Medico Preethi : డీజీపీ నుంచి వరంగల్ సీపీకి ఫోన్.. కొత్త మలుపులు తిరుగుతున్న డాక్టర్ ప్రీతి కేసు.. ఏం జరుగుతుందో ఏమో..!?

ABN , First Publish Date - 2023-03-05T23:01:11+05:30 IST

Medico Preethi : డీజీపీ నుంచి వరంగల్ సీపీకి ఫోన్.. కొత్త మలుపులు తిరుగుతున్న డాక్టర్ ప్రీతి కేసు.. ఏం జరుగుతుందో ఏమో..!? Warangal Preethi Case Takes New Turn After DGP Phone Call to CP Ranganath Nag

Medico Preethi : డీజీపీ నుంచి వరంగల్ సీపీకి ఫోన్.. కొత్త మలుపులు తిరుగుతున్న డాక్టర్ ప్రీతి కేసు.. ఏం జరుగుతుందో ఏమో..!?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి కేసు (Doctor Preethi Case ) కొత్త మలుపులు తిరుగుతోందా..? రేపట్నుంచీ ఈ కేసులో సీన్ మొత్తం మారనుందా..? ఇప్పటికే నిందితుడిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు ఈసారి కొత్త ప్రయోగం చేయబోతున్నారా..? అందుకే తెలంగాణ డీజీపీ (Telangana DGP) నుంచి వరంగల్ సీపీ రంగనాథ్‌కు (Warangal CP Ranganth) ఫోన్ కాల్ వెళ్లిందా..? డీజీపీకి సీపీ ఏం చెప్పబోతున్నారు..? సీపీతో డీజీపీ ఏం మాట్లాడబోతున్నారు..? క్లాస్ తీసుకుంటారా.. లేకుంటే సలహాలు ఇస్తారా..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

ఈ పిలుపుతో సర్వత్రా ఉత్కంఠ..!

మెడికో ప్రీతి కేసులో (KMC PG Preethi Case) రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే నిందితుడు సైఫ్‌ (Doctor Saif) నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టగా.. ప్రత్యేక బృందం ఇంకా లోతుగా విచారిస్తోంది. సైఫ్ చెప్పిన సమాచారాన్ని బట్టి సాంకేతికంగా ఏం చేయొచ్చు..? ఎలా ముందుకెళ్లొచ్చు..? అని పోలీసులు ఆలోచిస్తున్నారు. అతి త్వరలోనే ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని ఉన్నతాధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు విచారణ జరుగుతుండగానే వరంగల్ సీపీ రంగనాథ్‌కు.. డీజీపీ అంజనీకుమార్‌ (DGP Anjani Kumar) నుంచి పిలుపొచ్చిందనే వార్త ఇప్పుడు బయటికొచ్చింది. సోమవారం ఉదయం డీజీపీని రంగనాథ్ కలవబోతున్నారు. ఈ మీటింగ్‌పై సోషల్ మీడియాలో, మీడియాలో చిత్రవిచిత్రాలుగా రూమర్స్ వస్తున్నాయి. సోమవారం ఏం జరుగుతోందనే దానిపై జనాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Preethi.jpg

ఏం చేయబోతున్నారు..?

డీజేపీ-వరంగల్ సీపీ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చే అవకాశముంది. ప్రీతి ఘటన (Preethi Incident) తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన సీపీ రంగనాథ్.. నిందితుడు సైఫ్ గురించి, ఎలా వేధించారనే దానిపై పూసగుచ్చినట్టుగా వివరించిన విషయం తెలిసిందే. కేసులో ఇప్పటి వరకూ అసలేం జరిగింది..? తర్వాత ఏం చేయబోతున్నారు..? అనేదానిపై ఇద్దరి మధ్య చర్చ జరగనుందట. మరోవైపు.. ప్రీతి ఆత్మహత్యాయత్నం మొదలుకుని ఆమె చనిపోయే వరకూ ఏం జరిగింది..? మొదట ఆస్పత్రికి తరలించినప్పుడు, నిమ్స్‌లో (NIMS) ఏమేం ట్రీట్మెంట్ చేశారు..? విచారణలో ఏం తేల్చారు..? టెక్నికల్‌గా పోలీసులు సంపాదించిన ఆధారాలు ఇవన్నీ ఓ నివేదిక రూపంలో డీజీపీకి రంగనాథ్ సమర్పించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవన్నీ డీజీపీ చూసిన తర్వాత ఎలా ముందుకెళ్లాలి..? అనేదానిపై కొన్ని సలహాలు, సూచనలు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇప్పటి వరకూ ప్రీతి కేసులో మీడియాకు పోలీసులు, ఉన్నతాధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చాలా గోప్యంగానే విచారణ జరుపుతున్నారన్న విషయం తెలిసిందే. అందుకే ఈ విషయాలన్నీ మొదట డీజీపీకి చెప్పిన తర్వాతే మీడియాకు చెప్పాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారట.

CP-and-DGP.jpg

ఏం తేలుస్తారో..?

డీజీపీ పిలుపుతో ప్రీతి కేసు ఉదంతం కొత్త మలుపు తిరుగుతోందని చెప్పుకోవచ్చు. అయితే.. ఈ కేసులో నిందితుడు సైఫ్ అనే వ్యక్తి రాష్ట్ర హోం మంత్రికి (Telangana Home Minister) సమీప బంధువు అంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసు ఎటువైపు టర్న్ అవ్వబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతిగా కేసు మార్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రీతి కేసుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ రిపోర్టు రూపంలో సీపీ రంగనాథ్ చేతికొచ్చింది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ (Toxicology) రిపోర్టులో తేలింది. మరోవైపు.. ప్రీతి గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్టుతో స్పష్టమైంది.

