Share News

Maoist Mallojula Letter: ఆయుధ విరమణపై మల్లోజుల కీలక ప్రకటన

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:49 PM

పార్టీ క్యాడర్‌ను కాపాడుకొని అనవసర త్యాగాలకు పుల్ స్టాప్ పెట్టాలని మల్లోజుల పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు కొనసాగించిన పంధా పూర్తిగా తప్పిదమే అని అంగీకరించారు.

Maoist Mallojula Letter: ఆయుధ విరమణపై మల్లోజుల కీలక ప్రకటన
Maoist Mallojula Letter

హైదరాబాద్, అక్టోబర్ 6: సాయుధ పోరాట విరమణపై మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల (maoist Leader Mallojula) స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ మేరకు పార్టీ క్యాడర్‌కు లేఖ రాశారు. ఇందులో పార్టీ అధికార ప్రతినిధి జగన్‌కు కౌంటర్ ఇచ్చారు మల్లోజుల. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ లేఖలో వెల్లడించారు. పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయామంటూ క్షమాపణలు చెప్పారు.


పార్టీ క్యాడర్‌ను కాపాడుకొని అనవసర త్యాగాలకు పుల్ స్టాప్ పెట్టాలని మల్లోజుల పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు కొనసాగించిన పంధా పూర్తిగా తప్పిదమే అని అంగీకరించారు. తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని సూచించారు. వర్తమాన ఫాసిస్టు పరిస్థితులలో మావోల లక్ష్యాన్ని నెరవేర్చలేమన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్‌కు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

రిజర్వేషన్లపై ఏకాభిప్రాయం.. అయినా కోర్టుకు వెళ్లారన్న మంత్రి

ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. విద్యార్థికి సాయం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2025 | 12:56 PM