AP Politics : కోడెల శివరాం పంచాయితీ నడుస్తుండగానే ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు.. ఎవరీ ప్రవీణ్.. ఎందుకింత రచ్చ..!?

ABN , First Publish Date - 2023-06-02T20:38:57+05:30 IST

టీడీపీలో నెలకొన్న పరిస్థితులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏం జరుగుతోంది..? ఫౌండేషన్ల పేరుతో జరుగుతున్న హడావుడి..? కోడెల శివరాం వ్యవహారం..? ఇలా అన్ని విషయాలపైనా...

AP Politics : కోడెల శివరాం పంచాయితీ నడుస్తుండగానే ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు.. ఎవరీ ప్రవీణ్.. ఎందుకింత రచ్చ..!?

ఆంధ్రప్రదేశ్ టీడీపీలో (AP TDP) గత కొన్నిరోజులుగా నెలకొన్న పరిణామాలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాటి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో (AP Politics) ముఖ్యంగా.. టీడీపీలో కార్యకర్తలు (TDP Activists) మొదలుకుని నేతల వరకూ దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ హైకమాండ్ (TDP High Command) ఎలా స్పందిస్తుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం రాత్రి మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి.. టీడీపీలో నెలకొన్న పరిస్థితులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏం జరుగుతోంది..? ఫౌండేషన్ల పేరుతో జరుగుతున్న హడావుడి..? కోడెల శివరాం వ్యవహారం..? ఇలా అన్ని విషయాలపైనా పుల్లారావు మాట్లాడారు.

Pratthi.jpg

అంతా ఎన్నికల ముందే..!

ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది హడావుడే. ఫౌండేషన్లు, ట్రస్టులు పేర్లతో వచ్చే నేతలను ఎంటర్ టైన్ చేస్తే ఎలా..?. అక్కడో రూ. 10 వేలు.. ఇక్కడో రూ. 10 వేలు ఇచ్చి టిక్కెట్లు కావాలంటే ఇచ్చేస్తారా..?. ఇప్పుడేదో రూ. కోటి ఖర్చు పెట్టి హడావుడి చేస్తారు.. ఆ తర్వాత చేతులెత్తేస్తారు. ఎన్నికల ముందే ఫౌండేషన్, ట్రస్టు పేర్లతో నేతలు హడావుడి చేస్తారు. నాలుగేళ్ల పాటు ఈ ఫౌండేషన్, ట్రస్ట్ నేతలు ఏమయ్యారు..?. ఎన్నికల్లో పోటీ చేయడమంటే మాటలా..?. ఇలా ఫౌండేషన్లు, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలు పార్టీ కోసం ఏం చేస్తారు..?. ఫౌండేషన్ నేతలు, ట్రస్టు పేర్లతో వచ్చే నేతలు ఎన్నికలు ముందొస్తారు.. ఎన్నికలవగానే వెళ్లిపోతారు. ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికో.. విదేశాల్లో ఎన్ఆర్ఐల దగ్గర షో చేయడానికో ఇలాంటి నేతలు వస్తారు. ప్రజల్లో ఉన్న నేతలకు.. గెలుస్తామనే ధీమా ఉన్న నేతలకు ఎవరొస్తే ఏంటీ..?. పార్టీని పట్టించుకోకుండా సీనియర్లు తిరుగుతున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు అని పుల్లారావు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bhasyam-Praveen.jpg

ఎవరీ ప్రవీణ్..!?

భాష్యం ప్రవీణ్‌కు (Bhashyam Praveen).. చిలకలూరిపేటకు సంబంధమేంటీ..?. ప్రవీణ్‌కు చిలకలూరిపేటలో (Chilakaluripet) ఓటే లేదు. చిలకలూరిపేట లో జరుగుతున్న పరిణామాలు పార్టీకి అధినేత చంద్రబాబు దృష్టి కి తీసుకు వెళ్లాను అని పుల్లారావు చెప్పుకొచ్చారు. కాగా.. ఈ మధ్య ఎక్కడ చూసినా టీడీపీ యువనేత ప్రవీణ్ పేరు మోతెక్కిపోతోంది. చంద్రబాబు 73వ పుట్టిన రోజు సందర్భంగా 73 లక్షల రూపాయిలు విరాళంగా అందజేశారు. అంతేకాదు.. భాష్యం ప్రవీణ్ పేరిట చారిటబుల్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో స్వయం ఉపాధికి సాయం చేయడం, వీధి వ్యాపారులకు టిఫిన్, తోపుడు బండ్లు పంపిణీ చేయడం, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేయడం, అమరావతి రైతులకు విరాళం ఇవ్వడం ఇలా ఒకటా రెండా చాలా పనులే ప్రవీణ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్‌ను ప్రవీణ్ ఆశిస్తున్నారో.. లేకుంటే పుల్లారావు ఊహించుకుంటున్నారో తెలియట్లేదు కానీ.. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రవీణ్ ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

Prattipati-and-Bhasyam.jpg

న్యాయం చేయాల్సిందే..!

సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌గా సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణను (Sattenapalli Incharge Kanna Lakshmi Narayana) టీడీపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటి వరకూ నియోజకవర్గానికి అన్నీ తానై చూసిన తన పరిస్థితేంటి..? అని కోడెల శివరాం (Kodela Shivaram) తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన్ను ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) వెళ్లి బుజ్జగించారు. ఆ తర్వాత శివరాం కాస్త మెత్తపడినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపైనే పత్తిపాటి పుల్లారావు కూడా స్పందించారు. కొడెల కుటుంబానికి న్యాయం చేయాల్సిందేనని ఒకింత ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు.. శివరాంకు ఎన్నికల ముందో లేకుంటే ఆ తర్వాతో టీడీపీ న్యాయం చేస్తుందని పుల్లారావు చెప్పుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కన్నా లక్ష్మీనారాయణ కలిశారు. సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా నియమించిన తర్వాత తొలిసారి టీడీపీ కార్యాలయానికి కన్నా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. సత్తెనపల్లిలో కోడెల శివరాం పంచాయితీ నడుస్తుండగానే చంద్రబాబును కన్నా కలవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Kodela-Sivaram.jpg

మొత్తానికి చూస్తే.. అటు సత్తెనపల్లి పంచాయితీకి ఫుల్‌స్టాప్ పడకముందే ఇప్పుడు చిలకలూరిపేట వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ రెండు నియోకవర్గాల విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

PK Vs SK : ఈ ఒక్కటీ జరిగితే ‘పీకే’ పని అయిపోయినట్టేనా.. ఇక ఫ్యూచర్ అంతా ‘ఎస్కే’దేనా.. ఇంతకీ ఎవరీయన.. బ్యాగ్రౌండ్ ఏంటి..!?


******************************

Delimitation : కొత్త పార్లమెంట్‌లో సీట్ల సంఖ్య పెంపు ప్రకటన వెనుక ఇంత పెద్ద కథుందా.. ఎవరికి లాభం.. అసలు మోదీ ప్లానేంటి..!?

******************************
Balineni Meets YS Jagan : గంటన్నరపాటు వైఎస్ జగన్‌‌తో బాలినేని భేటీ.. సుదీర్ఘ చర్చల తర్వాత ఫైనల్‌గా ఏం తేలిందంటే..

******************************

Updated Date - 2023-06-02T20:49:53+05:30 IST