YS Jagan Cabinet Meeting : జూన్-7 చుట్టూ తిరుగుతున్న ఏపీ పాలిటిక్స్.. ఎవరికీ ఊహకందని ప్రకటన వైఎస్ జగన్ చేయబోతున్నారా.. ఢిల్లీ టూర్‌తో లింకేంటి..!?

ABN , First Publish Date - 2023-06-04T18:35:29+05:30 IST

జూన్-07 (June-07).. ఈ తారీఖు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) తిరుగుతున్నాయ్.. ఎందుకంటే ఆ రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM YS Jagan Reddy) ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) జరగబోతోంది..

YS Jagan Cabinet Meeting : జూన్-7 చుట్టూ తిరుగుతున్న ఏపీ పాలిటిక్స్.. ఎవరికీ ఊహకందని ప్రకటన వైఎస్ జగన్ చేయబోతున్నారా.. ఢిల్లీ టూర్‌తో లింకేంటి..!?

జూన్-07 (June-07).. ఈ తారీఖు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) తిరుగుతున్నాయ్.. ఎందుకంటే ఆ రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM YS Jagan Reddy) ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) జరగబోతోంది.. సమావేశంలో జగన్ ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు..? ఆ నిర్ణయాలు ఊహకందని రీతిలో ఉంటాయా..? ఢిల్లీ పర్యటన (Jagan Delhi Tour) వెళ్లొచ్చిన రెండ్రోజుల వ్యవధిలోనే కేబినెట్ సమావేశం నిర్వహించాలనుకున్న జగన్.. జూన్-07నే ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారు..? ఈ భేటీకి ఏమైనా ప్రత్యేకత ఉందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఏ ఇద్దరు కలిసినా కేబినెట్ భేటీ గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ రోజున జగన్ రెడ్డి ఏం చేయబోతున్నారు..? సమావేశం అనంతరం కీలక ప్రకటన ఉంటుందా..? ఈ భేటీపై వైసీపీ (YSRCP) శ్రేణులు, సోషల్ మీడియాలో (Social Media) జరుగుతున్న చర్చేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

cm-jagan.jpg

ఓహో ఇందుకేనా.. అసలు కథ ఇదా..!?

సీఎం జగన్ ఆధ్వర్యంలో జూన్-7న జరగబోయే కేబినెట్ భేటీలో నవరత్నాలు (Navaratnalu) అమలు ఎలా ఉంది..? వైసీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం జరిగిందా..? లేదా..? హామీలు అన్నీ అమలయ్యాయా లేదా.. ఏడాది మాత్రమే ఎన్నికల గడువు ఉండటంతో ఇంకా చేయాల్సినవి ఏమైనా మిగిలున్నాయా..? అనే విషయాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని టాక్ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే ఎన్నికలే ప్రధాన అజెండాగా జరగబోతోందన్న మాట. అయితే.. ఈ సమావేశంలో జగన్ తీసుకునే పలు కీలక నిర్ణయాలు ప్రతిపక్షాలకు ఊహకందని రీతిలో ఉంటాయని తెలియవచ్చింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ‘ముందస్తు’ ఎన్నికలకు (Early Elections) సంబంధించి ముహూర్తం ఫిక్స్ అవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు లేదా అక్టోబర్‌లో ముందస్తుకు వెళ్లాలనే యోచనలో జగన్ ఉన్నట్లుగా వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఒకవేళ అసెంబ్లీ రద్దు చేస్తే మాత్రం కాస్త అటో ఇటో తెలంగాణతో పాటే ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. అయితే ఆగస్టులో లేకుంటే.. అక్టోబర్‌లో శాసన సభ రద్దు (Dissolution of the Assembly) చేస్తారనే టాక్ గట్టిగానే నడుస్తోంది. ఇదే విషయాన్ని కొందరు వైసీపీ ముఖ్య కార్యకర్తలు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఓ రేంజ్‌లో చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల జగన్ హస్తిన పర్యటనకు (Jagan Delhi Tour) వెళ్లొచ్చిన మరుసటిరోజే కేబినెట్ జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందట. జగన్ పర్యటనకు కేబినెట్ భేటీకి లింక్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్న జగన్.. ఈ ప్రపోజల్‌ను కేంద్రం ముందు ఉంచగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్కడ పచ్చ జెండా ఊపిన తర్వాత ఇక్కడ జగన్ అన్నీ సిద్ధం చేసుకుంటున్నారట. కేంద్ర మంత్రులు, ప్రధానితో సమావేశంలో పోలవరం (Polavaram), కడప ఉక్కు, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలపై చర్చించామని పేరుకే అధికారిక ప్రకటన ఇచ్చినప్పటికీ.. లోలోపల కథం మొత్తం ‘ముందస్తు’ గురించేనట.

