హైదరాబాద్ హయత్నగర్లో కారు ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న అన్న నవీన్, చెల్లి రేఖ మృతి చెందారు. పెద్ద అంబర్పేట్కు చెందిన వీరు దసరా పండగ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఆదివారం అమ్మవారు మహాదుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాదంలో తన కూతురు ప్రాణాలు కోల్పోవడంతో నారాయణదాసు సోనా (18) తండ్రి కన్నీరుమున్నీరు అవుతున్నారు.
హైదరాబాద్.. నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో దాండియా ఉత్సవం సందర్భంగా జరిగిన ప్రమాద ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు.
హైదరాబాద్లో పండుగల నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా.. సీవరేజ్ నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆర్టీసీ బస్టాండ్లో కత్తుల కలకలం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది.
తెలంగాణ చేపట్టిన, అనుమతులు సాధించిన ప్రాజెక్టులపై చర్చించాలనే ఏపీ విజ్ఞప్తులను గోదావరి నది యాజమాన్య బోర్డు తోసిపుచ్చింది.
ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది.