Congress BRS Card War: కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య కార్డుల వార్
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:36 PM
బీఆర్ఎస్ గతంలో హామీలు ఇచ్చి అమలు చేయని పనులతో ఢోఖా కార్డును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ కడియం కావ్య, నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
హనుమకొండ, అక్టోబర్ 6: కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య కార్డుల వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు కౌంటర్‌గా కాంగ్రెస్ ‘ఢోఖా కార్డు’ విడుదల చేసింది. హనుమకొండ కాంగ్రెస్ కార్యాలయంలో బీఆర్ఎస్ కా ఢోఖా కార్డును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ, నేతలు ఈరోజు (సోమవారం) విడుదల చేశారు. బీఆర్ఎస్ గతంలో హామీలు ఇచ్చి అమలు చేయని పనులతో ఢోఖా కార్డును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ కడియం కావ్య, నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అవినీతిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని.. కేటీఆర్ సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు.
‘మీ ఇంటి బిడ్డ కవిత వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు మేము జీవితకాలం బాకీ ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో అంతా అవినీతే జరిగింది. అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ నేతలను చూసి స్టువార్టుపురం దొంగలు సిగ్గుపడుతున్నారు. బీఆర్ఎస్ పాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఢోఖా బాజ్ కార్డు విడుదల చేస్తున్నాం. కాంగ్రెస్ క్యాడర్ అంతా ఈ కార్డును డౌన్ లోడ్ చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గ్రూప్-1 అభ్యర్థులు 3 కోట్ల రూపాయలు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేసిన దద్దమ్మలు బీఆర్ఎస్ నేతలు. మేం చెప్పిన మాటల్లో వాస్తవం లేకుంటే మాకు శిక్ష వేయండి’ అంటూ నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నాయిని నాగరాజు మాట్లాడుతూ.. ‘మమ్మల్ని చార్ సౌ బీస్ అంటుండు... వాళ్ల ఇంటిలోనే డెకాయిట్లు ఉన్నారు. లిక్కర్ స్కామర్స్ ఉన్నారు. టిల్లుగాడు ఆస్ట్రేలియాలో వందల ఎకరాలు కొన్నాడని సమాచారం. అందుకే మేము బీఆర్ఎస్‌కా ఢోఖా బాజ్ కార్డు విడుదల చేసినం. దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేయాలి’ నాయిని నాగరాజు అంటూ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
సుప్రీం తీర్పు శుభ పరిణామం: మహేష్ గౌడ్
హైదరాబాద్‌లో పెట్టుబడి... ఎలి లిల్లీ సంస్థకు సీఎం అభినందనలు
Read Latest Telangana News And Telugu News