TDP-BJP-Janasena.jpg

ఇప్పుడే ఎందుకీ చర్చ..!?

వాస్తవానికి ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉంది. ముందస్తు అనేది ఇప్పటికిప్పుడు వస్తున్న చర్చేమీ కాదు. అయితే.. ముందస్తు ఎన్నికలు లేనే లేవని షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెరపై ప్రకటన వచ్చిన ప్రతిసారీ.. కచ్చితంగా ముందస్తే అని తెర వెనుక నుంచి కూడా గట్టిగానే వినిపిస్తోంది. ముందస్తు జగన్ అన్నీ చక్కదిద్దుకున్నాకే హస్తిన పర్యటన వెళ్లొచ్చారనే టాక్ కూడా నడుస్తోంది. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇవ్వడంతోనే ఆరు నెలల ముందుగానే జగన్ ఎన్నికలకు వెళ్తున్నట్లుగా సమాచారం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే రె‘ఢీ’గా ఉన్నామని.. కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ కీలక నేతలు పలుమార్లు బహిరంగ సభావేదికగా ప్రకటించేశారు కూడా. అయితే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు (Chandrababu Delhi Tour) వెళ్లొచ్చిన తర్వాత మరోసారి ఈ ముందస్తు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ మధ్యనే టీడీపీ మేనిఫెస్టో (TDP Manifesto) ప్రకటించటం.. పొత్తు దిశగా ముందుకెళ్తుండటంతో జగన్ అలర్ట్ అయ్యారనే టాక్ నడుస్తోంది.

CBN.jpg

ముందస్తుకు వెళితే లాభమేంటి..!?

వాస్తవానికి ఏపీలో వైఎస్ జగన్‌ ఇమేజ్, వైసీపీకి గ్రాఫ్ (YSRCP Grap) పడిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొన్ని రహస్య సర్వేలు చేయడంతో పాటు ఇంటెలిజెన్స్ కూడా దాదాపు జగన్‌కు అంత సీన్ లేదనే చెప్పేశాయట. మరోవైపు.. టీడీపీ గ్రాఫ్ (TDP Graph) పెరగడం, పైగా ఈ మధ్యనే చంద్రబాబు మహానాడులో మ్యానిఫెస్టో ప్రకటించడం, టీడీపీ-బీజేపీ-జనసేన (TDP-BJP-Janasena) మూడు పార్టీల మధ్య పొత్తుల విషయంలో శరవేగంగా చర్చలు నడుస్తుండటంతో.. ఇక లాభం లేదని.. ఇదే జరిగితే కచ్చితంగా దెబ్బ పడుతుందని జగన్ భావించినట్లుగా తెలుస్తోంది. ఇదేదో క్లారిటీ వచ్చేలోపు ముందస్తుకు వెళ్తే బాగుంటుందని జగన్ మనసులోని మాటంట.

- మునుపటితో పోలిస్తే టీడీపీ బాగా బలపడిందనే చెప్పుకోవచ్చు. ఇందుకు నిదర్శనమే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (MLC Election Results). ఈ ఒక్కటి చాలు వైసీపీ ఎంత వీక్‌గా ఉందో చెప్పడానికి..!. వీటితో పాటు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడం.. ఏ నియోజకవర్గంలో చూసినా గడప గడపకు వెళ్లిన ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా.. కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే పరిస్థితే లేదని లీకులు రావడంతో వారంతా అతి త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారనే టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఇక మాటల్లో చెప్పక్కర్లేదు.

