భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఉన్న 44వ జాతీయ రహదారిపై ఎలక్ట్రిక్ స్కూటీపై నలుగురు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది.
42 శాతం బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. 42 శాతం అమలు ప్రాసెస్ కాంగ్రెస్ సరిగా చేయలేదన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచిపేరు వస్తుందని తనపై కొంతమంది విమర్శలు చేసున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రెండు గ్రూపులను చేదరగొట్టారు. అనంతరం గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కామారెడ్డిలో వరద నష్టం అంచనాపై రీ సర్వే చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ సూచించారు. కామారెడ్డిలో వరద నష్టానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఎంపీ ధర్మపూరి అర్వింద్ ప్రశ్నించారు.
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గోదావరి జలాలు గుండెకాయ అని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని పేర్కొన్నారు. మామ, అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా పాపాలు పోవని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల ధాటికి పలువురు గల్లంతయ్యారు. వివిధ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన కల్వకుంట్ల కవిత.. ఈ జిల్లాకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 25 లక్షల మంది బీసీ జనాభా ఉంటే.. వారిలో ఒక్క బీసీ వర్గానికి చెందిన వారు లేరని గుర్తు చేశారు.
జిల్లా కేంద్రంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ముందస్తు ఆర్డర్స్ ఇచ్చిన వారికి 40 శాతం డిస్కౌంట్ అంటూ అడ్వాన్స్ వసూలు చేసి బోర్డు తిప్పేసారు ఓ ట్రేడర్స్ షాపు.