Eli Lilly Hyderabad Investment: హైదరాబాద్‌లో పెట్టుబడి... ఎలి లిల్లీ సంస్థకు సీఎం అభినందనలు
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:29 PM
హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని.. పరిశ్రమలు పెట్టే వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందనని అన్నారు. 1965లో ఇందిరా గాంధీ హైదరాబాద్‌కు ఐడీపీఎల్ తీసుకురావడంతో ఫార్మా హబ్‌గా మారిందన్నారు. హైదరాబాద్‌లో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 6: సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు ఈరోజు (సోమవారం) ఐసీసీసీలో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో 9 వేల కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎలి లిల్లీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఎలి లిల్లీ సంస్థను ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణపైన నమ్మకం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని.. పరిశ్రమలు పెట్టే వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందని అన్నారు. 1965లో ఇందిరా గాంధీ హైదరాబాద్‌కు ఐడీపీఎల్ తీసుకురావడంతో ఫార్మా హబ్‌గా మారిందన్నారు. హైదరాబాద్‌లో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయన్నారు.
40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయని.. కోవిడ్ వ్యాక్సిన్‌లు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అయ్యాయని తెలిపారు. ఫార్మా పాలసీని తమ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. జినోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జినోమ్ వ్యాలీకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అందిస్తామన్నారు. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఫార్మ్‌కు సంబంధించిన అనేక మంది ప్రముఖులు స్కిల్ యూనివర్సిటీ బోర్డు మెంబర్స్‌గా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
ఆయుధ విరమణపై మల్లోజుల కీలక ప్రకటన
సుప్రీం తీర్పు శుభ పరిణామం: మహేష్ గౌడ్
Read Latest Telangana News And Telugu News