Share News

ఖాకీ బుక్కు కాంగ్రెస్‌కేనా?

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:58 AM

‘రాష్ట్రంలో ఖాకీ బుక్కు పనిచేసేది ఒక్క కాంగ్రెస్‌కేనా ..? మెదక్‌లో గూండాల రాజ్యం నడుస్తోందా..? ప్రభుత్వ పాలన నడుస్తోందా..?’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు.

ఖాకీ బుక్కు కాంగ్రెస్‌కేనా?

  • మెదక్‌లో గూండాల రాజ్యం నడుస్తోందా..?

  • ప్రభుత్వ పాలన నడుస్తోందా..?: హరీశ్‌

కంది/కవాడిగూడ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఖాకీ బుక్కు పనిచేసేది ఒక్క కాంగ్రెస్‌కేనా ..? మెదక్‌లో గూండాల రాజ్యం నడుస్తోందా..? ప్రభుత్వ పాలన నడుస్తోందా..?’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. ఈ నెల 9న మెదక్‌లో అరెస్టయిన 13 మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కందిలోని సంగారెడ్డి సెంట్రల్‌ జైలులో ఉండగా, శనివారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన వారితో ములాఖత్‌ అయ్యారు. అనంతరం ఆయన జైలు గేటు వద్ద హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులు ఆపాలని, కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని అరాచకాలు చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గుడ్డిగా పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని, తాము ప్రతి ఒక్కటీ డైరీలో నోట్‌ చేస్తున్నామని, ఎవ్వరిని వదిలిపెట్టేది హెచ్చరించారు.

అమెరికాతో ఒప్పందంతో రైతులకు అన్యాయం

రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియో గం చేసుకొని వ్యవసాయంచేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉందని హరీశ్‌ రావు అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న రైతుబడి అగ్రిషో రెండోరోజు శనివారం హరీశ్‌రావు, మాజీ గవర్నర్‌ బండా రు దత్తాత్రేయ హాజరై వివిధ స్టాళ్లను సందర్శించారు.

Updated Date - Feb 22 , 2026 | 06:59 AM