Share News

Errabelli Slams Revanth Over Reservation: ప్రజలు తిరగబడతారనే తెరపైకి రిజర్వేషన్ల అంశం: ఎర్రబెల్లి దయాకర్

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:49 PM

మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని మాజీ మంత్రి అన్నారు. వరంగల్, కరీంనగర్‌లో మంత్రులు మంత్రులే కొట్టుకుంటున్నారని తెలిపారు.

Errabelli Slams Revanth Over Reservation: ప్రజలు తిరగబడతారనే  తెరపైకి రిజర్వేషన్ల అంశం: ఎర్రబెల్లి దయాకర్
Errabelli Slams Revanth Over Reservation

హనుమకొండ, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకార్ రావు (Former Minister Errabelli Dayakar Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మోసకారి అంటూ వ్యాఖ్యలు చేశారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని... ఇంటింటికీ గ్యారంటీ కార్డులిచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు. అబద్ధాలను కూడా నిజం చేసే మాటకారి రేవంత్ రెడ్డి అంటూ కామెంట్స్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని మాజీ మంత్రి అన్నారు. వరంగల్, కరీంనగర్‌లో మంత్రులు మంత్రులే కొట్టుకుంటున్నారని తెలిపారు.


స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ప్రజలు తిరగపడతారని రిజర్వేషన్ల అంశం తెరపైకి తెచ్చి డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు రిజర్వేషన్ల హక్కు ఇవ్వడమనేది నేరమని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను మరిపించడం కోసం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల డ్రామా ఆడుతున్నారంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు.


ఇవి కూడా చదవండి...

చంద్రబాబు విజనరీ లీడర్.. ప్రతీ అడుగు ప్రగతి దిశవైపే: మంత్రి మండిపల్లి

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చిందంటే...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 10 , 2025 | 01:52 PM