Telangana 42 Percent Reservation: రిజర్వేషన్లపై ఏకాభిప్రాయం.. అయినా కోర్టుకు వెళ్లారన్న మంత్రి
ABN , Publish Date - Oct 06 , 2025 | 10:07 AM
రాష్ట హైకోర్టులో వాదనలు జరిగాయని.. ఎన్నికల నోటిఫికేషన్‌కు వెళ్లొచ్చని చెప్పారని మంత్రి వెల్లడించారు. హైకోర్టులో ఈకేసుపై 8వ తేదీ విచారణ జరగాల్సి ఉందని.. ఈ లోపే వారు సుప్రీంకోర్టుకు వచ్చారన్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: తెలంగాణ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట వ్యాప్తంగా ఇంటికి ఇంటికి సర్వే నిర్వహించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సబ్ కమిటీ ద్వారా సమీక్షించి క్యాబినెట్ అనుమతి తీసుకొని దాన్ని అసెంబ్లీలో పెట్టి అన్ని రాజకీయాల పార్టీల ఏకగ్రీవ నిర్ణయంతో చట్టాన్ని గవర్నర్‌కు పంపించామని తెలిపారు. గవర్నర్ రాష్ట్రపతికి పంపించారన్నారు. అయితే దీనిపై కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్తున్నారని మండిపడ్డారు.
రాష్ట హైకోర్టులో వాదనలు జరిగాయని.. ఎన్నికల నోటిఫికేషన్‌కు వెళ్లొచ్చని చెప్పారని మంత్రి వెల్లడించారు. హైకోర్టులో ఈకేసుపై 8వ తేదీ విచారణ జరగాల్సి ఉందని.. ఈ లోపే వారు సుప్రీంకోర్టుకు వచ్చారన్నారు. న్యాయబద్ధంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఢిల్లీ వచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కాగా.. 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో ఈరోజు విచారణ జరుగనుంది. సుప్రీంలో వాదనలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ తరపున సింగ్వి , దవే వాదనలు వినిపించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు బట్టి విక్రమార్క , పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని పిటిషన్ వేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని పిటిషిన్ దాఖలైంది. జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం ముందు కేసు విచారణ రానుంది.ర
ఇవి కూడా చదవండి...
నగరంలో ఏం జరుగుతోంది.. ఒకే సారి ఎండ, వాన
భాగ్యనగరంలో దంచికొడుతున్న వర్షం.. పలు కాలనీలు జలమయం
Read Latest Telangana News And Telugu News