హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజారులో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోట 13, వంకాయ 28, బెండకాయ 23, పచ్చిమిర్చి 26, బజ్జిమిర్చి 55, కాకరకాయ రూ.26లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-2 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లో ఇళ్ల విక్రయాల పరంగా కొంత మందగమనం కనిపించినప్పటికీ.. మార్కెట్ మాత్రం వృద్ధి బాటలోనే కొనసాగుతోంది.. 2026 తొలి అర్ధభాగంలో (హెచ్1-సీవై26) నగరంలో 26,100 ఇళ్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.52,900 కోట్లు. ప్రధాన నగరాలతో పోలిస్తే విక్రయాల పరంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది.
పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఓ జిల్లాకు గతంలో కలెక్టర్‌గా పనిచేశారామె! ఇప్పుడు ఒక శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. అక్కడ టెండరు వ్యవహారాలను ఓకే చేసే బాధ్యత ఆమెదే.
రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసన ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)లో భాగంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు.
తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ కుమారుడు 12 గంటల వ్యవధిలోనే చనిపోయాడు. హనుమకొండ జిల్లాలో ఈ విషాదం నెలకొంది. ఐనవోలుకు చెందిన నర్సయ్య గ్రామ పంచాయతీలో కార్మికుడిగా పనిచేస్తూ..
తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 2,76,94,830 ఎకరాలు. ఇటీవల రెవెన్యూ శాఖ భూభారతిలో నమోదు చేసిన విస్తీర్ణం 2,49,97,312 ఎకరాలు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 26,97,518 ఎకరాలు. ఇది మొత్తం భూముల్లో 9.74 శాతానికి సమానం.
నేరానికి కారణాలు, నేరస్థులు అనుసరించిన విధానం, దర్యాప్తు తీరును ఉన్నతాధికారులు సమీక్షిస్తుండాలని డీజీపీ ఆనంద్ సూచించారు. పోలీసు ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం అర్ధవార్షిక నేరసమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళా వ్యతిరేక పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం దక్కకుండా అడ్డంకులు సృష్టించాయని ఆరోపించారు.