ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Minister Ponguleti Srinivas Reddy: తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
వరంగల్: కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లో ఓ కిలేడీ అరాచకాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. అమాయక ఆడపిల్లలే లక్ష్యంగా ఆమె చేసిన ఘోరాలు సినీ స్టోరీని తలపిస్తున్నాయి. మత్తు మందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన వారంతా చేసిన అకృత్యాలు పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
MP Balram Naik : రేవంత్ ప్రభుత్వంలో రైతులకు బోనసులు కూడా ఇచ్చామని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరామ్ నాయక్ అన్నారు. సీఆర్ హయాంలో మహిళలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని ఎంపీ బలరామ్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు ఎలా సంపాదించిందో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంపాదన సీక్రెట్ ఏంటో ప్రజలకూ చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం నెలకు రూ.లక్ష సంపాదించే నైపుణ్యమైనా యువతకు చెప్పాలని అన్నారు.
BRS Leaders Arrests: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనగామ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో జనగామలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 50 వేల మందితో శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
చిలుకూరి బ్రదర్స్ క్లాత్ స్టోర్ కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ కిలాడీ లేడీ కొంతకాలంగా వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన సదరు మహిళ తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ముఠా ఏర్పడింది.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఏజెంట్‍గా పని చేస్తున్నారు. బంధువుల ఇంటికి వెళ్లేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ (శనివారం) ఉదయం తన కారులో బయలుదేరాడు.