Share News

మున్సిపల్ ఎన్నికల ఖర్చులపై నిశిత నిఘా

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:44 AM

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు వారం రోజులే. అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఖర్చు పరిమితి, ఎన్నికల అధికారుల లెక్కింపు ఎలా ఉంటుందో చూద్దాం.

మున్సిపల్ ఎన్నికల ఖర్చులపై నిశిత నిఘా
Hanumakonda Municipal Elections

హనుమకొండ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం సోమవారం జరిగింది. మంగళవారం ఉపసంహరణలకు చివరి తేదీ. నేడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. పోలింగ్‌ తేదీ ఈనెల 11న(మంగళవారం) నుంచి ఎన్నికల ప్రచారంపై అభ్యర్దులు చేసే ఖర్చు లెక్కింపు అధికారికంగా అమలులోకి వస్తుంది. ఎన్నికల ప్రచారానికి గడువు వారం రోజులే. అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఖర్చు పరిమితి, ఎన్నికల అధికారుల లెక్కింపు ఎలా ఉంటుందో చూద్దాం.


ఖర్చు పరిమితి

పార్టీ అభ్యర్థి అయినా, స్వతంత్ర అభ్యర్థి అయినా ఇద్దరికీ ఖర్చు పరిమితి ఒకేలా ఉంటుంది. నగర పంచాయతీలకు రూ.2లక్షలు, గ్రేడ్‌3 మున్సిపాలిటీలకు రూ.3లక్షల వరకు, గ్రేడ్‌ 2 మున్సిపాలిటీలకు రూ.4లక్షల వరకు, గ్రేడ్‌1 మున్సిపాలిటీలకు రూ.5లక్షల వరకు అభ్యర్థులు ఖర్చు చేయవచ్చు.

వీటిని ఖర్చు కింద లెక్కిస్తారు..

ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాహనాల అద్దె, మైక్‌ లేదా డీజే, సభలు, సమావేశాల నిర్వహణ, సో షల్‌ మీడియా ప్రచారం, కార్యకర్తలకు భోజనాలు, తాగునీరుపై పెట్టిన వ్యయాలన్నిటినీ ఎన్నికల ఖర్చు కిందే లెక్కిస్తారు. పార్టీ చేసిన ఖర్చు కూడా అభ్యర్థి ఖర్చుగానే పరిగణిస్తారు. ప్రతీ అభ్యర్థి తప్పనిసరిగా ఎన్నికల ఖర్చుల రిజిస్టర్‌ నిర్వహించాలి. ఎన్నికల అధికారికి మధ్యలో, ఎన్నికల తర్వాత 30 రోజులలోపు రిజిస్టర్‌ తప్పక కూపించాలి.


పరిమితి మించితే..

ఖర్చుల పరిమితి మించితే ఎన్నిక రద్దయ్యే ప్రమాదం ఉంది. అనర్హత వేసే, భవిష్యత్తు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. ఎన్నికల ఖర్చు విషయంలో పార్టీ అభ్యర్థికి ప్రత్యేక సడలింపు అంటూ ఏమీ ఉండదు. స్వతంత్ర అభ్యర్థికీ అదే పరిమితి వర్తిస్తుంది. అభ్యర్థుల ఖర్చులపై అధికారులు గట్టి నిఘా వేసి ఉంచుతారు. ప్రతీ రూపాయి లెక్కిస్తారు. అయితే అభ్యర్థి అనుమతితో లేదా ఆదేశంతో జరిగిన ప్రతీ ఖర్చు కచ్చితంగా లెక్కలోకి వస్తుంది. పార్టీ చేసింది అన్న కారణం చెప్పి తప్పించుకోలేరు.

ఖర్చుల తనిఖీ

అధికారులు ఎన్నికల ఖర్చును నిశితంగా తనఖీ చేస్తారన్న విషయాన్ని ప్రతీ అభ్యర్థి గుర్తుంచుకోవాలి. ఖర్చు రిజిస్టర్‌ను నిర్వ హిస్తున్నారా? ప్రతీ ఖర్చుకు బిల్‌ లేదా రశీదు ఉందా? ఖర్చు పరిమితి దాటిందా? పార్టీ చేసిన ఖర్చు మీ ఖర్చులో చూపించారా?, సోష ల్‌ మీడియా ఖర్చు చేపించారా? ప్రచారానికి ఎన్ని వాహనాలు వాడుతున్నారు? అనుమతి తీసుకున్నారా? వాహనాలపై ఫ్లెక్సీలు అనుమతి మేరకే ఉన్నాయా? ర్యాలీలు, రోడ్‌ షోలు అనుమతి తీసుకున్నారా? తదితర వాటిని తనిఖీ చేస్తారు. కనుక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సందర్బంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలను తూ.చ. తప్పక పాటించాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 12:28 PM