APGIS2023 : సిగ్గో.. సిగ్గు.. వైజాగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఇదేం దారుణం.. తీవ్ర అసహనానికి గురై బయటికొచ్చేసిన డెలిగేట్స్..!

ABN , First Publish Date - 2023-03-03T21:20:19+05:30 IST

వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) ప్రతిష్ఠాత్మకంగా విశాఖలో చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో (Global Investors Summit) మొదటి రోజే 9లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి...

 APGIS2023 : సిగ్గో.. సిగ్గు.. వైజాగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఇదేం దారుణం.. తీవ్ర అసహనానికి గురై బయటికొచ్చేసిన డెలిగేట్స్..!

వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) ప్రతిష్ఠాత్మకంగా విశాఖలో చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో (Global Investors Summit) మొదటి రోజే 9లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అయితే సమ్మిట్‌లో పరిస్థితులు మాత్రం దారుణాతి దారుణంగా ఉన్నాయి. రెండ్రోజుల సమ్మిట్‌లో భాగంగా ఇవాళ జరిగిన ఇన్వెస్టర్స్‌ మీటింగ్‌లో నిర్వాహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. తినడానికి తిండి లేక, కనీసం టాయ్‌లెట్ వెళ్లడానికి సౌకర్యాలు సరిగ్గాలేక డెలిగేట్స్ (Delegates) తీవ్ర ఇబ్బందులు పడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే భోజనం, కిట్‌ల దగ్గర రచ్చ రచ్చ జరగినట్లు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ఎక్స్‌క్లూజివ్‌గా వీడియోలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో విషయం వెలుగుచూసింది.

Summit-Issue.jpg

ఇదీ అసలు కథ..

పెట్టుబడుల సదస్సుకు వచ్చిన ఇన్వెస్టర్స్ (Investors ), డెలిగేట్స్ తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. టాయిలెట్ల (Toilets) సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో డెలిగేట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ, విదేశాల నుంచి వేలాది సంఖ్యలో డెలిగేట్స్ ఈ సదస్సుకు విచ్చేశారు. అయితే ఈ డెలిగేట్స్ కోసం కనీసం పదుల సంఖ్యలో కూడా టాయిలెట్స్ లేకపోవడం గమనార్హం. దీంతో తీవ్ర అసహనానికి లోనైన కొందరు డెలిగేట్స్ సదస్సు నుంచి బయటికి వెళ్లిపోయారట. ఇంకొందరైతే సదస్సు నుంచి బయటికి వచ్చి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. దీనిపై సోషల్ మీడియాలో చిత్రవిచిత్రాలుగా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి ఏర్పాట్లు సరిగ్గా లేవని అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఇవాళ ఉదయం నుంచే పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.

Summit-Issue-1.jpg

ఫుడ్, కిట్‌ల కోసం రచ్చ..!

కాగా సమ్మిట్‌లో ఇవాళ మధ్యాహ్నం గందరగోళం నెలకొంది. సదస్సులో కిట్‌ల పంపిణీ దగ్గర గొడవ జరిగింది. దీంతో చుట్టుపక్కలున్న స్టాల్స్ అన్నీ ధ్వంసం అయ్యాయి. ఎవరికి దొరికిన కిట్ (Summit Kits) వాళ్లు తీసుకెళ్లిపోయారు. కొందరికి కిట్ దొరక్కపోయేసరికి తోపులాట కూడా జరిగింది. ఈ పరిస్థితిని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ఎక్స్‌క్లూజివ్ వీడియోలో (Exclusive Video) స్పష్టంగా చూడొచ్చు. మరోవైపు.. అతిథులకు భోజనాలు (Food) అయిపోవడంతో ఏయూ ప్రాంగణం రచ్చ రచ్చగా మారింది. కొందరు ముఖ్య అతిథులకు భోజనాలు కూడా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. అయితే.. ఒక్కసారిగా జనసంఖ్య ఎక్కువ కావడంతో పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలేకపోయారని తెలుస్తోంది.

Global-Summit.jpg

మొత్తానికి చూస్తే.. మొదటి రోజు సమ్మిట్‌లోనే ఇంత అసౌకర్యాలతో డెలిగేట్స్ ఇబ్బంది పడ్డారంటే రెండోరోజైనా అధికారులు అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేల కోట్లు పెట్టుబడులు పెట్టెందుకు వచ్చిన ఇన్వెస్టర్స్‌కు ఇలాంటి చిన్నపాటి సౌకర్యాలు కల్పించకపోతే ఎలా..? అని నెటిజన్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పిస్తే మంచిది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Big Breaking : విశాఖ గ్లోబల్ సమ్మిట్‌లో గొడవ.. రచ్చ రచ్చగా మారిన ఏయూ గ్రౌండ్స్.. ముందే చెప్పిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి!

******************************

Medico Preethi : ప్రీతి కేసులో నోరు విప్పిన సైఫ్.. సంచలన విషయాలు వెలుగులోకి.. కీలకంగా మారిన బ్యాగ్!


*****************************

Updated Date - 2023-03-03T21:47:16+05:30 IST