Telangana Politics : తెలంగాణ ఎన్నికల్లో త్రిముఖ పోరా.. ద్విముఖ పోరా..? బీజేపీని కేసీఆర్ పక్కనెట్టారా.. సరెండర్ అయ్యారా.. అసలేం జరుగుతోంది..!

ABN , First Publish Date - 2023-06-05T20:22:18+05:30 IST

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో (TS Elections) త్రిముఖ పోరు ఉంటుందా.. లేకుంటే ద్విముఖ పోరు ఉంటుందా..? ఇన్నాళ్లు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ (BRS Vs Congress, BJP) పార్టీలుగా ఉన్న పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందా..?

Telangana Politics : తెలంగాణ ఎన్నికల్లో త్రిముఖ పోరా.. ద్విముఖ పోరా..? బీజేపీని కేసీఆర్ పక్కనెట్టారా.. సరెండర్ అయ్యారా.. అసలేం జరుగుతోంది..!

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో (TS Elections) త్రిముఖ పోరు ఉంటుందా.. లేకుంటే ద్విముఖ పోరు ఉంటుందా..? ఇన్నాళ్లు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ (BRS Vs Congress, BJP) పార్టీలుగా ఉన్న పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందా..? ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ (BRS Vs Congress) మధ్యే పోరు ఉండనుందా..? నిన్న మొన్నటి వరకూ బీజేపీ-బీఆర్ఎస్ (BJP-BRS) ఒక్కటేనన్న ఆరోపణలు ఏమయ్యాయ్..? బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయ్యిందా..? తెలంగాణలో నిజంగానే టీడీపీతో బీజేపీ (TTDP-BJP) దోస్తీ ఉంటుందా..? రేపో మాపో అధికారంలోకి వచ్చేస్తున్నామనేలా సీన్ క్రియేట్ చేసిన బీజేపీ ఒక్కసారిగా ఢీలా పడిపోయిందేం..? ఇన్నిరోజులుగా బీజేపీ అంటే చాలు ఒంటి కాలిపై లేచే సీఎం కేసీఆర్ (CM KCR) సడన్‌గా ఎందుకిలా యూటర్న్ తీసుకున్నారు..? బీజేపీని పూర్తిగా వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్‌నే గులాబీ బాస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

CM-KCR-Niramal.jpg

తెలంగాణలో అసలేం జరుగుతోంది..!

తెలంగాణ రాజకీయాల్లో (TS Politcs) ఎప్పుడేం జరుగుతుందో ఊహకందని పరిస్థితి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ఎలా యూటర్న్ తీసుకుంటుందో..? నేతలు ఎవరు ఎలా మాట్లాడుతారో..? ఎవరు ఎవరితో కలిసిపోతారో.. ఎవరు ఎప్పుడు సొంత పార్టీకి గుడ్ బై చెప్పేసి పక్క పార్టీ కండువాలు కప్పుకుంటారో ఎవరికీ అర్థం కాదు. ఇందుకు గత కొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలే చక్కటి ఉదాహరణ. ఇక అసలు విషయానికొస్తే.. రెండ్రోజుల క్రితం వరకూ బీజేపీ అంటే కేసీఆర్ ఓ రేంజ్‌లో విరుచుకుపడేవారు. ప్రెస్‌మీట్ అయినా.. బహిరంగ సభ అయినా కాషాయ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండానే తిట్టే సార్.. నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. అసలు బీఆర్ఎస్‌కు బీజేపీ బద్ధ శత్రువే కాదు.. అసలుసిసలైన శత్రువు కాంగ్రెస్సే అన్నట్లుగా నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ వింత వైఖరి ప్రదర్శించారు. అసలు బీజేపీ అనే పార్టీ ఒకటి తెలంగాణలో ఉందన్న విషయాన్ని మరిచిపోయారేమో కానీ.. పొల్లెత్తు మాట బీజేపీని అనలేదు.. ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. పొత్తుల విషయంలో రకరకాలుగా వస్తున్న వార్తలను కనీసం ఖండించకపోవడం గమనార్హం. తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు దాదాపు ఖాయమైందని.. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుందన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపైనా కేసీఆర్ స్పందించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ప్రసంగంలో మాటకు ముందు.. మాట తర్వాత కాంగ్రెస్.. కాంగ్రెస్ అనేది తప్ప వేరేదేమీ రాలేదంటే పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే.. ఇకపై బీజేపీని పూర్తిగా పక్కనెట్టేసి కాంగ్రెస్‌ను కేసీఆర్ టార్గెట్ చేశారని ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే..! ఒక్క మాటలో చెప్పాలంటే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ అని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారన్న మాట. మరి బీజేపీ సంగతేంటి..? అసలు ఏ ఉద్దేశంతో కేసీఆర్ ఈ మాటలు అన్నారు..? కాంగ్రెస్‌కు భయపడ్డారా..? లేకుంటే మరేమైనా జరిగిందా అనేది గులాబీ బాస్‌కే తెలియాలి మరి.

