Heat and Rain at Once: నగరంలో ఏం జరుగుతోంది.. ఒకే సారి ఎండ, వాన
ABN , Publish Date - Oct 06 , 2025 | 09:04 AM
గ్రేటర్ హైదరాబాద్ వర్షంతో తడిసి ముద్దయింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మణికొండ, దిల్ సుఖ్ నగర్, యూసఫ్ గూడ, అబిడ్స్, ఖైరతాబాద్, బోరబండ తదితర ప్రాంతాలలో వర్షం పడుతోంది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఒకే సారి ఎండ, వాన జనాల్ని ఆశ్చర్యపరిచాయి. సాధారణంగా వాన పడుతున్నపుడు ఎండ ఉండదు. ఒక వేళ ఎండ కొట్టినా కొన్ని నిమిషాల్లోనే మబ్బులు కమ్మేస్తాయి. కానీ, సోమవారం ముందెన్నడూ లేని విధంగా ఓ వైపు వాన పడుతుంటే మరో వైపు ఎండకాసింది. అది కూడా గంటకు పైగా ఈ వింత పరిస్థితి చోటుచేసుకుంది. దీంతో జనం ఆశ్చర్యపోయారు. ఆ దృశ్యాన్ని యువత తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

ఇక, గ్రేటర్ హైదరాబాద్ వర్షంతో తడిసి ముద్దయింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మణికొండ, దిల్ సుఖ్ నగర్, యూసఫ్ గూడ, అబిడ్స్, ఖైరతాబాద్, బోరబండ తదితర ప్రాంతాలలో వర్షం పడుతోంది. మరోవైపు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. రుద్రవెల్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ప్రవహిస్తోంది. మూసీ వరద ప్రవాహంతో భూదాన్ పోచంపల్లి - బీబీనగర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి
స్కూటీపై వెళుతుండగా విషాదం.. చెట్టు విరిగిపడ్డంతో..
మ్యాగీల పిచ్చి.. ఈ పిల్లాడు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..