భద్రకాళి సన్నిధిలో పవన్ సతీమణి
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:50 AM
వరంగల్ నగరంలోని చారిత్రక ప్రసిద్ధి పొందిన భద్రకాళి అమ్మవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా మంగళవారం దర్శించుకున్నారు.
అమ్మవారికి అన్నాలెజినోవా ప్రత్యేక పూజలు
వరంగల్ కల్చరల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): వరంగల్ నగరంలోని చారిత్రక ప్రసిద్ధి పొందిన భద్రకాళి అమ్మవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా ఆమె వల్లభ గణపతిని, ఆ తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యే క పూజలు నిర్వహించారు. పూజల అనంత రం అర్చకులు నాగరాజు శర్మ ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న.. అన్నాలెజినోవాకు అమ్మవారి శేషవస్త్రాలు అందజేశారు.