Telangana BC Reservation: రిజర్వేషన్లకు సర్కార్ కట్టుబడి ఉంది: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Oct 06 , 2025 | 10:52 AM
రిజర్వేషన్ల కల్పన కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం అభిషేక్ మనుసింగ్వితో వాదనలు వినిపిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని తమకు నమ్మకం ఉందని చెప్పారు. ఇందిరా సహానీ కేసు తీర్పు ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్లు కల్పించవచ్చన్నారు. సిపెక్ సర్వే ద్వారా సమగ్రమైన జన గణన వివరాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వెల్లడించారు.
రిజర్వేషన్ల కల్పన కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాగా.. బీసీ రిజర్వేషన్‌పై సుప్రీం కోర్టులో జరిగే వాదనలు సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి కోర్టుకు హాజరుకానున్నారు.
ఇవి కూడా చదవండి...
రిజర్వేషన్లపై ఏకాభిప్రాయం.. అయినా కోర్టుకు వెళ్లారన్న మంత్రి
నగరంలో ఏం జరుగుతోంది.. ఒకే సారి ఎండ, వాన
Read Latest Telangana News And Telugu News