స్థానిక ఎన్నికల భేరి ఉమ్మడి జిల్లాలో సరికొత్త రాజకీయ వాతావరణానికి తెరతీస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో నవయువ రక్తంతో కూడిన వారసుల సందడి కనిపిస్తోంది. అనేక ఏళ్లుగా రాజకీయాల్లో స్థిరపడిన నేతలు తమ వారసుల రాజకీయాలకు దారులు వేస్తున్నారు. ఎన్నికల్లో బరిలో నిలిపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతంలో సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పడుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిలుస్తుందని ఉద్ఘాటించారు.
రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే పింక్ బుక్లో రాసుకుంటామని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పోలీసుల పని పడతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ గతంలో హామీలు ఇచ్చి అమలు చేయని పనులతో ఢోఖా కార్డును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ కడియం కావ్య, నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... కేటీఆర్కు సవాల్ విసిరారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఎన్నికలు జరుగుతాయా..? కోర్టు జోక్యంతో వాయిదా పడుతాయా..? రిజర్వేషన్లు మారుతాయా..? అనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. బీసీలకు ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించటంతో ఎన్నికలపై అనిశ్చితి కొనసాగుతోంది.
హనుమకొండలో హైదరాబాద్ యూనిట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇవాళ(ఆదివారం) సోదాలు నిర్వహించారు. అక్రమంగా అలుగు పొలుసులని (పాంగోలిన్ స్కేల్స్) రవాణా చేస్తున్న నలుగురు నిందితులని అరెస్ట్ చేశారు.
మద్యం షాపుల టెండర్కు లైసెన్స్ల గడువు పూర్తికాకముందే ప్రభుత్వం రెండు నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో రూ.2లక్షలు ఉన్న టెండర్ ఫీజు(నాన్ రిఫండబుల్)ను ఈసారి రూ.3లక్షలకు పెంచి ప్రభుత్వ ఖజానా నింపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 2025-27 మద్యం పాలసీని అమలు చేసేందుకు జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు.
జిల్లాలో బెల్టు షాపులు విచ్చల విడిగా వెలుస్తున్నాయి. వాడవాడకూ ఏర్పాటు అవుతోండడంతో మందు బాబుల చేబులకు చిల్లులు పడుతున్నాయి. గ్రామాలు, తండాల్లో జోరుగా బెల్టుషాపులు, గుడుంబా అ మ్మకాలు సాగుతోండడంతో మందు ప్రియులు మత్తులో జోగుతున్నారు.
సమ్మక్క సాగర్ బ్యారేజీకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వడానికి చత్తీ్సగడ్ సానుకూలత వ్యక్తం చేయటం రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుండగా.. కొత్త ఆయకట్టుపై సీడబ్ల్యుసీ అభ్యంతరాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద చూపించిన ఎస్సారెస్పీ-2 ఆయకట్టును సమ్మక్క సాగర్ కింద చూపించటం ఏమిటని సీడబ్ల్యుసీ ప్రశ్నిస్తోంది. సమ్మక్కసాగర్కు కొత్త ఆయకట్టు చూపించాలని సీడబ్ల్యుసీ కోరుతోంది.
మేడారం సమ్మక్క - సారలమ్మ అమ్మవార్ల గద్దెల ప్రాంగణ నిర్మాణాన్నిరూ.236 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క - సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళిక నమూనాను ముఖ్యమంత్రి విడుదల చేశారు.