సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ABN , Publish Date - Feb 03 , 2026 | 10:26 AM
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వీరి మృతి ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. న్యాల్‌కల్ మండలం మామిడిగి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఒక ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ఆటో తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వడ్డీ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ కమల(40), భోజ్యానాయక్ తండాకు చెందిన అంబ్యానాయక్ (55) మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల చర్యలు..
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం జహీరాబాద్, బీదర్ ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి మృతి ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రహదారులపై ప్రయాణించేటప్పుడు అతివేగం ప్రమాదకరమని, ముఖ్యంగా మూలమలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?
Read Latest Telangana News And AP News And Telugu News