొడవ.. రచ్చ రచ్చగా మారిన ఏయూ గ్రౌండ్స్.. ముందే చెప్పిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి!

******************************

Updated Date - 2023-03-07T23:20:11+05:30 IST