Sell Sisters Ring To Buy Maggi: మ్యాగీల పిచ్చి.. ఈ పిల్లాడు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Oct 06 , 2025 | 07:39 AM
13 ఏళ్ల బాలుడు మ్యాగీలు తినడానికి బానిస అయ్యాడు. మ్యాగీలు కొనుక్కోవడానికి డబ్బుల కోసం ప్రతీ రోజూ తల్లిదండ్రులను వేధించేవాడు. కొద్దిరోజుల క్రితం ఇంట్లో వారు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. దీంతో బాలుడు దొంగలా మారిపోయాడు.
మ్యాగీలు తినడానికి బానిస అయిన ఓ పిల్లాడు షాకింగ్ పని చేశాడు. అక్క ఎంగేజ్‌మెంట్ రింగ్ దొంగిలించాడు. దాన్ని బంగారు నగల దుకాణంలో అమ్మడానికి ప్రయత్నించాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, కాన్పూర్‌లోని శాస్త్రి నగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు మ్యాగీలు తినడానికి బానిస అయ్యాడు. రోజుకు రెండు, మూడు మ్యాగీ ప్యాకెట్లు తినందే అతడి మనసు ఊరుకోదు.
మ్యాగీలు కొనుక్కోవడానికి డబ్బుల కోసం ప్రతీ రోజూ తల్లిదండ్రులను వేధించేవాడు. కొద్దిరోజుల క్రితం ఇంట్లో వారు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. దీంతో బాలుడు దొంగలా మారిపోయాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అక్క ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను దొంగిలించాడు. స్థానికంగా ఉండే పుష్ఫేంద్ర జైశ్వాల్ నగల దుకాణానికి వెళ్లాడు. ఉంగరాన్ని అమ్మే ప్రయత్నం చేశాడు. అయితే, పుష్ఫేంద్రకు అనుమానం వచ్చి ఉంగరాన్ని కొనుక్కోలేదు. బాలుడ్ని కొన్ని ప్రశ్నలు వేశాడు.
బాలుడు అన్నింటికి సమాధానం చెప్పాడు. మ్యాగీలు కొనుక్కోవటం కోసం ఉంగరాన్ని అమ్ముతున్నానని అన్నాడు. పుష్ఫేంద్ర వెంటనే బాలుడి తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె షాపు దగ్గరకు రాగానే ఉంగరం చూపించాడు. అది తన కూతురి ఎంగేజ్‌మెంట్ రింగని ఆమె గుర్తుపట్టింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉందని చెప్పింది. ఒక వేళ ఆ ఉంగరం పోయి ఉంటే కుటుంబం చాలా కలత చెందాల్సి వచ్చేదని వాపోయింది. పుష్ఫేంద్ర ఉంగరాన్ని ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనం నగల వ్యాపారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం.. 6 మంది పేషంట్లు మృతి..