Tree Falls On Two Wheeler: స్కూటీపై వెళుతుండగా విషాదం.. చెట్టు విరిగిపడ్డంతో..
ABN , Publish Date - Oct 06 , 2025 | 08:36 AM
భాస్కర్ అనే వ్యక్తి స్కూటీ నడుపుతున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో రోడ్డుపై వేగంగా వెళుతున్న స్కూటీపై చెట్టు విరిగిపడింది. వెనకాల కూర్చున్న కీర్తనపై చెట్టు పడ్డంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సం కారణంగా డార్జిలింగ్‌లో 20 దాకా చనిపోయారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం రాత్రి కర్ణాటకలో పెను విషాదం చోటుచేసుకుంది. స్కూటీపై చెట్టు విరిగిపడిన ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు, హెబ్బల్‌కు చెందిన కీర్తన ఆదివారం రాత్రి స్కూటీపై ఇంటికి వెళుతోంది.
భాస్కర్ అనే వ్యక్తి స్కూటీ నడుపుతున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో రోడ్డుపై వేగంగా వెళుతున్న స్కూటీపై చెట్టు విరిగిపడింది. వెనకాల కూర్చున్న కీర్తనపై చెట్టు పడ్డంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. భాస్కర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి గాయాలు అయ్యాయి. అటువైపు వెళుతున్న వాహనదారులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
కీర్తన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ‘బలమైన గాలి, వాన కారణంగా చెట్టు విరిగిపడింది. అది బైకు మీదపడ్డంతో ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేశాము. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
మ్యాగీల పిచ్చి.. ఈ పిల్లాడు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..
ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం.. 6 మంది పేషంట్లు మృతి..