Share News

వరంగల్ మున్సిపల్ బరిలో ప్రధాన పార్టీలు.. ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - Feb 04 , 2026 | 08:54 AM

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి నుంచి ఊపందుకోనుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు రంగంలోకి దిగనున్నారు.

వరంగల్ మున్సిపల్ బరిలో ప్రధాన పార్టీలు.. ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం
Warangal Municipal Elections

ఉమ్మడి వరంగల్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి నుంచి జోరుగా కొనసాగనుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు రంగంలోకి దిగుతుండటంతో ప్రచారం రసవత్తరంగా మారింది. ప్రతి పార్టీ తమ అభ్యర్థుల విజయానికి వ్యూహాలు రచిస్తూ ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, సభలకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తొలిసారి మున్సిపల్ బరిలోకి దిగడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి పొత్తుగా పోటీ చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒంటరిగానే పోటీకి దిగాయి.


ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో పాటు, కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద తప్పడం లేదు. ముఖ్యంగా మహబూబాబాద్, నర్సంపేట, జనగామ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటం పార్టీ అధికారిక అభ్యర్థులకు సవాలుగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు గాను 1072 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ నుంచి 249 మంది, బీఆర్ఎస్ నుంచి 259 మంది, బీజేపీ నుంచి 238 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిగతా 326 మంది స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు కావడం గమనార్హం.


Also Read:

బీజేపీ తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్

అంతా కలలా ఉంది.. నా భార్య చాలా ధైర్యవంతురాలు

For More Telangana News

Updated Date - Feb 04 , 2026 | 08:54 AM