KCR-Vs-Modi.jpg

సరెండర్ అయ్యారా..!?

కేసీఆర్ నిర్మల్ సభలో మాట్లాడిన ప్రసంగాన్ని విన్న సభికులు.. టీవీల్లో చూసిన జనాలు, సొంత పార్టీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. సారులో సడన్‌గా ఇంత మార్పు వచ్చిందేంటబ్బా..? అని బీఆర్ఎస్‌లోని అగ్రనేతలు సైతం కంగుతిన్నారట. కేసీఆర్‌లో ఈ మార్పునకు కారణం ఏమై ఉంటుందో ఏంటో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi Liquor Scam Case) పీకల్లోతు ఇరుక్కుపోయిన కల్వకుంట్ల కవితను (Kalvakuntla Kavitha) కాపాడుకోవడానికి బీజేపీకి కేసీఆర్ సరెండర్ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య ఈ కేసులో ఈడీ, సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌‌లో, విచారించిన వారి జాబితాలో ఎక్కడా ఎమ్మెల్సీ కవిత పేరు కనిపించలేదు. ఆ తర్వాత ఓ సందర్భంలో కవిత పేరు ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఎలాంటి చలీ చప్పుడు లేదు. దీంతో కవిత పాత్ర ఉందన్న దానికి దర్యాప్తు సంస్థల దగ్గర ఎలాంటి ఆధారాల్లేవ్ అనేది బీఆర్ఎస్ శ్రేణుల భావన. దీనంతటికీ కారణం అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే కవితకు ఈడీ క్లీన్ చిట్ ఇవ్వబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!. ఇన్నిరోజులుగా బీఆర్ఎస్-బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందన్న వార్తలకు.. కేసీఆర్ ప్రసంగం బలం చేకూరుస్తోందన్నది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

WhatsApp Image 2023-06-05 at 8.28.18 PM.jpeg

ఎవరూ తగ్గట్లేదుగా..?

వాస్తవానికి.. కర్ణాటక ఎన్నికల్లో కాషాయ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలాకా సీన్ మొత్తం మారిపోయింది. ఎవరూ కలలో కూడా ఊహించని రీతిలో కాంగ్రెస్ గెలవడమే కాదు.. సీట్లు కూడా దక్కించుకుంది. దీంతో అప్పటి వరకూ దక్షిణాదిన పాగా వేయాలని.. కర్ణాటక తర్వాత తెలంగాణనే టార్గెట్ అని.. అదిగో అధికారంలోకి వచ్చేస్తున్నాం.. ఇదిగో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తున్నాం అని రాష్ట్ర కమలనాథులు సీన్ క్రియేట్ చేశారు. సీన్ కట్ చేస్తే.. కొత్త రాష్ట్రాల సంగతి దేవుడెరుగు.. ముందు ఉన్న రాష్ట్రాల్లో మరోసారి పార్టీని గెలిపించుకుంటే చాలా మహాప్రభో అనేంతలా పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీజేపీ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. దీన్ని అదునుగా చేసుకున్న కేసీఆర్.. కాషాయ పార్టీ పని అయిపోయిందని ఇక బీజేపీని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని భావించారో ఏమో తెలియట్లేదు కానీ.. ఆ పార్టీని టార్గెట్ చేయడం పూర్తిగా పక్కనెట్టేశారేమో అనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న సెటిలర్స్‌ను తమవైపునకు తిప్పుకోవాలని టీడీపీతో పొత్తు దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వేదికగా బీజేపీలో నంబర్-02, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Amit Shah) టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) చర్చలు జరిపారు. ఆ చర్చలు ఎంతవరకూ వర్కవుట్ అయ్యాయనే విషయం తెలియరాలేదు. టీడీపీ-బీజేపీ పొత్తు (TDP-BJP Alliance) అనేది ఊహాగానాలే అని బండి సంజయ్ (Bandi Sanjay) చెబుతున్నారు.

