KTR Helps Student: ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. విద్యార్థికి సాయం
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:05 PM
పెద్దమ్మగడ్డ గ్రామానికి చెందిన విద్యార్థి గణేష్ సరస్వతీ పుత్రుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను, తోబుట్టువును కోల్పోయిన గణేష్ అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. చిన్నప్పటి నుంచి గణేష్ చదువులో మంచిగా రాణించేవాడు.
హనుమకొండ, అక్టోబర్ 6: పేద విద్యార్థిని ఆదుకున్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR). వరంగల్ జిల్లా పెద్దమ్మగడ్డకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేష్ ట్వీట్‌కు మాజీ మంత్రి స్పందించారు. గణేష్ చదువుకునే బాధ్యతను బీఆర్‌ఎస్ పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేస్తూ.. తక్షణ సాయం కింద లక్షా యాభై వేల రూపాలయను విద్యార్థికి పంపించారు కేటీఆర్. ఆ పేద విద్యార్థి కలను నెరవేర్చేందుకు మాజీ మంత్రి తన వంతు సహాయం అందజేశారు.
ఇదీ విషయం
పెద్దమ్మగడ్డ గ్రామానికి చెందిన విద్యార్థి గణేష్ సరస్వతీ పుత్రుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను, తోబుట్టువును కోల్పోయిన గణేష్ అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. చిన్నప్పటి నుంచి గణేష్ చదువులో మంచిగా రాణించేవాడు. గణేష్ మొత్తం విద్యాభ్యాసం కూడా ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదవాడు. ఆ క్రమంలో ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సంపాదించాడు. అయితే ఈరోజు (ఈ నెల 6) వరకు (ట్యూషన్ ఫీజు & డిపాజిట్ )1,50,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ అమౌంట్ చెల్లించకపోతే సీటు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో పేదవాడు అయిన గణేష్ అంతమొత్తం చెల్లించలేని పరిస్థితి. గణేష్ గురించి తెలుసుకున్న కొందరు... అతడి పరిస్థితిని వివరిస్తూ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
దీనిపై మాజీ మంత్రి వెంటనే స్పందిస్తూ విద్యార్థిని ఆదుకుని.. అతడి చదువు కొనసాగేలా చేశారు. తక్షణ సహాయం కింద లక్షన్నర రూపాయలను పంపించారు. అంతేకాకుండా గణేష్ చదువు బాధ్యతను బీఆర్‌ఎస్ పార్టీ చూసుకుంటుందని హామీ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్.. స్వయంగా వెళ్లి గణేష్‌కు డబ్బును అందజేశారు. గణేష్‌ను ఇవాళే కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో జాయిన్ చేసి, బాధ్యతలు తీసుకుంటామని ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ వెల్లడించారు. స్వయంగా కేటీఆర్.. తన సమస్యకు స్పందించి వెంటనే సాయం చేయడం పట్ల విద్యార్థి గణేష్ హర్షం వ్యక్తం చేశాడు. కష్టపడి చదవి డాక్టర్ అవుతానని గణేష్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి...
రిజర్వేషన్లకు సర్కార్ కట్టుబడి ఉంది: భట్టి విక్రమార్క
రిజర్వేషన్లపై ఏకాభిప్రాయం.. అయినా కోర్టుకు వెళ్లారన్న మంత్రి
Read Latest Telangana News And Telugu News