భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ సతీమణి
ABN , Publish Date - Feb 03 , 2026 | 07:14 PM
వరంగల్‌లో కొలువుదీరిన భద్రకాళి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా దర్శించుకున్నారు. మంగళవారం నాడు ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు.
వరంగల్, ఫిబ్రవరి 03: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం నాడు ఆలయానికి విచ్చేసిన అన్నా లెజినోవాకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దేవాలయంలో తొలుత ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని ఆమె దర్శించుకున్నారు. 
అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని మండపంలో అన్నా లెజినోవాకు అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం పలికి.. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవాలయానికి సంబంధించిన విశేషాలను అర్చకులను అడిగి ఆమె తెలుసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగాలపై త్వరలో సీఎం భారీ ప్రకటన: కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకటన
జగిత్యాలలో జగడం.. తీవ్రంగా స్పందించిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Read Latest Telangana News and National News