ఖమ్మం జైలుకు సైఫ్..!

ఇదిలా ఉంటే.. ప్రీతి కేసులో నిందితుడు సైఫ్ పోలీసు కస్టడీ ముగిసింది. సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సైఫ్ నుంచి ఈ రెండు మూడ్రోజుల విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా శాఖాపరమైన విచారణలో అనస్థీషియా హెచ్‌వోడీ నాగార్జున రెడ్డి ఆగడాలు చాలానే వెలుగు చూశాయని సమాచారం. హెచ్‌వోడీ కౌన్సిలింగ్‌తో ప్రీతి కన్నీరు పెట్టడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హనుమకొండ జీఎంహెచ్‌లో సైఫ్, హెచ్‌వోడీ వ్యవహారాన్ని వేధింపులుగానే పోలీసు శాఖ భావిస్తోందట. ప్రీతి ఆడియోల్లో హెచ్‌వోడీ పేరును ప్రస్తావించడాన్ని కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రీతి కన్నీరు పెట్టడంతో హెచ్‌వోడీ తీరుపై పోలీసులకు చాలా అనుమానాలే వస్తున్నాయట. అయితే.. ఈ కేసులో హెచ్‌వోడీ పాత్ర చాలానే ఉందని.. తెరవెనక ఆయన నడిపిన మంత్రాంగం వల్లే ఎంజీఎంలో ఆందోళనలు జరిగినట్లు కొత్త కోణం వెలుగుచూస్తోంది.

Dr-Saif.jpg

ప్రెస్‌మీట్‌లో సీపీ ఏం చెప్పారు..?

డాక్టర్‌ ప్రీతిని సైఫ్ వేధించడం నిజమే. ప్రీతి చాలా సెన్సిటివ్. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడు. ఈ కారణంగానే ప్రీతికి సహకరించవద్దని స్నేహితులకు సైఫ్ చెప్పాడు. ప్రీతిని.. సైఫ్ ఉద్దేశపూర్వకంగానే వేధించాడని పోలీసులు నిర్ధారించారు. ప్రీతికి నేర్పించే క్రమంలో గట్టిగా చెబుతున్నానని సైఫ్ వాదిస్తున్నాడు.. కానీ మొదట్నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బంది పడుతూ వచ్చింది. వాట్సాప్ గ్రూపులో ప్రీతిని టార్గెట్ చేస్తూ సైఫ్ వేధించాడు. ఇద్దరి మధ్య రెండు, మూడు ఘటనలు జరిగాయి. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతి గురించి సైఫ్ అవమానకర పోస్టులు పెట్టాడు. గ్రూపులో పోస్టు పెట్టి తనను అవమానపరచవద్దని సైఫ్‌ని ప్రీతి వేడుకుంది. తనను అవమానపరిచావని సైఫ్‌తో ప్రీతి చెప్పింది. ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకురావాలని ప్రీతి కోరింది. సైఫ్ తన ఇతర మిత్రులతో కలిసి వాట్సాప్‌లో ప్రీతిని వేధించినట్టు తేలింది. 20 న సైఫ్ వేధింపుల గురించి ప్రీతి తన తండ్రికి చెప్పింది. 21న ప్రీతి, సైఫ్‌ను కాలేజీ యాజమాన్యం విచారించింది. అయినా సైఫ్ తగ్గకపోవడంతో.. మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసింది. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్ట్ చేశాం. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశాం అని ప్రీతి ఘటనపై సీపీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు.

మొత్తానికి చూస్తే.. ఇప్పటి వరకూ ఎన్నో ట్విస్టులు, సంచలన విషయాలు ఈ కేసులో వెలుగులోకి రాగా.. తాజాగా డీజీపీ పిలుపుతో ఈ ఉదంతంగా కొత్త మలుపు తిరిగినట్లయ్యింది. సోమవారం సాయంత్రానికి ఈ కేసు వ్యవహారం మొత్తం క్లియర్ అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయట. ఫైనల్‌గా ఏం జరుగుతుందో తెలియాలంటే డీజీపీ-సీపీ భేటీ ముగిసేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Medico Preethi : డాక్టర్ ప్రీతి ఘటనలో 11 అనుమానాలు.. అపస్మారక స్థితిలో ఉండగా ..!?

Doctor Preethi Case : మెడికో ప్రీతి కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ తేల్చిన అసలు నిజం ఇదీ..

******************************

Medico Preethi : ప్రీతి కేసులో నోరు విప్పిన సైఫ్.. సంచలన విషయాలు వెలుగులోకి.. కీలకంగా మారిన బ్యాగ్!


******************************

APGIS2023 : సిగ్గో.. సిగ్గు.. వైజాగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఇదేం దారుణం.. తీవ్ర అసహనానికి గురై బయటికొచ్చేసిన డెలిగేట్స్..!

******************************

Big Breaking : విశాఖ గ్లోబల్ సమ్మిట్‌లో గొడవ.. రచ్చ రచ్చగా మారిన ఏయూ గ్రౌండ్స్.. ముందే చెప్పిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి!

******************************

Updated Date - 2023-03-05T23:24:59+05:30 IST