ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:52 AM
హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాల్లో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఇతర పనుల నిమిత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: బంజారాహిల్స్ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ మెరీడియన్, గుట్టల బేగంపేట ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు 11కేవీ శిల్పారామం, పవర్ మెక్, జూబ్లీ ఎన్‌క్లేవ్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.14, దసపల్లా హోటల్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ కళ్యాణ్ నగర్ పార్కు, అల్లావుద్దీన్ కోఠి, మేజెస్టిక్ మాన్షన్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ సీతారామయ్య టవర్స్, బేగంపేట షాపర్స్ స్టాప్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
అల్లాపూర్: అల్లాపూర్ ఫీడర్ అయ్యప్ప సొసైటీ సబ్-స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉండనుందని ఆ శాఖ ఏఈ రాకేష్ గౌడ్ తెలిపారు. గాయత్రి నగర్, జ్యోతి నగర్, లక్ష్మి నగర్, చంద్ర గార్డెన్స్ ప్రాంతాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అంతరాయం ఉండనుంది. అయ్యప్ప సొసైటీ ఫీడర్ పరిధిలో నియర్ తాజా కిచన్ పరిసర ప్రాంతాల నుంచి చందా నాయక్ తండా వరకు.. హ్యండాయ్ ఓహెచ్ ఫీడర్ పరిధిలో అయ్యప్ప రోడ్ నెం.34 నుంచి రోడ్ నెం.38 ఆర్‌ఆర్‌ఆర్ వైన్స్ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని రాకేష్ తెలిపారు. పద్మావతి ఫీడర్‌లో బోరబండ ఎస్‌ఎస్ పరిధిలోని అల్లాపూర్, శివబస్తి, రాధాకృష్ణ సొసైటీ, హమాల్ బస్తీ, పద్మావతి నగర్, కే.ఎస్.నగర్‌లలో ఉదయం 11 నుంచి 11:30 వరకు, వివేకానంద నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు వివేకానందనగర్‌లో(అన్ని బ్లాకులు) విద్యుత్ ఉండదన్నారు.
కాప్రా: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా జవహర్‌నగర్ ఫీడర్‌లోని రాఘవేంద్రనగర్, కస్తూరిబానగర్, జవహర్‌నగర్, వసంత్‌విహార్ కాలనీ, కృష్ణవేణినగర్, ఏపీఐఐసీ కాలనీ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 10.30 నుంచి 11 వరకు, కైలాసగిరి ఫీడర్‌లోని హెచ్‌బీ కాలనీ, భక్షిగూడ, కైలాసగిరి, నవోదయనగర్, రాజీవ్‌నగర్, లక్ష్మీనగర్, ఇందిరానగర్ పరిసర ప్రాంతాలలో ఉదయం 11 నుంచి 11.30 వరకు, కృష్ణానగర్ ఫీడర్‌లోని మోడీ అపార్ట్‌మెంట్స్, కృష్ణానగర్ పరిసర ప్రాంతాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు మౌలాలి సబ్ స్టేషన్ ఏఈ వెంకట్ రెడ్డి తెలిపారు.

సైనిక్‌పురి సబ్ స్టేషన్ పరిధిలో..
చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా రామాలయం ఫీడర్‌లోని డిఫెన్స్‌కాలనీ సొసైటీ ఆఫీస్, నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్, జేజేనగర్, నేరేడ్‌మెట్ చౌరస్తా పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు, డిఫెన్స్ కాలనీ ఫీడర్‌లోని రామాలయం టెంపుల్, డవున్ స్ట్రీట్, పంప్‌హౌస్ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని సైనిక్‌పురి సబ్ స్టేషన్ ఏఈ సత్యనారాయణ తెలిపారు.
బోడుప్పల్ పరిధిలో..
ఉప్పల్: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శనివారం బోడుప్పల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ఎన్.వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంద్రానగర్ 33/11 కేవీ సబ్ ేస్టషన్ పరిధిలోని బొల్లిగుడెం, వివేకానందనగర్, ఎస్‌బీఆర్ కాలనీ, మారుతినగర్ ఫీడర్లలో దశలవారీగా విద్యుత్‌కు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
- 11 కేవీ బొల్లిగూడెం ఫీడర్ పరిధిలోని బొల్లిగూడెం, అంజయ్య ఎన్‌క్లేవ్, అమ్మసాని వెంకట్‌రెడ్డి నగర్, ఎస్‌బీఆర్ కాలనీ, టెలిఫోన్ కాలనీ, రాజలింగం కాలనీ ఫేజ్-1, ఫేజ్-2, సురాజు నగర్, మహాలక్ష్మీ నగర్, బాలాజీ నగర్, లక్ష్మారెడ్డి నగర్ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నారు. 11 కేవీ వివేకానందనగర్ ఫీడర్ పరిధిలోని మనికంట నగర్, వివేకానందనగర్, శ్రీలక్ష్మీ నగర్, లేటర్స్ కాలనీ, నిన్ కాలనీ, ఐఐసీటీ కాలనీ, భీమ్‌రెడ్డి కాలనీ, అశోక్‌నగర్, గ్రీన్ సిటీ కాలనీ, అనగపురి కాలనీ ప్రాంతాల్లో కూడా విద్యుత్ నిలిపివేయనున్నారు.
- ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు 11 కేవీ ఎస్‌బీఆర్ కాలనీ ఫీడర్ పరిధిలోని పద్మావతి కాలనీ, ఆర్‌ఎన్‌ఎస్ కాలనీ, బీఎల్ నగర్, రెడ్డీస్ కాలనీ, న్యూ భవానీ నగర్, శుభోదయ కాలనీ, లేటర్స్ కాలనీ, గ్రిన్ సిటీ కాలనీ, అనగపురి కాలనీ, భీమ్‌రెడ్డి కాలనీ, ఎన్‌ఐఎన్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.
మధ్యాహ్నం 2.00 నుంచి 2.30 గంటల వరకు 11 కేవీ మరుతీనగర్ ఫీడర్ పరిధిలోని భవానీ నగర్, యాదవ బస్తీ, మాన్సాని కాలనీ, బీఎల్ నగర్, పీఎన్‌ఆర్ కాలనీ, మనికంట నగర్, గైలాక్స్ హోమ్స్, రామ్‌రెడ్డి నగర్, మరుతి నగర్, శ్రీ సాయి ఎన్‌క్లేవ్, సిద్థివినాయక చిత్రి, టెలిఫోన్ కాలనీ, యాదాద్రి కాలనీ ప్రాంతాలు
ఏఎస్ రావునగర్, గాయత్రినగర్‌లో..
ఏఎస్ రావునగర్: అణుపురం, ఏఎ్‌సరావునగర్, గాయత్రినగర్ ఫీడర్‌ల పరిధిలలో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఈ వేముల గంగాభవాని తెలిపారు. అణుపురం, శ్రీరాంనగర్, రాధికా చౌరస్తా, మహే్‌షనగర్, ఎల్‌ఐజి-బి ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఎల్‌ఐజి-బి, మహిళామండలి భవన్, ఆఫీసర్స్ కాలనీ, ప్రగతినగర్, ఏఎ్‌సరావునగర్ ఎంఐజి-ఏ,బి.సి ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు, పటేల్‌నగర్, కుషాయిగూడ డిపో, సుశిల్పా అపార్టుమెంట్స్, సాయిసాధనా అపార్టుమెంట్స్, కృష్ణ ధామం అపార్టుమెంట్స్, హెడ్‌ఎ్‌ఫసి బ్యాంకు పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 వరకు విద్యుత్ సరఫరాలో కోత ఉంటుందని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని ఆమె కోరారు.
నార్సింగ్: హిమాయత్‌సాగర్ ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్‌శాఖ ఏఈ రమేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
11 కేవీ మిలటరీ ఏరియా, 33/11 కేవీ ఇబ్రహీంబాగ్ ఫీడర్ల పరిధిల్లోని పీ అండ్ టీ కాలనీ, ఏబీసీడీ, స్పెషల్ బ్లాక్స్, మేప్లే టౌన్‌షి్‌ప, విశ్వాస్ టౌన్, హైదార్ ఎన్‌క్లైవ్ ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి 11:30 గంటల వరకు విద్యుత్ ఉండదు. - 11 కేవీ పెద్దమంగళారం, 33/11 కేవీ ఇబ్రహీంబాగ్ సబ్‌స్టేషన్ల పరిధిలోని హీరా కాలనీ, సన్‌సిటీ మెయిన్‌రోడ్డు, సీవైఆర్ కన్వెన్సన్, భాగ్యనగర్ ఓల్డ్ కాలనీ, కపిల్‌నగర్‌లో మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల వరకు విద్యుత్ ఉండదు. - 11 కేవీ హైదర్షాకోట్, 33/11 కేవీ గంధంగూడ సబ్‌స్టేషన్ ఫీడర్ పరిధిల్లోని వెంకటేశ్వర కాలనీ, డైమండ్ విల్లా, ప్రశాంత్‌నగర్, తిరుమలగార్డెన్, బచ్‌పన్‌స్కూల్, హర్మోన్‌విల్లా, పద్మశ్రీహిల్స్ మెయిన్ రోడ్డులో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
లక్‌నుమా సబ్‌స్టేషన్ పరిధిలో..
చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా సబ్ డివిజన్ పరిధిలోని సుల్తాన్‌షాహీ ఫీడర్ పరిధిలో శనివారం సుల్తాన్‌షాహీ, తలాబ్‌కట్ట, ఖాన్‌నగర్, నషేమాన్‌నగర్‌లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ రాజేందర్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..
జగన్ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత
Read Latest Telangana News and National News