- ముఖ్యంగా.. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత.. జగన్‌పై ఉన్న అవినీతి కేసుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో పరిస్థితులు సరిగ్గా ఉన్నప్పుడే ముందస్తుకు వెళ్లాలని సీఎం అనుకుంటున్నారట. దీంతో పాటు ఏపీ ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉండటం, కేంద్రం ఇచ్చిన అప్పులకు ఆరునెలలు మాత్రమే పరిమితి ఉండటం, ఏం చేయాలన్నా అప్పు చేయక తప్పని పరిస్థితి ఉండటంతో ఇక చేసేదేమీ లేదట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ప్రభుత్వ పథకాల నుంచి ఉద్యోగుల జీతాల వరకూ అన్నింటికీ అప్పులతోనే ముడిపడి ఉందన్నది జగమెరిగిన సత్యమే. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆస్తులు తనఖాలు పెట్టి మరీ ప్రభుత్వం అప్పులు చేస్తున్న పరిస్థితి ఉంది. మరో ఏడాదివరకూ రెవిన్యూ లోటును భర్తీ చేసుకుంటూ జీతభత్యాలు ఇవ్వడం కూడా కష్టమేనని ప్రభుత్వం భావిస్తోందట. దీనికి తోడు ఉద్యోగులు ఇప్పటికే సమ్మె సైరన్ మోగించడంతో అసలేం చేయాలో వైసీపీ పెద్దలకు దిక్కు తోచట్లేదట. ఇలాంటి వాటన్నింటినీ తట్టుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మార్గమని జగన్ గట్టిగా నమ్ముతారని సమాచారం.

- పైన చెప్పినవన్నీ ఒక ఎత్తయితే.. వైఎస్ వివేకా కేసు జగన్ సర్కార్‌ను ఎనలేని చిక్కుల్లో పడేసింది. ఈ కేసు వ్యవహారంలో ఎప్పుడేం జరుగుతోందో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకూ కేంద్రం సహకరించినప్పటికీ ఇక చేసేదేమీ లేదని చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సొంత ఇంటి మనిషి అరెస్ట్ కావడం అనేది తన ఇమేజ్‌తో పాటు.. వైసీపీకి పెద్ద డ్యామేజేనని జగన్ భావిస్తున్నారట. ఆ నష్టమేదో జరగక ముందే ముందస్తుకు వెళ్తే కాస్త పరిస్థితులు అనుకూలిస్తాయని పెద్దల సూచనతో జగన్ ముందడుగేస్తున్నారట.

YSRCP.jpg

మొత్తానికి చూస్తే.. గత నెలరోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే జూన్-07న జగన్ కీలక నిర్ణయమే తీసుకుంటారని స్పష్టంగా అర్థమవుతోంది. ఆరు నెలలు ముందే ఎన్నికలకు వెళ్తే.. రాజకీయం, ఆర్థికంగా.. బలం, బలగం పరంగా.. వైసీపీకి కలిసొచ్చే అంశాలని జగన్ ప్రగాఢ విశ్వాసమట. వాస్తవానికి రాజకీయ నాయకులు ఎప్పుడేం చేస్తారో.. ఎప్పుడేం ప్రకటిస్తారో ఎవరికీ అర్థం కాదు. సో.. కేబినెట్ భేటీ తర్వాత దాదాపు ముందస్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.. సమావేశంలో ఏం జరుగుతుందో..? ఎలాంటి ప్రకటనలు ఉంటాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

AP Politics : కోడెల శివరాం పంచాయితీ నడుస్తుండగానే ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు.. ఎవరీ ప్రవీణ్.. ఎందుకింత రచ్చ..!?

******************************

PK Vs SK : ఈ ఒక్కటీ జరిగితే ‘పీకే’ పని అయిపోయినట్టేనా.. ఇక ఫ్యూచర్ అంతా ‘ఎస్కే’దేనా.. ఇంతకీ ఎవరీయన.. బ్యాగ్రౌండ్ ఏంటి..!?

******************************

Delimitation : కొత్త పార్లమెంట్‌లో సీట్ల సంఖ్య పెంపు ప్రకటన వెనుక ఇంత పెద్ద కథుందా.. ఎవరికి లాభం.. అసలు మోదీ ప్లానేంటి..!?

******************************
Balineni Meets YS Jagan : గంటన్నరపాటు వైఎస్ జగన్‌‌తో బాలినేని భేటీ.. సుదీర్ఘ చర్చల తర్వాత ఫైనల్‌గా ఏం తేలిందంటే..

******************************

Updated Date - 2023-06-04T18:58:17+05:30 IST