BC Reservation Verdict Congress: సుప్రీం తీర్పు శుభ పరిణామం: మహేష్ గౌడ్
ABN , Publish Date - Oct 06 , 2025 | 01:56 PM
8వ తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అన్ని వర్గాలు సహకరించాలని మహేష్ గౌడ్ కోరారు.
హైదరాబాద్, అక్టోబర్ 6: బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌కు కొట్టివేస్తూ సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు స్పందించారు. పీసీసీ చీప్ మహేష్ గౌడ్ (PCC Chief Mahesh Goud) స్పందిస్తూ.. సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన కేసును కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందని తెలిపారు. 8వ తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అన్ని వర్గాలు సహకరించాలని మహేష్ గౌడ్ కోరారు.
వారి కుట్రలు అర్ధం చేసుకోండి: మహేష్
సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ అన్నారు. బీసీ బిడ్డలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇస్తే కొందరు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ చిత్తశుద్దిగా ఉందన్నారు. బీజేపీ బీఆర్ఎస్‌లు చేస్తున్న కుట్రలను బీసీలు అర్థం చేసుకోవాలని అన్నారు. బీసీ బిడ్డల నోటి దగ్గర ముద్దను లాక్కోవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతలు కుల సంఘ నాయకుని ముద్ర వేసుకుని కోర్టుకు వెళ్తున్నారని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల పెంపును అడ్డుకునే ఉత్సాహాన్ని బీసీలు గమనిస్తున్నారని మహేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. విద్యార్థికి సాయం
ఆయుధ విరమణపై మల్లోజుల కీలక ప్రకటన
Read Latest Telangana News And Telugu News