Big Breaking : విశాఖ గ్లోబల్ సమ్మిట్‌లో గొడవ.. రచ్చ రచ్చగా మారిన ఏయూ గ్రౌండ్స్.. ముందే చెప్పిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి!

ABN , First Publish Date - 2023-03-03T17:25:31+05:30 IST

వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) ప్రతిష్ఠాత్మకంగా విశాఖలో చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో (Global Investors Summit ) గందరగోళం నెలకొంది. ..

Big Breaking : విశాఖ గ్లోబల్ సమ్మిట్‌లో గొడవ.. రచ్చ రచ్చగా మారిన ఏయూ గ్రౌండ్స్.. ముందే చెప్పిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి!

వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) ప్రతిష్ఠాత్మకంగా విశాఖలో చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో (Global Investors Summit ) గందరగోళం నెలకొంది. సమ్మిట్‌లో కిట్‌ల పంపిణీ దగ్గర గొడవ జరిగింది. దీంతో చుట్టుపక్కలున్న స్టాల్స్ అన్నీ ధ్వంసం అయ్యాయి. ఎవరికి దొరికిన కిట్ (Summit Kits) వాళ్లు తీసుకెళ్లిపోతున్నారు. కొందరికి కిట్ దొరక్కపోయేసరికి తోపులాట కూడా జరిగింది. ఈ పరిస్థితిని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ఎక్స్‌క్లూజివ్ వీడియోలో (Exclusive Video) స్పష్టంగా చూడొచ్చు. మరోవైపు.. అతిథులకు భోజనాలు (Food) అయిపోవడంతో ఏయూ ప్రాంగణం రచ్చ రచ్చగా మారింది. కొందరు ముఖ్య అతిథులకు భోజనాలు కూడా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. అయితే.. ఒక్కసారిగా జనసంఖ్య ఎక్కువ కావడంతో పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలేకపోయారని తెలుస్తోంది.

అసలేం జరిగింది..?

శుక్రవారం ఉదయం పెద్ద పెద్ద ఇన్వస్టర్స్‌తో ప్రశాంతంగా ప్రారంభమైన సమ్మిట్ మధ్యాహ్నం అయ్యేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. నిర్వాహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. సమ్మిట్‌ లోపలికి వచ్చిన ఇన్వెస్టర్స్, డెలిగేట్స్ ఒక్కసారి బయటికెళ్తే మళ్లీ లోపలికి అనుమతించే పరిస్థితి కూడా లేదు. పెట్టుబడులు పెట్టేవారి కన్నా ఉచిత రిజిస్ట్రేషన్‌లు ఎక్కువగా కావడం వల్ల 14 నుంచి 16వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వారందర్నీ లోపలికి అనుమతిస్తే ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం ఉందట. ఇందులో ఎవరు డెలిగేట్స్, ఎవరు ఉచిత రిజిస్ట్రేషన్‌దారులు అనేది తెలియని పరిస్థితట. అందుకే ఒక్కసారి లోపల ఉన్నవారు బయటికి వస్తే లోపలికి అనుమతించే పరిస్థితి లేకుండా పోయిందట. భోజన విరామం (Lunch Break) సమయంలో డెలిగేట్స్ (Delegates) లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఫారిన్ డెలిగేట్స్ మాత్రమే అనుతిస్తామని, సాధారణ డెలిగేట్స్‌ను మాత్రం మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత అనుమతిస్తామని చెప్పడంతో చాలాసేపు వారు వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో భోజనాల దగ్గర తొక్కిసలాట జరిగింది. వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా చేతులెత్తిసినట్లు తెలియవచ్చింది.

Global-Summit-1.jpg

ముందే చెప్పిన ఏబీఎన్..!

మొత్తానికి చూస్తే.. కోటాను కోట్లు పెట్టి నిర్వహించిన సమ్మిట్‌లో కిట్‌లు, భోజనాల కోసం కుమ్ములాట జరగడంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయస్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా డేలిగేట్స్ వచ్చిన ఈ సమ్మిట్‌లో ఇలా జరగడంతో.. నిర్వాహణ లోపం అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిర్వహణలో లోపాలున్నాయని మొదట్నుంచీ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చెబుతూనే వస్తోంది. మధ్యాహ్నం అయ్యే సరికి ఆంధ్రజ్యోతి చెప్పిన విషయాలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఎప్పుడైనా ఇన్వస్టర్స్ సమ్మిట్ పెట్టేటప్పుడు ఎవరు ఇన్వస్టర్లు (Investors), ఎవరు ఫ్రీ రిజిస్ట్రేషన్ (Free Registration) చేయించుకున్నారు అనేదానిపై చాలా క్లారిటీగా ఉండాలి. అయితే సమ్మిట్‌లో జనసంఖ్య భారీగా కనిపించాలని ఇలా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిన దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.Global-Summit.jpg

Updated Date - 2023-03-03T18:17:56+05:30 IST