WhatsApp Image 2023-06-05 at 8.30.04 PM.jpeg

- ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) ముందు వరకూ కొన ప్రాణాలతో కొట్టుకుంటున్న పార్టీ ఈ గెలుపుతో ఒక్కసారిగా ఊపిరొచ్చినట్లు అయ్యింది. దీంతో ఇక ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అన్నట్లుగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఆ ఫలితాలే తెలంగాణలో కూడా రిపీట్అవుతాయని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. అయితే అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం.. అసలు తమకు బీఆర్ఎస్ లెక్కే లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో బీజేపీని తుడిచిపెట్టేస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాషాయ పార్టీలను ఓడిస్తామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఒకింత చాలెంజ్ చేసి మరీ చెబుతున్నారు. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లెక్కలేసి మరీ రాహుల్ చెప్పుకొస్తున్నారు. అగ్రనేతే ఇంత ధీమాగా చెబుతుండటం.. గెలుపుపై రోజురోజుకూ కాంగ్రెస్‌ అధిష్టానంలో కాన్ఫిడెన్స్ పెరుగుతున్న తరుణంలో.. తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు ఆగుతాయా..? అనేది ప్రశ్నార్థకమే. మొత్తానికి చూస్తే.. అటు కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేయడం వదిలేయగానే.. ఇటు రాహుల్ టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారన్న మాట. ఇవన్నీ మాటలకే పరిమితం అవుతాయో లేకుంటే గెలుపు వరకూ వెళ్తాయో చూడాలి మరి.

WhatsApp Image 2023-06-05 at 8.31.17 PM.jpeg

మొత్తానికి చూస్తే.. బీజేపీని కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదో అసలు విషయం తెలియట్లేదు కానీ గులాబీ బాస్‌పై మాత్రం చిత్రవిచిత్రాలుగా మాత్రం పుట్టుకొస్తున్నాయి. పోనీ ద్విముఖ పోరా (కాంగ్రెస్-బీఆర్ఎస్)అంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికలను అంత ఈజీగా మరిచిపోలేం.. అంత ఈజీగా బీజేపీని పక్కనెట్టలేం. ఇక త్రిముఖ పోరా అంటే దీన్ని కొట్టేయలేని పరిస్థితి. ఇప్పుడు బీజేపీ ఢీలా పడినా రేపొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఇప్పటికైతే కాషాయ కండువా కప్పుకోవడానికి నేతలు విముఖుత చూపుతున్నారు సరే ఎన్నికల ముందు ఎలా ఉంటుందో ఉహించలేం. ఇక కన్నడనాట గెలుపుతో అధికారంలోకి వచ్చేస్తున్నామని కాంగ్రెస్ తెగ ఉవ్విళ్లూరుతోంది.. హస్తం పార్టీని తక్కువ అంచనా వేసే పరిస్థితి కూడా లేదు. మునుపటితో పోలిస్తే చాలా బలపడిందన్నది మాత్రం గుర్తుంచుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు ఏం జరుగుతుందో.. ఏ పార్టీల మధ్య ప్రధాన పోరు ఉంటుందో తెలియాలంటే మరో నాలుగైదు నెలలు ఆగితే కానీ అర్థం కాదు.. ఏం జరుగుతుందో చూడాలి మరి.

KCR-BJP.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

KCR Vs Congress : సీఎం కేసీఆర్ వింత వైఖరి.. ఆలోచనలో పడిన బీఆర్ఎస్ నేతలు.. సడన్‌గా ఇలా యూటర్న్ తీసుకున్నారేంటో..?


******************************

YS Jagan Cabinet Meeting : జూన్-7 చుట్టూ తిరుగుతున్న ఏపీ పాలిటిక్స్.. ఎవరికీ ఊహకందని ప్రకటన వైఎస్ జగన్ చేయబోతున్నారా.. ఢిల్లీ టూర్‌తో లింకేంటి..!?

******************************

AP Politics : కోడెల శివరాం పంచాయితీ నడుస్తుండగానే ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు.. ఎవరీ ప్రవీణ్.. ఎందుకింత రచ్చ..!?

******************************

PK Vs SK : ఈ ఒక్కటీ జరిగితే ‘పీకే’ పని అయిపోయినట్టేనా.. ఇక ఫ్యూచర్ అంతా ‘ఎస్కే’దేనా.. ఇంతకీ ఎవరీయన.. బ్యాగ్రౌండ్ ఏంటి..!?

******************************

Delimitation : కొత్త పార్లమెంట్‌లో సీట్ల సంఖ్య పెంపు ప్రకటన వెనుక ఇంత పెద్ద కథుందా.. ఎవరికి లాభం.. అసలు మోదీ ప్లానేంటి..!?

******************************
Balineni Meets YS Jagan : గంటన్నరపాటు వైఎస్ జగన్‌‌తో బాలినేని భేటీ.. సుదీర్ఘ చర్చల తర్వాత ఫైనల్‌గా ఏం తేలిందంటే..

******************************

Updated Date - 2023-06-05T21:34:46+05:30 IST